Naga Panchami Serial Today December 27th Episode - 'నాగ పంచమి' సీరియల్: నాగ చంద్రకాంత మొక్కని భూలోకానికి తెమ్మని ఫణేంద్రకు చెప్పిన పంచమి, షాక్‌లో మేఘన!
Naga Panchami Today Episode నాగ చంద్రకాంత మొక్క గురించి పంచమి ఫణేంద్రతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Telugu Serial Today Episode
మోక్ష: ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోక తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకటి చేల్చుకొని తీరాల్సిందే. మీ అమ్మగారు ఫోన్..
గౌరి: పంచమి పక్కన ఎవరైనా ఉన్నారు. మీ భార్యాభర్తల ఇద్దరి సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా కానీ అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలీదమ్మా.
పంచమి: నా గురించి నాకన్నా నువ్వే ఎక్కువ వేదన అనుభవిస్తున్నావ్ అమ్మా.. నా తలరాతను ఎవరూ మార్చలేరు.
గౌరి: నేను చెప్పేది వినమ్మా. నాగలోకంలో ఇష్టరూప నాగుల విషానికి విరుగుడుగా పనిచేసే నాగ చంద్రకాంత మొక్కలు ఉంటాయటమ్మా. నాగ సాధువు గారు చెప్పారు. అది సంపాదించగలిగితే మీ ఇద్దరి సమస్య తీరిపోతుంది. అల్లుడు గారిని బతికించుకోవచ్చు.
పంచమి: తల్లిగా నీ తపన అర్థమవుతుంది అమ్మా.. మా కోసం నువ్వు పోరాడుతున్నావు. నా ప్రయత్నాలు అన్నీ నేను చేస్తున్నాను అమ్మా. కానీ నా కోసం నువ్వు దిగులు పెట్టుకోకు. నాకు చివరి కోరిక కోరుకునే అవకాశం ఉంటే ప్రతీ జన్మలోనూ నీ కడుపులోనే పుట్టాలి అని కోరుకుంటాను అమ్మా. నేను ఉంటాను అమ్మా.. (మోక్షతో..) నేను నాగలోకం వెళ్లగలిగితే చాలా అవకాశాలు ఉన్నాయి. మా అమ్మకి నాగ సాధువుగారు చెప్పారట ఇష్టరూప నాగుల విషానికి నాగలోకంలో విరుగుడుగా మొక్కలు దొరుకుతాయట.
మోక్ష: నాకు దేనిమీద ఆశలు నమ్మకాలు లేవు. అన్నీ కనుమరుగైపోయాయి. నేను అంతే ఏ క్షణం అయినా ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోవచ్చు. అప్పుడు ఎవరికీ నా సమస్య ఉండదు.
మేఘన: (వైదేహి రావడం చూసి) ముందు ఈవిడని వలలో వేసుకుంటే తర్వాత మోక్షకి దగ్గర అవ్వడం సులభం. నాగమణి వచ్చేలోగా మోక్షను మచ్చిక చేసుకోవాలి. నాతోనే ఛాలెంజ్ చేసిన పంచమికి నా అన్న వాళ్లే లేకుండా చేయాలి. భర్త మీద ఈగ కూడా వాలనివ్వకుండా కాపాడుకుంటానని రెచ్చిపోయింది. మోక్ష నీడను కూడా పంచమి తాకుండా చేస్తాను అనుకుంటుంది.
ఇక తన మంత్ర శక్తులతో మెట్లమీద నూనె వేసి వైదేహి కింద పడిపోయేలా చేస్తుంది. వైదేహి నొప్పితో విలవిల్లాడితే తన దగ్గరకు పంచమి పరుగున వచ్చి పట్టుకుంటే వైదేహి పక్కకు నెట్టేస్తుంది. మోక్షని కూడా తాకనివ్వదు వైదేహి. తన మాట వినని వారు తాకొద్దు అంటుంది. అదే అదునుగా మేఘన తనకు చిట్కాలు తెలుసు అని నాటువైద్యం చేసినట్లు చేసి తన మంత్ర శక్తులతో నొప్పి తగ్గించేస్తుంది. ఒక్క సారిగా నొప్పి తగ్గిపోవడంతో వైదేహి మేఘనకి ఫిదా అయిపోతుంది.
ఫణేంద్ర: మోక్షని ఒప్పించావా యువరాణి..
పంచమి: నా భర్త అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. శత్రువుని బతికించాల్సిన అవసరం నాగలోకానికి ఏంటి.
మేఘన: నువ్వు నాగలోకానికి వస్తాను అన్నందుకు.
పంచమి: ఇప్పుడు ఆ మాట చెప్తే నన్ను కాటేసి చంపి నాగలోకానికి వెళ్లిపోమంటారు. మోక్ష బాబుని నమ్మించగలను అన్న నమ్మకం పోయింది.
ఫణేంద్ర: ఏం చేయాలి అనుకుంటున్నారో మీరే చెప్పండి యువరాణి.
పంచమి: నేను నాగలోకం రాకుండా నాగమణిని ఇక్కడికి తెచ్చే అవకాశం ఉంటే. మనం అనుకున్న పని జరుగుతుంది.
మేఘన: ఆలోచించు యువరాజా ఏదో ఒక విధంగా నువ్వే ఆ నాగమణిని తీసుకొచ్చే. అప్పుడు మోక్షని బతికించి యువరాణిని నీతో తీసుకెళ్లిపోవచ్చు.
ఫణేంద్ర: అసాధ్యం.. అలాంటి మార్గం ఉండుంటే ముందే చెప్పేవాడిని. ఇక నాగమణి విషయం మర్చిపోండి.
మేఘన: అలా అంటే ఎలా యువరాజా నాగమణి లేకుండా మోక్షని ఎలా బతికించగలం.
పంచమి: బతికించగలం. మార్గం ఉంది. సాధ్యమే యువరాజా.. నువ్వు తలచుకుంటే నాగమణి లేకుండానే నా భర్తను బతికించగలం.
ఫణేంద్ర: నువ్వు కాటు వేసి చంపేయగానే నేను విషం లాగితే బతుకుతాడు అని ఆశ పడుతున్నట్లు ఉన్నావ్ యువరాణి. అలా చేసినా కొన్ని గంటలు ప్రాణం నిలబెట్టగలను కానీ చావుని మాత్రం నిలపలేను.
పంచమి: నాగమణితో పని లేకుండా మోక్షాబాబు బతికే అవకాశం ఉంది. నీకు బాగా తెలిసిన ఒక పేరు చెప్తాను యువరాజా. నాగ లోకంలో అరుదుగా దొరికే మొక్క నాగచంద్రకాంత. ఆ మొక్కని తీసుకురాగలిగితే ఇక నాగమణితో పని లేదు.
ఫణేంద్ర: నాగచంద్రకాంత.. ఈ మొక్క గురించి నీకు ఎలా తెలుసు.
పంచమి: నేను ఒక నాగకన్యని అని మర్చిపోకు యువరాజా. ఇష్టరూప నాగు విషానికి విరుగుడుగా నాగచంద్రకాంత మొక్క సంజీవినిగా పనిచేస్తుంది.
ఫణేంద్ర: నువ్వు చెప్పింది అక్షరాలా నిజం యువరాణి. నాగ చంద్రకాంత మొక్క విషాన్ని విరిచేసి చావు నుంచి కాపాడుతుంది. కానీ చనిపోయిన వారిని బతికించలేదు.
పంచమి: పరవాలేదు యువరాజా నువ్వు వెళ్లి ఆ మొక్క తీసుకురా నేను మోక్షని కాటేయగానే.. ఆ మొక్కతో కాపాడుదాం.
మేఘన: మనసులో.. మొక్కని తెచ్చి నువ్వు మోక్షని కాపాడితే నేను చనిపోయిన మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలి.
ఫణేంద్ర: అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత నువ్వు నాతో నాగలోకానికి రాను అంటే..
పంచమి: నేను ఇచ్చిన మాట తప్పను యువరాజా.. మోక్షబాబుకి నాగగండం తప్పిపోతే నేను నాగలోకానికి వచ్చేస్తాను.
ఫణేంద్ర: నాకు నమ్మకంలేదు యువరాణి. మోక్షని కాటేసి నువ్వు నాగలోకాని వచ్చేస్తే తర్వాత నేను ఆ మొక్క తెచ్చి మోక్షని బతికిస్తాను.
పంచమి: నువ్వు రాకపోతే..
ఫణేంద్ర: నేను తప్పకుండా వస్తాను.
మేఘన: అవన్నీ జరిగే పనులు కావు. నాగమణిని తెస్తేనే మోక్షని బతికించగలం. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్, అదంతా స్క్రిప్టెడ్ - ‘బిగ్ బాస్’ మాజీ కంటెస్టెంట్ గీతూ షాకింగ్ కామెంట్స్