Meghasandesam Serial Today November 8th: ‘మేఘసందేశం’ సీరియల్: తన పెళ్లి వంశీతోనే జరగాలన్న ఇందు – శారదను గెస్ట్ హౌస్ లో బంధించిన శరత్ చంద్ర
Meghasandesam Today Episode: ఇందుకు మరో మంచి సంబంధం చూస్తానన్న ప్రసాద్ తో తన పెళ్లి వంశీతోనే జరగాలని పట్టుబడుతుంది ఇందు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: శారదను తీసుకుని గెస్ట్ హౌస్ కు వెళ్తాడు శరత్ చంద్ర. నీ కొడుకు ఇందు పెళ్లి జరిపిస్తే తప్పా నువ్వు ఇక్కడి నుంచి బయట పడలేవు అంటాడు. లోపలికి వెళ్లిన శరత్ చంద్ర తన మనుషులకు ఇందు పెళ్లి ఆగిపోవడానికి కారణం ఈవిడ కొడుకు. మళ్లీ పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉంటుంది. ఈవిడ కొడుకు ఆవేశపరుడు ఎప్పుడైనా మెరుపులాగా వస్తాడు జాగ్రత్త. నీ కొడుకు ఆ పెళ్లి జరిపించే వరకు నీకు ఈ వనవాసం తప్పదు అంటూ శారదకు చెప్పి ఈవిడను తీసుకెళ్లడానికి ఈవిడ కొడుకు వస్తే వాణ్ని చంపేయండి అని చెప్పి శరత్ చంద్ర వెళ్లిపోతాడు. హాస్పిటల్ లో ఇందు కళ్లు తెరుస్తుంది.
మీరా: ఏవండి ఇందు కళ్లు తెరిచింది.
చెర్రి: ఏంటే ఈ పని వాడు ఎవడో ఏదో వాగాడని ప్రాణాలు తీసేసుకుంటావా..? అసలు నువ్వు లేకపోతే మేమందరం ఏమై పోతామో అని ఆలోచించలేదా..?
మీరా: అమ్మా అమ్మా అంటూ నేను ఏం వాగినా కరెక్టు కాదని చెప్పేదానివి. పెళ్లి ఆగిపోతేనే ఇలా చేసుకోవాలా..?
చెర్రి: అమ్మా ఏంటమ్మా ఆ మాటలు అసలు ఏం జరిగిందని చనిపోవడానికి.
ప్రసాద్: ఇందు నీ గురించి మాకు తెలియదా..? అమ్మా అయినా వాడెవడో అన్న మాటలకు నువ్వు ప్రాణాలు తీసుకోవాలా.. అమ్మా.
అపూర్వ: బాగుంది కృష్ణ ప్రసాద్ చాలా బాగుంది. భలే తండ్రివి అయ్యా నువ్వు. వీడు అనుమానించి వెళ్లిపోయాడని ఇంకో వాణ్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని ఇందుకు హామీ ఇస్తున్నావా..? ఆ వచ్చిన వాడు అనుమానించడు అని నమ్మకం ఏముంది. .? తప్పు చేసిన వాడిని కాపాడింది చాలక. ఇక్కడ నీ కూతురుకు పనికిరాని మాటలు చేతకాని కబుర్లు చెప్తున్నావా..
మీరా: ఏంటి వాణ్ని కాపాడావా..? పెళ్లి ఆగడానికి అందరిలో నా బిడ్డ మీద నింద పడి దీనికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాడిని కాపాడావా..?
ఇందు: నాకు తెలుసు.. మాకన్నా ఆయనకు వాళ్లే ఎక్కువ. నేను చనిపోయినా ఆయనకు వాళ్లే ఎక్కువ.
ప్రసాద్: ఇందు ఏంటమ్మా ఆ మాటలు..
మీరా: మీకు దీని కన్నా వాడే ఎక్కువ అయిపోయాడా..? మీకు వాడు తప్పా మేము అవసరం లేదా..? మా గురించి ఆలోచించరా..?
చెర్రి: అమ్మా నాన్న గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావా..? ఆయన ఆలోచించకుండానే మేము ఇంత వాళ్లం అయ్యామా..?
ఇందు: ఆయనకు ఎప్పుడు వాళ్లే ఎక్కువ. నిజంగా నేను చచ్చిపోయి ఉన్నా వాళ్ల గురించే ఆలోచిస్తాడు.
అపూర్వ: ఎందుకు కృష్ణప్రసాద్. నీ మాటలతో నీ చేతలతో వీళ్లను ఇంకా ఇలా బాధపెడతావు. నువ్వు నిజంగా పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి వద్దని వెళ్లిపోయిన వాళ్లనే తిరిగి తీసుకువచ్చి పెళ్లి చేయి.
అని చెప్తుంది అపూర్వ. ఇందు కూడా నేను వేరే పెళ్లి చేసుకోనని వంశీనే చేసుకుంటానని చెప్తుంది. తర్వాత శరత్‌చంద్ర ఆలోచిస్తుంటాడు. అపూర్వను సుజాత మెచ్చుకుంటుంది. వంశీతోనే తన పెళ్లి చేయాలని చెప్పేలా చేశావు. వంశీ మళ్లీ వచ్చి పెళ్లి చేసుకోడు నిజంగా నీ బుర్ర అద్బుతం. అంటుంది. ఇదంతా భూమి కోసమే చేశానని అంటుంది అపూర్వ. ఇంతలో భూమి వచ్చి శరతచంద్ర కాళ్లు మొక్కుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!