Meghasandesam Serial Today November 3rd: ‘మేఘసందేశం’ సీరియల్: హోమం పూర్తి చేసిన శారద – కేపీని చూసిన అపూర్వ
Meghasandesam serial today episode November 3rd: హోమం చేస్తున్న కేపీని, శారదను దూరం నుంచి అపూర్వ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: హోమంలో నెయ్యి కోసం బయటకు వెళ్లిన భూమి అదే గుడికి వచ్చిన అపూర్వ, నక్షత్ర, చెర్రిలను చూస్తుంది. వెంటనే లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి శారదకు చెప్తుంది.
భూమి: అత్తయ్యా కొంప మునిగింది అత్తయ్య..
శారద: ఏమైంది అమ్మా…?
భూమి: ఆ అపూర్వ, గోరింటాకు, నక్షత్ర, చెర్రి గుడికి వచ్చారు.
శారద: అయ్యో ఏంటమ్మా ఇంత పెద్ద షాకింగ్ చెప్పావు.. ఇప్పుడు మీ మామయ్యను కానీ అపూర్వ చూసిందంటే.. ఉన్న ఊపిరి ఆపేస్తుందమ్మా..?
భూమి: పంతులు గారిని అడుగుదాము అత్తయ్య..? పంతులు గారు.. మాకు గిట్టని వాళ్లు ఈ గుడిలోకి వస్తున్నారు. ఈ హోమాన్ని మరోచోటికి మారుద్దామా..?
పంతులు: కుదిరే పని కాదమ్మా..! మీరు చెప్తున్నట్టు మరో గుడికో చుట్టు పక్కల రహస్య ప్రదేశానికో మార్చోచ్చు కానీ ముహూర్తం ముఖ్య కదమ్మా.. ఇప్పటికే అనుకున్న ముహూర్తం ముంచుకొచ్చింది. ఈ ముహూర్తానికే చేయించుకోవడం ముఖ్యం. హోమాన్ని మార్చి ముహూర్తం కానీ ముహూర్తంలో హోమం జరిపించుకోవడం కంటే పూర్తిగా మానేయడమే మంచిది.
భూమి: ఏదైతే అదే అయింది పంతులు గారు హోమం జరిపిస్తాం..
శారద: అమ్మ భూమి ఏంటమ్మా నువ్వు అనేది..
భూమి: అవును అత్తయ్య భారం ఆ పరమేశ్వరుడి మీదే వేద్దాం.. పంతులు గారు మీరు కానివ్వండి..
శారద: అమ్మా ఏంటమ్మా నువ్వనేది.. ఎలా జరిపిస్తావమ్మా..?
భూమి: అత్తయ్యా మీరేం కంగారు పడకండి మామయ్య కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే మనం ఇక్కడికి వచ్చాం.. ఆ పరమేశ్వరుడికి హోమం జరిపించిన తర్వాతే మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం..మీరేం కంగారు పడకండి మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను.
శారద: పరమేశ్వరా..? ఎలాగైనా పూజ సవ్యంగా జరగాలి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని గట్టెకించేలా చేయ్ స్వామి..
అంటూ శారద వేడుకుంటుంది. ఇంతలో పంతులు హోమం మొదలు పెడతారు. పూజ జరుగుతుంటే..
భూమి: అత్తయ్య పరమేశ్వరుడి మీద భారం వేశాం కదా అని మామయ్యను వాళ్లు చూడకుండా ఎంతో సేపు మేనేజ్ చేయలేమోమో అనిపిస్తుంది.
శారద: అవును భూమి నాకు కూడా అలాగే అనిపిస్తుంది.
భూమి: ఇప్పుడేం చేయాలి. మామయ్యను వాళ్లు చూడకుండా ఎలా కాపాడుకోవాలి. ( మనసులో అనుకుని) మండపం చుట్టూ ఏదైనా క్లాత్ కట్టామనుకోండి.. అప్పుడు మామయ్యతో పాటు మనం కూడా కనిపించం కదా..? ప్రశాంతంగా హోమం జరిపించొచ్చు కదా..?
శారద: మంచి ఆలోచనే.. కానీ అంత పెద్ద క్లాత్ ఈ చుట్టు పక్కల ఎక్కడైనా దొరుకుతుంది అంటావా..?
భూమి: వెతికితే దేవుడే దొరుకుతాడు అంటారు. ఇంక క్లాత్ దొరకదా అత్తయ్యా..? నేను వెళ్లి క్లాత్ తీసుకొస్తాను.. అంతవరకు మామయ్య జాగ్రత్త
అంటూ భూమి క్లాత్ కోసం బయటకు వెళ్తుంది. క్లాత్ వెతికి తీసుకుని వస్తుంది. మండపం చుట్టూ క్లాత్ అడ్డంగా కడుతుంది. ఇక ఎటువంటి టెన్షన్ లేకుండా హోమం పూర్తి చేస్తారు. తర్వాత శారద హోమ గుండం చుట్టూ ప్రదిక్షణ చేస్తుంటే.. గాలికి చుట్టూ ఉన్న క్లాత్ పక్కకు వెళ్తుంది. అప్పుడే దూరం నుంచి అపూర్వ, శారదను చూస్తుంది. శారద లాగా ఉందేంటి..? అనుకుని దగ్గరకు వెళ్లబోతుంది. వెంటనే వెనక నుంచి అపూర్వను గమనించిన భూమి.. హోమం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















