Meghasandesam Sserial Today Episode Written Update: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి కోసం ఎమోషనల్ అయిన గగన్ – హాస్పిటల్ లో అపూర్వతో ఆడుకుంటున్న భూమి
Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో ఉన్న భూమిని గుర్తు చేసుకుని గగన్ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో అక్కడకు శారద వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: అపూర్వ వెళ్లి ఇరిటేటింగ్ గా భూమికి మసాజ్ చేస్తుంది. ఆహా ఇలా మసాజ్ చేస్తుంటే ఎంత బాగుందో.. మమ్మీ నీకు అలవాటా…? ఇలా మసాజ్ చేయడం అంటూ భూమి అడగ్గానే లేదని అప్పుడప్పుడు మీ నాన్ను చేస్తానని చెప్తుంది అపూర్వ. ఇంతలో కాళ్లు పడితే నిద్ర గ్యారెంటీ అంటుంది భూమి. రూంలో కెమెరాలు ఉన్నాయన్న విషయం గుర్తుకు వచ్చి అపూర్వ, భూమి కాళ్లు పడుతుంది. మనసులో మాత్రం ఈ అపూర్వతోనే కాళ్లు పట్టించుకుంటావే.. నీ సంగతి చెప్తా అని కోపంగా అనుకుంటుంది. ఇంతలో సుజాత ఫోన్ చేస్తుంది.
సుజాత: ఏంటి అపూర్వ దాన్ని పినిష్ చేశేశావా..? పీక నలిపావా..? దిండు వాడావా..?
అపూర్వ: పిన్ని నేను తర్వాత ఫోన్ చేస్తాను.
సుజాత: అది కాదు అమ్మాయి పీక నులిపితే ఫింగర్ ఫ్రింట్స్ దొరుకకుండా జాగ్రత్త పడాలి.
అపూర్వ: ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ. నేను ఫినిష్ చేయడం కాదు. అదే నాతో ఆడుకుంటుంది.
సుజాత: అదెలా..?
అపూర్వ: ఇక్కడ రూంలో వీడియోతో పాటు వాయిస్ రికార్డు అయ్యే సీసీ కెమెరాలు ఉన్నాయి.
సుజాత: అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కూడా రికార్డు అవుతుందా..?
అపూర్వ: అవును..
అని చెప్పగానే సుజాత ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు భూమి గురించి గగన్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో శారద వస్తుంది. గగన్ కంగారుగా భూమికి ఎలా ఉందని అడుగుతాడు. బాగానే ఉందని మన కన్నా భూమికి మన అనుకున్న వాళ్లు ఉన్నారు. ఆ శరత్ చంద్ర, అపూర్వ వాళ్లు వచ్చారు. అందుకే వచ్చాను అని శారద చెప్తుంది. గగన్ మాత్రం భూమి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
గగన్: అమ్మా భూమికి వాళ్లు ఎక్కువ కావొచ్చు. కానీ మనకు భూమి ఎక్కువ కదా..? ఈ రోజు నేను బతికి ఉన్నానంటే దానికి కారణం భూమి. భూమి నన్ను ఒక్కడినే కాదమ్మా ఈ ఇంటినే బతికించింది. భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా..?
శారద: నేను కూడా ఉండి పోవాలనుకున్నాను. కానీ ఆ శరత్ చంద్ర మనల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదరా..?
గగన్: దగ్గరకు రానివ్వడం లేదని నువ్వు.. దూరమై పోతుందని పూరి. ఎలా జరిగితే అలా జరగని అనుకుని నేను ఇలా ఉండిపోతే ఎలా అమ్మా..?
శారద: మరి ఎలారా.. మనం ఇప్పుడు ఏం చేద్దాం.
అని శారద అడగ్గానే భూమిని హాస్పిటల్ నుంచి మనం ఇంటికి తీసుకొద్దాం అని గగన్ చెప్తాడు. దీంత శరత్ చంద్ర ఏమంటారో అంటుంది శారద. ఒప్పుకోవడానికి ఆయనెవరు అంటూ గగన్ ఎలాగైనా భూమిని తీసుకొద్దాం అంటాడు. తర్వాత భూమి రూం ను కలర్ ఫుల్ గా డెకరేట్ చేస్తుంటాడు చెర్రి. బిందు వచ్చి ఏంటని అడగ్గానే భూమి కోసం స్పెషల్ గా చూసుకోవడానికి రోబో బుక్ చేశానని చెప్తాడు. మరోవైపు గగన్, పూరి కలిసి వాళ్ల ఇంట్లో భూమి రూంను కలర్‌ఫుల్ గా డెకరేట్ చేయాలనుకుంటారు. చెర్రి హాస్పిటల్ కు ఫోన్ చేసి భూమిని నీకు రూం ఎలా ఉండాలని అడుగుతాడు. దీంతో భూమి తను శారద వాళ్ల ఇంటికి వెళ్తానంటుంది. చెర్రి డిస్సపాయింట్ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Also Read: విజయాంబికని పిచ్చి దాన్ని చేసి రాఘవ అడ్రస్ తెలుసుకున్న రఘు, రూప, రాజులు!