Ammayi Garu Serial Today Full Episode: అమ్మాయి గారు సీరియల్: విజయాంబికని పిచ్చి దాన్ని చేసి రాఘవ అడ్రస్ తెలుసుకున్న రఘు, రూప, రాజులు!
Ammayi garu Today Episode:విజయాంబికతో రఘు రాఘవ అడ్రస్ చెప్పించడం రూప, రాజుల అక్కడికి బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi Garu Serial Today Episode In ABP Desam: విజయాంబిక దగ్గరకు రూప, రాజులు పాము బొమ్మని పెట్టి ఫోన్‌లో పాము బుస సౌండ్ పెడతారు. ఆ బొమ్మ పాముని చూసి విజయాంబిక పాము అని అందరితో చెప్పి రచ్చ రచ్చ చేస్తుంది. ఇక రఘు విజయాంబికకి పిచ్చి ముదురిపోయిందని అంటాడు.
విజయాంబిక: తమ్ముడు ఈయన మాటలు నమ్మకు తమ్ముడు నేను నిజంగానే పాముని చూశాను. నాకు ఎలాంటి పిచ్చి లేదు ఈయనకే పిచ్చి పట్టింది. నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రండి పాము చూపిస్తా.
సూర్యప్రతాప్: అక్క అక్కడేం లేదు.
రూప: ఏం చెప్తున్నారు అత్తయ్య ఈ ఇంట్లోకి పాము ఎలా వస్తుంది. వచ్చినా కూడా అందరినీ దాటుకొని నీ గదిలోకి ఎలా వస్తుంది.
రఘు: బావగారు ఒకొక్కప్పుడు పిచ్చి ముదిరితే ఇలాగే అనిపిస్తుంది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఇలాగే ఉంటుంది.
విజయాంబిక: మీకే పిచ్చి నాకు ఏం పిచ్చి లేదు.
దీపక్: నాన్న అమ్మ నిజమే చెప్తుంది ఏమో.
సూర్యప్రతాప్: దీపక్ నువ్వు ప్రేమతో ఇలా అంటున్నావ్ మేం కూడా ప్రేమతోనే వచ్చాం కానీ ఇక్కడేం లేదుగా.
రఘు: దీపక్ మీ అమ్మకి ఏం కాదు నేను చూసుకుంటా.
జీవన్: బాధ పడకు దీపక్ విజయాంబిక గారికి ఏం కాదు ఆవిడ పాము చూసుంటుందని నేను నమ్ముతున్నాను.
ఇక అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజు పులి గెటప్ వేసుకొని విజయాంబిక గది కిటికీ దగ్గర నిల్చొంటే రూప ఫోన్‌లో సౌండ్స్ పెడుతుంది. ఇక విజయాంబిక పులి అని పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేస్తుంది. విజయాంబిక మళ్లీ హాల్‌లోకి వెళ్లగానే రాజు గెటప్ మార్చేస్తాడు. విజయాంబిక హాల్‌లో అందరితో పులి కనిపించిందని చెప్తే అందరూ తల పట్టుకొని నవ్వుకుంటారు. అత్తయ్యకి ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనిషిగా చేయమని రూప అంటుంది. దాంతో విజయాంబిక నాకు ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్ తన బావతో బావగారు ఏం చేస్తాం ఇప్పుడు అని అడుగుతాడు. దానికి విజయాంబిక ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను మీ మాటలతో పిచ్చి ఎక్కుతుందని అంటుంది. ఇక విజయాంబికను మామూలు మనిషిని నేను చేస్తానని రఘు అంటాడు.
Also Read: కార్తీక్ స్థానంలో జ్యోత్స్న.. సీఈఓగా తీసేసి ఘోరంగా అవమానించారన్న కార్తీక్!
ఇక రఘు విజయాంబికకు వైద్యం చేస్తానని సాయంగా రూప, రాజులను పిలుస్తాడు. దీపక్ వస్తానంటే రఘు వద్దని అంటాడు. విజయాంబికని తీసుకొని రూప, రాజులు గదికి వెళ్తారు. రఘు విజయాంబికని కింద కూర్చొమని చెప్తాడు. విజయాంబిక తిట్టుకొని కూర్చొంటుంది. నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వల్లే అందరూ నమ్ముతున్నారని రఘు అంటాడు. నాకు పిచ్చిలేదని విజయాంబిక అరుస్తుంది. పిచ్చి అని లేదు అని నిరూపించుకోవడానికి ఏం చేయాలని విజయాంబిక అడిగితే దానికి రఘు కొన్ని ప్రశ్నలు అడిగుతా వాటికి సరైన సమాధానం చెప్తే నీకు పిచ్చి లేదని నమ్ముతానని అంటాడు. విజయాంబిక సరే అంటుంది. ఇక నీ పేరు ఏంటి నీ కోడలు ఎవరు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇలా అడుగుతాడు.
విజయాంబిక సరైన సమాధానాలు చెప్తుంది. ఇక రాఘవని ఎవరు కిడ్నాప్ చేశారు ఎక్కడ ఉంచారు అంటే విజయాంబిక, దీపక్ కిడ్నాప్ చేసి లంగర్ హౌస్‌లోని పాడుపడ్డ బంగ్లాలో దాచారని చెప్తుంది. రాఘవ ఎక్కడున్నాడో చెప్పేశాను ఏంటి అని విజయాంబిక అనుకొని కవర్ చేయబోతే రఘు ఏదో పౌడర్ వేసి విజయాంబిక మూర్ఛపోయేలా చేస్తాడు. ఇక రఘు రాజు, రూపలకు రాఘవని తీసుకురమ్మని చెప్తాడు. విరూపాక్షిని కూడా రమ్మని చెప్పమంటే రూప విరూపాక్షికి కాల్ చేస్తుంది. విరూపాక్షి సంతోష పడి అంతలోనే వాళ్ల నాటకం గుర్తొచ్చి కాల్ లిఫ్ట్ చేయదు. ఇక రూప, రాజులు విజయాంబిక చెప్పిన అడ్రస్‌కి వెళ్తారు. ఇంతలో రూప విరూపాక్షి దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.