అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి ఆస్తి రాయించుకోవడానికి అంబిక ప్లాన్‌.. జ్యూస్‌తో అట్టర్‌ఫ్లాప్ చేసిన కనకం!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి ఆస్తిని అంబిక రాయించుకోవడం లక్ష్మీ విషయం తెలుసుకొని ఆ పేపర్ల మీద జ్యూస్ పడేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పద్మాక్షి, సహస్రని తీసుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్ష్మీని తిడుతుంది. ఈ కుటుంబంలో కలతలు రేపుతున్నావని నీకు ఈ కుటుంబంతో ఉండే అర్హత లేదని పద్మాక్షి అంటుంది. మా నాన్నని కాపాడవనే కారణంతో నిన్ను ఇంట్లో నుంచి పంపలేకపోతున్నాం అని నీ వల్ల ఇకపై ఏ ఇబ్బందులు రాకూడదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. 

యమున: లక్ష్మీ అందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా క్షమించమ్మా. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మాటలు పడుతున్నావ్. నిందలు మోస్తున్నావ్. ఇప్పుడు ఇంత పెద్ద నింద మోశావ్.
లక్ష్మీ: తప్పు చేసినప్పుడు మాత్రమే అలాంటి నింద మనకు భారంగా అనిపిస్తుంది. నిజాయితీ ఉంటే అలాంటి నిందలు ఏం చేయవు. తప్పు చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాదమ్మా అలా వస్తే ఆ రోజే నేను చచ్చినట్లు అంత నీచమైన స్థాయికి నేను దిగజారను.
యమున: లక్ష్మీ నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు కానీ అంత నింద నువ్వు మోస్తుంటే నాకు బాధగా ఉంది.
లక్ష్మీ: అవన్నీ మీరు పట్టించుకోకండి వెళ్లి రెస్ట్ తీసుకోండి అమ్మా. నాకు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి రెండు నిమిషాలు పట్టదమ్మా కానీ అలా అయితే మిమల్ని ఎవరు చూసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్లు మీ బంధువులే తప్ప మీ మనసు తెలుసుకునే వారు కాదు. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారనే కారణంతో ఇక్కడుంటున్నాను. 

Also Read: కార్తీక్ స్థానంలో జ్యోత్స్న.. సీఈఓగా తీసేసి ఘోరంగా అవమానించారన్న కార్తీక్!

ఇంతలో కనకానికి తన బంధువు అయిన ఓ మామయ్య ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు కావడం లేదని చెప్తారు. దాంతో నాన్న ఆపరేషన్‌కి ఎక్కువ టైం లేదు అంత డబ్బు ఎలా తీసుకురావాలని కనకం ఏడుస్తుంది. మరోవైపు ఆదికేశవ్‌ డల్‌గా ఆలోచిస్తూ ఉంటే గౌరీ ఏమైందని అడుగుతుంది. కనకం గుర్తొచ్చిందని ఆదికేశవ్ కన్నీరు పెట్టుకుంటాడు. కనకం వెళ్లి మూడు నెలలు అయిందని ఒకసారి చూడాలని ఉందని అంటాడు. వాళ్లని పిలుద్దామా అని రాజీ అంటే కనకం వద్దని అంటాడు. మనకు అనిపించినప్పుడల్లా కనకాన్ని అమెరికా నుంచి రమ్మనడం సరికాదని అంటాడు. ఇక ఆదికేశవ్ ఊరులోకి వెళ్లి వస్తానంటే గౌరీ వద్దని అంటుంది. అయినా ఆదికేశవ్ వెళ్తాడు. ఇంతలో గౌరీ దగ్గరకు ఓ పెద్దాయన వచ్చి డబ్బు సర్దుబాటు కాలేదని చెప్తాడు. 

మరోవైపు అంబిక తన సింహాసనం మీద విహారి కూర్చొన్నాడని తనని ఆ గద్దె దించాలని ఈ రోజు విహారి కంపెనీతో పాటు ఆస్తి కూడా తన పేరిట తీసుకోవడానికి ఓ ఫైల్స్ రెడీ చేస్తుంది. విహారితో ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టించాలని అనుకుంటుంది. ఇక సుభాష్‌తో విహారి ఆస్తి లాగేసుకుంటున్నట్లు ఫైల్స్ మీద సంతకం పెట్టించనున్నానని మాట్లాడుతుంది. లక్ష్మీ మాటలు వినేస్తుంది. అంబిక కుట్రకు షాక్ అయిపోతుంది. ఎలా అయినా ఆపాలని అనుకుంటుంది. అంబిక విహారి దగ్గరకు వెళ్లి పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని సంతకాలు పెట్టమని చెప్తుంది. విహారి వాటిలో ఏముందో చూసుకోకుండా సంతకాలు పెట్టేస్తాడు. లక్ష్మీ దూరం నుంచి చూస్తుంది. ఎలా అయినా ఆపాలి అనుకొని జ్యూస్ పట్టుకొని వచ్చి వాటి మీద ఒలకబోస్తుంది.

అంబిక ప్లాన్ అంతా  అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఎంత పని చేశావే అని అంబిక లక్ష్మీని కొట్టబోతే విహారి అడ్డుకుంటాడు. కొట్టేంత పెద్ద తప్పు  ఏం తను చేయలేదని అంటాడు. పని మనిషికి వెనకేసుకురావొద్దని అంబిక అంటుంది. ఇప్పుడేం కాలేదు కదా మరోసారి ఫ్రింట్ తీసుకొని రమ్మని విహారి అంటాడు. ఇక విహారికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్తే అంబిక లక్ష్మీ నోరు నొక్కి కావాలనే చేశావు కదా అంటుంది. దాంతో లక్ష్మీ ఆ కాగితాల్లో ఎవరి జీవితాలు నాశనం చేసే రాతలు ఉన్నాయో అందుకే దేవుడు అలా చేశాడని అంటుంది. అంబిక లక్ష్మీని అలా పట్టుకోవడం విహారి చూసి అత్తా అని అరుస్తాడు. దాంతో  అంబిక వదిలేస్తుంది. పాడైన కాగితాల కోసం ఒకమ్మాయిని ఇలా చేయడం నాకు నచ్చలేదని అసలు ఆ పేర్లలో ఏముందని అడుగుతాడు. ఏం లేదు అని అంబిక కవర్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: మీడియాలో మహదేవయ్య పరువు.. ఎమ్మెల్యే టికెట్ డౌటే.. డీఎన్ఏ టెస్ట్ సలహా ఇచ్చిన సత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Kallakkadal Warning: పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Kallakkadal Warning: పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

International Kite & Sweet Festival | హైదరబాద్ లో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ | ABP DesamNitish Kumar Reddy Craze in Tirumala | నితీశ్ తో ఫోటోలు దిగాలని తిరుమలలో ఫ్యాన్స్ పోటీ | ABP DesamChina Manja in Hyderabad | నిబంధనలు డోంట్ కేర్.. హైదరాబాద్ లో యథేచ్చగా మాంజా అమ్మకాలు | ABP DesamMinister Seethakka With Jewellery | నగలతో దర్శనమిచ్చిన సీతక్క | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం -   లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Kallakkadal Warning: పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Kallakkadal Warning: పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Ipl Vs Ranji: షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!
షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
Bumrah Award: బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్..
బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్..
Embed widget