అన్వేషించండి
Satyabhama Serial Today January 14th Highlights: సత్య క్రిష్ ప్రేమయుద్ధం.. చక్రవర్తిని బెదిరించిన మహదేవయ్య - సత్యభామ జనవరి 14 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today January 14th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

మా అమ్మని నీ నామినేషన్ పై సంతకం చేసేలా చేస్తే నీదే గెలుపు అని నువ్వు గొప్పదానివని ఒప్పుకుంటా అని క్రిష్ సత్యను రెచ్చగొడతాడు. దీంతో బామ్మతో కలసి ప్లాన్ చేస్తుంది సత్య
2/10

భైరవికి సెంటిమెంట్స్ చాలా ఉన్నాయని తెలిసి పెద్ద ప్లాన్ చేస్తారు. పాలల్లో నిమ్మకాయ పిండేస్తుంది సత్య..ఆ తర్వాత భైరవిని కాఫీ అడుగుతుంది జయమ్మ. గురువారం పాలు విరిగిపోతే అరిష్టం అంటుంది. ఆ తర్వాత బల్లి పడడంతో మరింత కంగారుపడుతుంది భైరవి
3/10

జయమ్మ, సత్య కలసి..పాలు విరిగాయ్, బల్లిపడింది..చాలా అపశకునాలు జరుగుతున్నాయని మరింత భయపెట్టేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు అని అంటే..పంతులు వస్తాడు అడుగుదాం అంటుంది జయమ్మ
4/10

ఇదంతా దూరం నుంచి చూసి గట్టిగానే ప్లాన్ చేశారని సత్యను చూసి మురిసిపోతాడు. ఆ తర్వాత భైరవి, జయమ్మ లోపలకు వెళ్లగానే.. ప్లాన్ మంచిగానే ఉందంటూ క్రిష్ ఎంట్రీ ఇస్తాడు. ఏదో చెప్పి కవర్ చేస్తుంది సత్య.
5/10

మరోవైపు హర్ష.. సంధ్య మాటలు తలుచుకుంటాడు. మనం సపోర్ట్ చేస్తే అక్క గెలుస్తుందా అన్న మాటలు తల్చుకుంటాడు. ఈ మధ్య సంధ్యలో ఏదో మార్పు వచ్చిందంటాడు నందినితో. ఇంతలో సంధ్య వచ్చి సెటైర్స్ వేస్తుంది. మొగుడు, పెళ్లాల మధ్య కన్నా పెళ్లికానివారి మధ్యే ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయంటూ కౌంటర్ ఇస్తుంది నందిని.
6/10

మా బామ్మ, మా పెద్దొదిన కూడా చిన్న వదిన్ని సపోర్ట్ చేస్తున్నారని నందిని అంటుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి చూడు అని విశాలాక్షి అంటే.. మనం ప్రమాదంలో పడుతూ వేరేవాళ్లని అందులోకి లాగాలి అనుకోవడం పాపం అని క్లాస్ వేస్తుంది సంధ్య.
7/10

పంతులు ఎంట్రీ ఇచ్చాక.. ఇంట్లో జరిగింది చెబుతారు భైరవి, జయమ్మ, సత్య. తాళి గండం అని భైరవిని భయపెడతారు..వెంటనే మృత్యుంజయ హోమం జరిపించాలని పండితులు చెబుతారు. నేను చూసుకుంటా అంటే నేను చూసుకుంటా అంటారు క్రిష్ సత్య.
8/10

పూజయ్యాక ఏం చేయాలని అడిగితే...( ప్లాన్ చేసావ్ కదా చెప్పు అంటూ సత్యతో అంటాడు క్రిష్.. ప్లాన్ తెలిసిపోయిందా ఏంటని టెన్షన్ పడుతుంది సత్య).పూజయ్యాక ఇంట్లో ఆడవారి కోర్కెలు తీర్చాలని పండితులు చెబుతాడు.
9/10

ఉత్తర రామాయణం బుక్ అడుగుతుంది జయమ్మ, పట్టుచీర అడుగుతుంది పెద్ద కోడలు...ఇక చిన్నకోడలా నీకేం కావాలి బంగారమా అంటుంది.. నాకు అవసరం అయినది..మీ చేయలేనిది అదే వదిలేయండి అత్తయ్యా అంటుంది
10/10

సత్యభామ జనవరి 15 ఎపిసోడ్ లో.. నామినేషన్ పై మీరు సంతకం చేయాలని క్రిష్ అసలు తండ్రిని అడుగుతుంది సత్య. మీరు సంతకం చేయకపోతే అందరి ముందు నిజం చెప్పేస్తా అంటుంది. మరోవైపు మహదేవయ్య కాల్ చేసి..నువ్వు సత్యకి సపోర్ట్ చేస్తే సత్య-క్రిష్ ఇద్దర్నీ చంపేస్తా అంటాడు...
Published at : 14 Jan 2025 04:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion