Karthika Deepam 2 Serial Today November 26th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ స్థానంలో జ్యోత్స్న.. సీఈఓగా తీసేసి ఘోరంగా అవమానించారన్న కార్తీక్!
Karthika Deepam 2 Today Episode : కార్తీక్‌ని సీఈఓగా తీసేసి ఆ స్థానం జ్యోత్స్నకి ఇవ్వడం కార్తీక్ తనని అవమానించారని తల్లి, భార్యతో చెప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam 2 Today Episode In Telugu: శివనారాయణ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్‌కి కొత్తగా జ్యోత్స్న వచ్చిందేంటి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక శివనారాయణ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఇప్పటివరకు కార్తీక్ సీఈవోగా ఉండేవాడని ఇప్పుడు తన మనవరాలు జ్యోత్స్నని నియమిస్తున్నానని చెప్తాడు. కార్తీక్ షాక్ అయితే జ్యోత్స్న ఫుల్ ఖుషీ అయిపోతుంది. అందరూ జ్యోత్స్న సీఈఓగా ఒప్పుకుంటారు. ఇక కార్తీక్ సంస్థ నుంచి విడిపోతున్నట్లు చెప్తాడు.
జ్యోత్స్న ఇప్పటికి రెసిగ్నేషన్ తీసుకోనని కొంచెం టైం తీసుకొని ప్రైవేట్‌గా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అంటుంది. జ్యోత్స్న మనసులో నేను సీఈఓ అయిందే నీ కోసం బావ నిన్ను ఎలా పోనిస్తాను అని అనుకుంటుంది. ఇక దీప గది తుడుస్తుండగా శౌర్య మెడిసిన్ సీట్ దొరుకుతుంది. దాన్ని కాంచన దగ్గరకు తీసుకెళ్లి ఈ మందులు దేనికి వాడుతారో చెప్పమని అడుగుతుంది. దీపకి ఇంకా అనుమానం పోలేదని అనుకొని కవర్ చేస్తుంది కాంచన. దీప నమ్మేస్తుంది.
జ్యోత్స్న: నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావో నాకు తెలియాలి. నువ్వే సీఈఓగా ఉండాలి అనుకుంటున్నావా. నేను సీఈఓగా ఉండటం ఇష్టంలేదా. లేక ఆడదాని కింద పని చేయాలని నీకు లేదా.
కార్తీక్: తాత విలువలు గురించి అన్నాడు కదా అంటే నాకు విలువలు లేవు అనే కదా.
జ్యోత్స్న: నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది నాకు సపోర్ట్‌గా ఉండొచ్చు కదా బావ.
కార్తీక్: సారీ జ్యోత్స్న.
జ్యోత్స్న: నా కోసం కాకపోయినా తాత కోసం ఉండు బావ కోపంతో తాత అన్నా నువ్వు వెళ్లిపోతే బాధ పడతారు. పైగా నువ్వు అత్తకి పుట్టిళ్లు శాశ్వతంగా దూరం చేసినట్లు అవుతుంది. ఇక్కడే ఉంటే తాత ఎప్పుడైనా మారొచ్చు కదా. అంటూ జ్యోత్స్న లేఖ చింపేస్తుంది.
కార్తీక్: దీప కోసం ఈ కంపెనీలో కొనసాగుతాను జ్యోత్స్న. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనమే బాధ పడతాం కానీ సంస్థని నమ్ముకొని చాలా మంది ఉన్నారు సీఈఓగా బాధ్యతలు తీసుకున్నావ్ అంటే అందరి బాధ్యత తీసుకున్నట్లే ఆల్ ది బెస్ట్ బాయ్.
మరోవైపు దాసు తన తల్లి వంట గురించి స్వప్నతో చెప్తే కాశీ అరుస్తాడు. ఆ మనిషిని మన ఇంటి గడప కూడా తొక్కనివ్వను అని కాశీ అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. హాయిగా డ్యాన్స్ వేసుకొని వస్తుంది ఏమైందని అందరూ అడిగితే కార్తీక్‌ని సీఈఓగా తీసేశారని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. సీఈఓగా జ్యోత్స్నని సింహాసనం మీద కూర్చొబెట్టారని అంటుంది. ఇక పారిజాతం దాసుతో నీ కూతురు సీఈఓ అయిందిరా అంటే తను మా నాన్నకి కూతురేంటి అని కాశీ అంటాడు. దాంతో పారిజాతం కవర్ చేస్తుంది. దానికి కాశీ అలాంటి కూతురు మా నాన్నకి కచ్చితంగా అవసరం లేదని అంటాడు. మా అన్నయ్యని బాధ పెట్టినందుకు కౌంటర్ ఉంటుందని స్వప్న అంటుంది. పారిజాతం, స్వప్నలు గొడవ పడితే దాసు అడ్డుకుంటాడు. మరోవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏమైందని దీప అడుగుతుంది. ఘోరంగా అవమానించారని కార్తీక్ చెప్తాడు. కాకపోతే మాటలతో కాకుండా చేతలతో చేశారని సీఈఓగా నన్ను తీసేశారని జ్యోత్స్నని సీఈఓగా చేశారని అంటాడు. రిసెగ్నేషన్ లెటర్ ఇస్తే జ్యోత్స్న చింపేసి అక్కడే ఉండమని చెప్పిందని కార్తీక్ అంటాడు. అంతా వాళ్లిష్టప్రకారమే చేస్తున్నారని నేను దీప మాటతో ఆగిపోయానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: మీడియాలో మహదేవయ్య పరువు.. ఎమ్మెల్యే టికెట్ డౌటే.. డీఎన్ఏ టెస్ట్ సలహా ఇచ్చిన సత్య!