Meghasandesam Serial Today June 13th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీకి షాక్ ఇచ్చిన శారద – గగన్ ముందే విడాకులు అడిగిన శారద
Meghasandesam Today Episode: కొడుకు గగన్ ముందే భర్త కేపీని విడాకులు ఇవ్వమని అడుగుతుంది శారద. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: నా ఇష్టాన్ని కాదనకుండా మన పెళ్లి అత్తయ్యా మామయ్యల చేతుల మీదుగా జరిపించేందుకు నువ్వు ఒప్పుకున్నావా..? బావ అంటూ భూమి సంతోసంగా కార్డు తీసుకుని గగన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ ఆశ్చర్యంగా కార్డు తీసుకుని ఓపెన్ చేసి చూసి కోపంతో ఊగిపోతాడు.
భూమి: సర్‌ప్రైజ్ నాకు ఎప్పుడు రివీల్ చేద్దామనుకున్నారు.
గగన్: ఇది నేను ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు కాదు.
భూమి: బావ ఏం మాట్లాడుతున్నావు.
గగన్: ఏం మాట్లాడుతున్నానా..? నా పర్మిషన్ లేకుండా ఆ కృష్ణ ప్రసాద్ ఎప్పుడూ మా జీవితంలోకి చొరబడుతూనే ఉంటాడు. ఇది నేను ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు కాదు. ఆ కృష్ణ ప్రసాద్ వేయించింది. ఎక్కడున్నాడు.
భూమి: బావ వద్దు ఈ టైంలో గొడవలు వద్దు..
గగన్: చూడు భూమి నేనా..? కృష్ణ ప్రసాదా.? అనే ప్రశ్న వస్తే నువ్వు నా వైపే నిలబడాలి. ఎందుకంటే నువ్వు నాలో సగం. ఎక్కడ ఉన్నాడు కృష్ణ ప్రసాద్ చెప్పు.
భూమి: ఏదో పనుందని బైటికి వెళ్లాడు బావ.
గగన్: ఏదో పని కాదు. ఈ కార్డులు పట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు. ఎక్కడుంటే అక్కడ ఎదురు పడతాను. ఈరోజు తాడో పేడో తేలిపోతుంది.
అంటూ కార్డు చింపేసి గగన్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. రోడ్డు మీద కృష్ణ ప్రసాద్ కారులో వెళ్లడం చూసి గగన్ ఫాలో అవుతాడు. కృష్ణ ప్రసాద్ గగన్ ఇంటికే వెళ్తాడు.
కేపీ: శారద.. శారద.. గగన్ ఏడీ ఎక్కడున్నాడు వాడు. వాడిని వెంటనే కలవాలి. వాడికి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు.
పూరి: ఇక్కడ మీ కొడుకు కూతుర్లు ఎవ్వరూ లేరు బయటకు నడవండి.
కేపీ: పూరి నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను నీ అన్నయ్య నా కొడుకును కలవడానికి వచ్చాను. శారద ఏడీ వాడు ఎక్కడున్నాడు.
శారద: అసలు ఏంటండీ మీ ధైర్యం. నా కూతురు కరెక్టుగా చెప్తుంది. ఇక్కడ మీ కొడుకులు కూతుర్లు ఎవ్వరూ లేరు. నడవండి బయటకు మీరు వెళితే గౌరవం. మేము పంపిస్తే అవమానం. ఆలోచించుకోండి.
కేపీ: శారద నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నా కొడుకు గగనే గుర్తుకు వస్తున్నాడు. వాడు కూడా నీలాగే మనసులో ప్రేమ పెట్టుకుని పైకి కోపం నటిస్తుంటాడు. శారద ఎక్కడ వాడు ఏడీ చెప్పమ్మా వాడు ఎక్కడ..?
ఇంతలో గగన్ వస్తాడు. కోపంగా చూస్తుంటాడు. కేపీ హ్యాపీగా వెళ్లి హగ్ చేసుకుంటుంటే గగన్ ఆపేస్తాడు.
గగన్: ఇక నువ్వు నటించలేవురా ఈ నాన్న మీద ప్రేమను నువ్వు చూపించాల్సిందే. ఇన్నాళ్లు నేను వదిలేసిన ఇంటి బాధ్యతను నువ్వు మోస్తున్నావు అనుకున్నాను కానీ నేను మోయలేని బరువును కూడా నువ్వే మోస్తున్నావు అని నాకు ఈ రోజే తెలిసిందిరా
అంటూ కేపీ ఎమోషనల్ అవుతూ.. ఇందుకు కట్నం ఇచ్చిన విషయం చెప్తూ ఏడుస్తాడు. గగన్ మాత్రం కోపంగా అయిపోయిందా నీ ఊకదంపుడు ఉపన్యాసం అంటూ తిట్టగానే కేపీ షాక్ అవుతాడు.
గగన్: తండ్రిగా నా వెడ్డింగ్ కార్డులో నీ పేరు వేసుకుంటావా..?
కేపీ: నువ్వు ఎంత అరచినా తండ్రి కొడుకులుగా మన మధ్య బంధం తెగిపోదురా..?
శారద: ఎందుకు తెగిపోదు. ఇప్పుడు నా కొడుకు ఎదురుగానే అడుగుతున్నాను మనం విడాకులు తీసుకుందాం. విడిపోతే బంధాలు తెగిపోతాయి.
గగన్: హలో నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉందన్న ఆలోచనే నిన్ను ఏమీ చేయకుండా ఆపేసింది. ఇప్పుడు మా అమ్మే ఆ తాళి తీసేస్తానంటుంది సంతకం పెట్టు.
అంటూ లాక్కెళ్లి కేపీ చేత బలవంతంగా సంతకం పెట్టించబోతాడు గగన్. కేపీ సంతకం పెట్టకుండా లాగిపెట్టి కొడతాడు. తెంపుకుంటే తెగిపోయేవి బంధాలు కాదురా..? నేను నిన్ను కొట్టాను కదా..? నువ్వు తిరిగి కొట్టు అంటూ కేపీ అనగానే గగన్ మౌనంగా ఉండిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















