Meghasandesam Serial Today July 26th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని తిట్టిన గగన్ - ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానన్న భూమి
Meghasandesam serial today episode July 26th: పార్క్‌లో ఎదురుపడిన భూమిని తిట్టి గగన్ వెళ్లిపోవడంతో భూమి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: శోభా చంద్ర డెత్ యాక్సిడెంటల్ డెత్ కాదని.. ప్రీప్లాన్డ్ మర్డర్ అని ఎస్సై చెప్పగానే శరత్ చంద్ర షాక్ అవుతాడు. ఏ ఎవిడెన్స్‌తో అలా చెప్తున్నావు అంటూ అడుగుతాడు. ఎస్సై ఎవిడెన్స్ ఉందని చెప్పగానే అయితే మా గెస్ట్ హౌస్‌కు రండి మాట్లాడదామని శరత్ చంద్ర చెప్పగానే ఎస్సై సరే అని గెస్ట్ హౌస్‌కు వెళ్తాడు. శరత్ చంద్ర వచ్చే లోపే గెస్ట్‌హౌస్‌లో ఎస్సై మర్డర్ అయి ఉంటాడు. వెంటనే శరత్ చంద్ర డీఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. డీఎస్పీ పోలీసులతో గెస్ట్‌హౌస్‌కు వస్తాడు.
డీఎస్పీ: ఈ హీజ్ డెడ్.. చనిపోయాడు. మొత్తం వెతకండి వెళ్లి.. చూడండి ఇది చాలా డేంజరస్ డెత్. ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేశారు.
శరత్: అదే నాకు షాకింగ్ గా ఉంది డీఎస్పీ గారు. నా గెస్ట్ హౌస్‌లో ఇలా జరగడం నాకే ఆశ్చర్యంగా ఉంది.
డీఎస్పీ: అసలు ఇతను మీ గెస్ట్ హౌస్‌కు ఎందుకు వచ్చారు.
శరత్: నా మొదటి భార్య ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయింది. అదే విషయాన్ని నాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. మీ భార్య చనిపోలేదు.. చంపబడింది అని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో నేనే తనని నా గెస్ట్‌హౌస్ రమ్మని పిలవడం జరిగింది. నేను వచ్చి చూసే సరికి ఇలా జరిగింది.
డీఎస్పీ: సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఈ హత్య వెనక చాలా పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును ఈ గెస్ట్‌హౌస్‌లోకి మీరు ఇద్దరు కలిసే వచ్చారా..?
శరత్: మీ ఎస్సే నాకంటే అర గంట ముందే వచ్చారు సార్.
డీఎస్పీ: మీరు రాక ముందు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎవరు ఉన్నారు..?
శరత్: మా వాచ్‌మెన్ ఉన్నారు.
కానిస్టేబుల్స్ బయటకు వెళ్లి వాచ్‌మెన్‌ను తీసుకొస్తారు.
డీఎస్పీ: మా ఎస్సై గెస్ట్‌హౌస్‌కు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా..?
వాచ్‌మెన్: ఉన్నాను సార్..
డీఎస్పీ: మా ఎస్సైని చంపినోణ్ని నువ్వు చూశావా..?
వాచ్‌మెన్: లేదు సార్ నేను కిరాణా సామాన్లు తీసుకోవడానికి బయటకు వెళ్లాను. మా సార్ ఫోన్ చేస్తే వచ్చాను.
అని చెప్పగానే సరే నువ్వు వెళ్లు అంటూ శరత్‌చంద్రను పక్కకు తీసుకెళ్లిన డీఎస్పీ.. ఇది మామూలు విషయం కాదు. నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెల్లకండి.. అలాగే మీ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి డీఎస్పీ వెళ్లిపోతాడు. తర్వాత గగన్ పార్క్‌లో జాగింగ్ చేస్తుంటే.. షూ లేస్ ఊడిపోతుంది. వెనకాలే మంకీ క్యాప్ వేసుకుని వచ్చిన భూమి లేస్ పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత కొద్ది దూరం వెళ్లాక గగన్ అలిసిపోయి కూర్చుంటే మళ్లీ భూమి వచ్చి వాటర్ ఇస్తుంది.
గగన్: ఎవరండి మీరు హెల్ప్ చేస్తున్నారు కానీ ఫేస్ చూపించరు.
అనగానే.. భూమి తిరిగి చూస్తుంది. గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే..
భూమి: బావ.. ఆగు బావ నేనేం పిచ్చిదానిలాగా ఆ ప్రపోజల్ పెట్టలేదు. ఒక పర్పస్‌తోనే పెట్టాను.
గగన్: ఇక ఆ పెళ్లి గురించి గతంలో గతించిన మన ప్రేమ గురించి ఇంకెప్పుడు టాఫిక్ తీసుకురాకు.
భూమి: ఏంటి మన ప్రేమ గతించిందా..? ఇంకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. మన ప్రేమ ఎప్పటికీ గతించదు..
అంటూ భూమి ఎమోషనల్ అవుతుంటే గగన్ కోపంగా మళ్లీ ప్రేమ అనే మాట ఎత్తకు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తూ చూస్తూనే ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















