Meghasandesam Serial Today January 18th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని ఎత్తుకెళ్లిన రౌడీలు - కారులో నిద్రపోతున్న గగన్
Meghasandesam Today Episode: అపూర్వ ప్లాన్ ప్రకారం భూమిని కారు దగ్గరకు పంపిస్తుంది. అక్కడికి వెళ్లిన భూమిని రౌడీలు ఎత్తుకెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : వనభోజనాల దగ్గర ఉన్న మెడికల్ క్యాంపులో ఇందు చేతికి కట్టు కట్టించుకుంటుంది. అది చూసిన మీరా కంగారు పడుతుంది. దగ్గరకు పరుగెత్తుకొచ్చి ఏమైందని అడుగుతుంది. మీరు కట్నం ఇవ్వనందుకు మేము పడుతున్న ఇబ్బంది ఇది అంటూ ఇందు.. మీరాను తిడుతుంది. ఈ ప్రోగ్రాం అయిపోయాక వదినతో మాట్లాడతాను.. అంటూ వంశీకి థాంక్స్ అల్లుడు గారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ మీరా చెప్తుంది.
వంశీ: అత్తయ్యగారు ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు.. అది నా బాధ్యత. చూడండి వాళ్లు అంతా ఎంత ఆనందంగా ఉన్నారు. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టి.. ఇక్కడ సంతోషంగా ఉన్న వాతావరణాన్ని ఏడుపుల వర్షంగా మార్చకండి. ఎలాగైతేనేం ఇక్కడికి వచ్చాము కదా..? ఈరోజు ఆ విషయాన్ని మర్చిపోయి అందరం హ్యాపీగా ఉందాం..? పదండి అత్తయ్య గారు..
అంటూ అక్కడి న ఉంచి వస్తారు. టెంటు కింద గగన్, అపూర్వ, పూరి కలిసి డల్లుగా కూర్చుని ఉంటారు. మరోవైపు చెర్రి వాళ్లు అందరూ గేమ్ ఆడుతూ హ్యాపీగా ఉంటారు. అపూర్వ, సుజాత దూరం నుంచి అందరినీ గమనిస్తుంటారు.
అపూర్వ: చూశావా పిన్ని.. మనం ఇంత ఫ్యామిలీతో వస్తే వాళ్లు లింగు లింగు మంటూ ముగ్గురే వచ్చారు.
సుజాత: వాళ్ల ఫ్యామిలియే లింగు లింగు ఫ్యామిలీ పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు.
అపూర్వ: అంతే కదా..? పోనీ వచ్చిన వాళ్లు ఆనందంగానైనా ఉన్నారా..? అంటే అదీ లేదు.. డల్లుగా ఉన్నారు.
సుజాత: నీ కూతురుతో ముద్దులు, హగ్గులు.. సైడు సైడున లాగించేస్తున్నాడే..చెప్పినా నీకు అది అర్థం కావడం లేదు. నిన్ను నమ్మించడానికి మాత్రం నీ ముందు ముద్దపప్పులా నటిస్తున్నాడు. ( అని మనసులో అనుకుంటుంది.)
అపూర్వ: ఏంటి పిన్ని ఏమీ మాట్లాడవు..
సుజాత: అంటే మైండ్ వాయిస్ వేసుకున్నాను అమ్మాయి. అది బయటకు చెప్పినా నువ్వు నమ్మవు.. నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పు..
అపూర్వ: వాళ్లు డల్లుగా ఉన్నారు కదా..?
సుజాత: అవును డల్లుగా ఉన్నారు.
అపూర్వ: వాళ్లను ఉడికించడానికి నేను మన శిబిరంలో ఎంటర్‌టైన్ చేయిస్తాను.
సుజాత: అంటే ఎలా అమ్మాయి..
అపూర్వ: నేను అందరితో డాన్సులు వేయిస్తాను..
సుజాత: అమ్మాయి.. అంటే గొర్రెను బలి ఇచ్చే ముందు అమ్మోరు ముందు అందరూ డాన్సులు వేస్తుంటారు. అంటే నువ్వు ఇప్పుడు భూమిని బలి ఇవ్వడానికి ముందు అందరితో డాన్సులు వేయిస్తాను అంటావు.
అపూర్వ: ఒక విధంగా అలాగే అనుకో
సుజాత: మరి ఇంకెందుకు ఆలస్యం కానివ్వు అమ్మాయి.. వెళ్లు
అని సుజాత చెప్పగానే.. అపూర్వ, శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి మనం ఇలా డల్లుగా కూర్చుంటే ఎలా అంటూ డాన్సులు చేద్దాం అంటుంది. సరే అంటూ అందరూ డాన్స్ చేయడానికి రెడీ అవుతారు. మొదటగా సుజాత డాన్స్ చేస్తుంది. తర్వాత ఒక్కొకరు డాన్స్ చేస్తారు. ఇంతలో శరత్ చంద్ర భూమి, గగన్‌లకు పోటీ పెడతాడు. అందులో గగన్‌ను అవమనించి అక్కడి నుంచి పంపిచేస్తాడు. భూమిని చంపడానికి ఇదే సరైన సమయం అనుకున్న అపూర్వ.. భూమిని కారు దగ్గరకు పంపిస్తుంది. కారు దగ్గరకు వెళ్లిన భూమి చుట్టూ రౌడీలు వచ్చి నోరు మూసి భూమిని అడవిలోకి ఎత్తుకెళ్తారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

