Meghasandesam Serial Today April 26th: ‘మేఘసందేశం’ సీరియల్: ఏసీపీతో భూమి చాలెంజ్ - భూమిని తిట్టిన ఏసీపీ
Meghasandesam Today Episode: స్టేషన్ వచ్చి చాలెంజ్ చేసిన భూమిని ఏసీపీ కోపంగా తండ్రిని చంపిన వాడిని ఎలా ప్రేమిస్తున్నావు అంటూ తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్ ను ఏసీపీ అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో శారద కళ్లు తిరిగి కింద పడిపోతుంది. విషయం తెలిసిన అపూర్వ పగలబడి నవ్వుతుంది. అమ్మాయి ఎక్కువగా నవ్వమాకు నవ్వి నవ్వి చచ్చిపోతావేమోనని నాకు భయంగా ఉంది అంటుంది.
అపూర్వ: చచ్చే రకం కాదు పిన్ని ఈ అపూర్వ. వాడు ఆ గగన్ గాడు నా ఇంటికి వచ్చి నన్నే జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తాడా..? అందుకే వాణ్నే జైల్లో పెట్టించా..?
సుజాత: ఇందులో మనం చేసింది ఏముంది అమ్మాయి. వాడు అల్లుడు గారిని చంపించాలనుకున్నాడు. కర్మ కాలి వాడు పెట్టిన మనిషి దొరికిపోయాడు.
అపూర్వ: ఇంకా నీకు అర్థం కాలేదా పిన్ని ఆ మనిషిని పెట్టింది నేనే..
అంటూ స్టేషన్‌లో వాడికి అపూర్వ సైగ చేసి గగన్ పేరు చెప్పించిన విషయం చెప్తుంది.
సుజాత: అంటే వాడు నిజంగా అల్లుడు గారిని చంపడానికి వచ్చిన మనిషి కాదా..?
అపూర్వ: కాదు వాడు నా మనిషి. దొరికిపోవడాకే చెర్రి కంట పడ్డాడు.
సుజాత: అమ్మో నాకు చెప్పకుండా చాలా పెద్ద ప్లాన్ చేశావు అమ్మాయి.
అపూర్వ: కొన్ని చెప్పకుండా చేయాలి. వినేవాళ్లకు థ్రిల్లింగ్ గా ఉండాలి. ఇప్పుడు ఆ గగన్ గాడు భూమి చావును ఎలా అడ్డుకుంటాడో చూస్తాను. పెళ్లి చేసుకుంటామని ఎగిరిఎగిరి పడ్డారో ఎక్కడ అవుతుంది పిన్ని పెళ్లి. వాడు జైళ్లోనే మగ్గి మగ్గి చావాలి. అంతకంటే ముందు భూమి నా చేతుల్లో చిత్రహింసలు అనుభవించాలి.
అని చెప్తుంది అపూర్వ. బిందు, ఇందుకు ఫోన్ చేసి మామయ్యను గగన్ అన్నయ్య చంపించబోయారని పోలీసులు అన్నయ్యను అరెస్ట్ చేశారు అక్కా అని చెప్తుంది. దీంతో ఏయ్ బిందు నువ్వు నన్ను ఆట పట్టించడానికే చెప్తున్నావు కదా అంటుంది ఇందు. ఏం లేదు అక్కా నిజం అని బిందు చెప్పగానే ఇందు ఏడుస్తూ కూర్చుంటుంది. మరోవైపు ఏసీపీ గగన్‌ను తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేస్తుంటుంది.
ఏసీపీ: మిస్టర్ గగన్ నువ్వు చదువుకున్నోడివి. క్రైమ్ తప్పని నీకు తెలుసు. తెలుసు కనుకే చిన్నప్పటి నుంచి శరత్ చంద్రతో శత్రుత్వం ఉన్నా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వచ్చావు. మిస్టర్ గగన్ ఏం మాట్లాడకుండా కూర్చోవడానికి ఇది మీ ఇల్లో.. ఆఫీసో కాదు. ఏదో ఒకటి మాట్లాడండి.
గగన్: చూడండి.. అడగాల్సింది సగంలోనే ఆపి నేను రైటా రాంగా..? అని మీరు అడిగితే నేనేం చెప్పగలను. క్రైమ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. క్రైమ్ చేయాలని నేను కలలో కూడా అనుకోను. శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్‌కు నాకు ఎలాంటి సంబంధమే లేదు.
ఏసీపీ: ఈ మాట నీవు సుపారీ ఇచ్చి శరత్ చంద్ర గారిని చంపమని చెప్పిన రాజారత్నం మాకు దొరికే వరకే చెల్లుతుంది మిస్టర్ గగన్.
గగన్: అసలు వాడు ఎవడో నాకు తెలియదు.
ఏసీపీ: క్రైమ్ లో అబద్దం కామనే లే మిస్టర్ గగన్. క్రైమ్ రాంగ్ అని నమ్మే నువ్వు ఎప్పటికీ క్రైమ్‌ను టచ్ చేయాలనుకోరు. కానీ ఈ ప్రేమ అనే పదం ఉందే. ఇది మహా చెడ్డది గగన్. ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఆ ప్రేమ కోసమే శరత్ చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ చేశావు.
అంటూ ఏసీపీ చెప్పగానే మీరు కూడా కట్టుకథలు బాగానే అల్లుతున్నారు అంటూ గగన్ కోప్పడతాడు. తర్వాత స్టేషన్‌కు వచ్చిన భూమి ఏసీపీతో చాలెంజ్ చేస్తుంది. గగన్ నిర్దోషి అని ప్రూవ్ చేస్తా అంటుంది. ఏసీపీ కూడా చాలెంజ్ చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















