అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 27th: విక్రమ్ గురించి శ్రీలక్ష్మీని మ్యాడీ ఏమని హెచ్చరిస్తాడు..? సింధూకు విడాకుల ఇవ్వడానికి గోపీ ఎందుకు ఒప్పుకోలేదు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 27th: విక్రమ్ గురించి శ్రీలక్ష్మీని మ్యాడీ ఏమని హెచ్చరిస్తాడు..? సింధూకు విడాకుల ఇవ్వడానికి గోపీ ఎందుకు ఒప్పుకోలేదు...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: తాను ఎన్నిచేసినా ఆ లక్ష్మీపై గెలవలేకపోతున్నానని త్రిష బాధపడుతుంటుంది. మనం వేసే ఎత్తులన్నీ దానికి ఉపయోగపడుతున్నాయని ఫ్రెండ్స్‌తో అంటుంది. వాళ్లు కూడా దానికన్నా నువ్వే బాగా డ్యాన్స్ చేశావని..అనవసరంగా గాజుపెంకులు వేయడం  వల్ల తను ఆపకుండా డ్యాన్స్‌ చేసి గెలిచిందని అంటుంది.ఇంతలో విక్రమ్ అక్కడికి వస్తాడు. త్రిష వెళ్లి విష్‌చేసి సారీ విక్రమ్‌ మనం గెలవడానికి చాలా ప్రయత్నించామని కాకపోతే....ఆ లక్ష్మీ గెలిచిందని అంటుంది.నాకు ఏం బాధలేదని....నేను ఓడిపోయానని బాధ కన్నా లక్ష్మీ గెలిచిందన్న సంతోషమే నాకు ఎక్కువ ఉందని అంటాడు. అయినా మనం ప్రేమించిన వాళ్లు గెలిస్తే మనం గెలిచినట్లే కదా అని  అంటాడు. కానీ బాధ అంతా ఆ మ్యాడీతోనేనని అంటాడు. అయినా నా ప్రతివిషయంలో వాడు అడ్డుపడుతూనే ఉన్నాడని...సీనియర్‌ అని కూడా చూడకుండా నా చొక్కా పట్టుకున్నాడని మండిపతాడు. నేనంటే ఏంటో వాడికి చూపిస్తానని చెబుతాడు.వెంటనే కలుగజేసుకున్న త్రిష...నువ్వు ఫోకస్‌చేయాల్సింది లక్ష్మీమీదకానీ మ్యాడీ మీద కాదని చెబుతుంది. లక్ష్మీ వాళ్ల ఇంట్లో ఉంటుంది కాబట్టి అతను తనకు రక్షణగా ఉండటంలో తప్పులేదని అంటుంది. ఆ ప్లేస్‌లోనువ్వు  ఉన్నా అదే పని చేస్తావని చెబుతుంది.

Also Read: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?

త్రిష,విక్రమ్ మాట్లాడుకుంటుండగానే....మ్యాడీ, లక్ష్మీ వస్తారు.కాంపిటేషన్‌లో గెలిచినందుకు అందరూ వారిని అభినందిస్తారు. త్రిషకూడా వెళ్లి మ్యాడీకి షేక్‌హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పగా...విక్రమ్ లక్ష్మీ చెబుతాడు.  ఇంతలో పీటీసార్ వచ్చి పర్యావరణ దినోత్సవం సందర్భంగా అడవిలో ఓరోజు గడిపేందుకు వెళ్తున్నామని...ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పేర్ల ఇవ్వమని అంటాడు. నాకు చదువుకునే పని ఉందని విక్రమ్ రానంటాడు.త్రిష మనం కూడా వెళ్దామని మ్యాడీని అడగ్గా....నాకు ఆడిషన్‌ ఉందని రానంటాడు. లక్ష్మీ తాను వస్తానని త్రిషతో చెబుతుంది. నువ్వు కూడా రావొచ్చుకదా అని మ్యాడీని అడుగుతుంది. లక్ష్మీ వస్తానని చెప్పేసరికి విక్రమ్‌ కూడా వస్తానంటాడు.ఇంతలో మ్యాడీ కలుగజేసుకుని లక్ష్మీపై మండిపడతాడు. అడవిలోకి వెళ్లాలంటే తాతయ్య పర్మిషన్‌లేకుండానే పేర్లు ఇచ్చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెద్దయ్య ఇలాంటి వాటికి  ఒప్పుకుంటాడని చెబుతుంది.వెంటనే ఆమెను పక్కకు లాక్కెళ్లి గట్టిగా మందలిస్తాడు.అసలు ఏం జరుగుతుందని నిలదీస్తాడు. ఆ విక్రమ్‌గాడు ముందు రానన్నాడని...నువ్వు వస్తాననేసరికి వాడు వస్తానంటున్నాడని అంటాడు.వాడు నీ విషయంలో చాలా ఎక్కువ చేస్తున్నాడని నువ్వు చనువు ఇవ్వడం వల్లే ఇదంతా చేస్తున్నాడని తిడతాడు. అయినా నా గురించి మీకు తెలుసుకదా అని లక్ష్మీ అంటుంది. మీరు నా పక్కన ఉండగా....అలాంటివాళ్లు ఏం చేయలేరని చెబుతుంది. అడవిలో ఎలాంటి పిచ్చివేషాలు వేసి వాడికి అవకాశం ఇవ్వొద్దని గట్టిగా చెబుతాడు.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు కొత్త క్యారెక్టర్: ముఖాలు మాడ్చేసిన పొట్టి మిరపకాయ్ లవర్స్! ఆ ప్రేమలా ఈ ప్రేమ మెప్పిస్తుందా..! ఇకపై జరిగేది ఇదే!

విడాకుల పేపర్లపై సంతకాలు పెట్టేందుకు గోపీ, సింధూజాక్షి లాయర్ వద్దకు వెళ్తారు. అయినా కొరియర్‌లో పంపిస్తే సరిపోయేది కదా మళ్లీ ఇంతదూరం మీరు ఎందుకు వచ్చారని లాయర్‌ అడుగుతాడు. అవి మీకు చేరతాయో లేదోనని మేమే తీసుకుని వచ్చామని సింధూ చెబుతుంది. తాను పేపర్లపై సంతకం చేసి గోపీని చేయమని చెబుతుంది.సంతకం చేసేందుకు తటపటాయించిన గోపి...నాకు సంతకం చేయాలంటే మనసురావడం లేదని నేను చేయలేనని చెబుతాడు. ఆ మాటలు విన్న లాయర్‌...అదేంటమ్మా మీఇద్దరికీ ఇష్టమని చెబితేనే కదా నేను అప్లయ్‌ చేశానని అడుగుతాడు. ఈవిషయం నా ముందు చెప్పాడు కాబట్టి సరిపోయిందని...అదే  జడ్జీగారి ముందు చెబితే నా పరువు ఏం కావాలని నిలదీస్తాడు. నాకు సొసైటీలో ఉన్న మంచి పేరుకాస్తే పోయేదని మండిపడతాడు. నేను కావాలనే మీ ఇద్దరినీ విడదీస్తున్నానని అనుకుంటారు కదా అని అంటాడు. ముందు మీరు ఇద్దరు వెళ్లి మాట్లాడుకునిరండని అప్పుడు విడాకులు సంగతిచూద్దామని చెబుతాడు. దీంతో గోపీపై సింధూ మండిపడుతుంది.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?

కాలేజీ నుంచి లక్ష్మీ, మ్యాడీ వచ్చేసరికి ఇంట్లో ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం పెడుతుండటం చూసి శ్రీలక్ష్మీ కంగారుపడుతుంది. కానీ ఇప్పుడు శూన్యమాసం కాబట్టి...శ్రావణమాసం వచ్చేవరకు ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పడంతో కొంత తేరుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget