Krishna Mukunda Murari Serial Today May 6th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ట్విస్ట్ అదుర్స్ కదా.. సరోగసీ మదర్ ముకుంద అని తెలుసుకున్న మురారి.. కృష్ణకు సాయం చేయమన్న రజిని!
Krishna Mukunda Murari Serial Today Episode : మురారి తల మీద చేయి వేసి కృష్ణ, మురారిల బిడ్డను మోయబోయేది తానే అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : మురారి సరోగసి మదర్ గురించి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్ డాక్టర్ పరిమళతో మాట్లాడి ఆమె ఫ్రెండ్‌ని కలుస్తాడు. ఆ డాక్టర్ మురారి కోసం డాక్టర్ వైదేహిని సరోగసి ఫైల్ అడిగి తీసుకు రమ్మంటుంది.
మరోవైపు భవాని మధుని పిలిచి కిందున్న మధు రూమ్‌ని ఖాళీ చేసి కృష్ణకి ఇవ్వమని చెప్తుంది. దీంతో సరే అని మధు వెళ్తాడు. ఇంతలో కృష్ణ ఇంటికి వస్తుంది. డాక్టర్ ఏమన్నారని భవాని ప్రశ్నలు వేస్తుంది. అంతా బాగానే ఉందని కృష్ణ చెప్తుంది. ఇక కృష్ణ క్యాబ్‌లో వచ్చిందని తెలుసుకున్న భవాని ఫైర్ అవుతుంది. మురారికి కాల్ చేసి తిడుతుంది. మురారి తల పట్టుకుంటాడు.
కృష్ణ: పెద్దత్తయ్య మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు కదా పుట్టబోయే బిడ్డకు ఏం కాకూడదు అని ఏదైనా పూజ చేయిద్దామా..
భవాని: మంచి మాట చెప్పావ్. రేవతి పంతుల్ని పిలిపించు.
ముకుంద: మనసులో.. అసలు మురారి ఎక్కడికి వెళ్లాడు.
కృష్ణ: ఆదర్శ్, ముకుందల గురించి ఆలోచిస్తున్న రజినిని చూసి.. ఈవిడ ఏంటి ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతలా ఆలోచిస్తూ ఉందంటే ఈమెకు ఏ సమస్య వచ్చిందో.. పిన్ని దేని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నావ్.
రజిని: నేను ఏం ఆలోచిస్తే ఏంటి ఎవరైనా ఆరుస్తారా తీరుస్తారా నీ పని నువ్వు చూసుకోమ్మా.
కృష్ణ: పిన్ని నువ్వు అయినా నేను అయినా లొడలొడా వాగుతూ ఉంటేనే ఇంట్లో సందడి. మనం డల్ అయ్యాం అంటే ఏదో సమస్య వచ్చిందనే అర్థం. ఏమైందో చెప్పండి. నువ్వేదో పెద్దత్తయ్యని పేరు పెట్టి పిలిచావని అలా అన్నాను. కానీ నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నీ సమస్య చెప్పు పిన్ని.
రజిని: ఏముంటుందమ్మా నా కూతురికి పెళ్లి చేయాలి అదే నా బాధ. నీలాగ నా కూతురు కూడా ఈ ఇంటి కోడలు కావాలి. అప్పుడే ఆదర్శ్‌తో పెళ్లి చేయాల్సింది. వదిన వాళ్లకు కూడా ఇష్టమే. కానీ ఆదర్శ్ ఆ ముకుందని పెళ్లి చేసుకున్నాడు. అది పోయాక అయినా నా కూతురుతో పెళ్లి చేద్దామంటే ఆ ఆశ తీరినట్లు లేదు.
కృష్ణ: పెద్దత్తయ్యతో మాట్లాడావ్ కదా పిన్ని. ఆలోచిస్తా అన్నారు కదా.
రజిని: ఆలోచిస్తా అంది కానీ ఆదర్శ్ కూడా ఒప్పుకోవాలి కదా. వాడేమో నా కూతురి ముఖం కూడా చూడడు. ఆ మీరా చుట్టూ తిరుగుతున్నాడు. సరిగ్గా గమనించు నీకే అర్థమవుతుంది. అది కూడా ఆదర్శ్ చుట్టూ తిరుగుతుంది. మీరా కూడా అదే చెప్పింది. నీ కూతురుకి ఆదర్శ్‌కి పెళ్లి జరిపిస్తా అని చెప్పింది.
కృష్ణ: అవునా ఇదెప్పుడు జరిగింది.
రజిని: ఎప్పుడో మేం వచ్చినప్పుడే మాట అయితే ఇచ్చింది కానీ అది మాత్రం ఆదర్శ్‌తో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. డబుల్ గేమ్ ఆడుతుంది కృష్ణ.
కృష్ణ: అంటే మీరు చెప్పేది నిజమేనా.
రజిని: అయ్యో.. ఊరికే ఓ ఆడపిల్ల మీద నిందలు వేస్తానా చెప్పు. మేం అడిగినప్పుడే తనకి ఆదర్శ్ అంటే ఇష్టం అని ఒప్పుకుంటే వదినతో గొడవ పడతామో ఆదర్శ్‌తో గొడవ పడతామో అని చెప్పి మాటిచ్చింది.
కృష్ణ: మీరా ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు పిన్ని.
రజిని: మేమూ ఊహించలేదు. అందుకే భయంకరంగా మోస పోయాం. కృష్ణ మాకు ఓ సాయం చేస్తావా. నువ్వయినా నా కూతురు పెళ్లి ఆదర్శ్‌తో జరిగేలా చేస్తావా. గంపెడు ఆశతో వచ్చాం. ఈ పెళ్లి జరగకపోతే నేను నా కూతురు ఏమైపోతామో.
మురారి: తనలో తాను.. ఆ మదర్ ఎవరు? తెలుగు వారా వేరే స్టేట్‌నా. బయట వాళ్లనే తెప్పిస్తారు. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఎవరనేది తెలీకుండా ఉండటానికి. ఎవరైనా సరే కనిపెట్టి కృష్ణ ముందుకు తీసుకెళ్లాలి.
ఇంతలో కృష్ణ మురారికి కాల్ చేస్తుంది. భవానితో తనని ఎందుకు తిట్టించావని మురారి కృష్ణని అడుగుతాడు. సరోగసీ మదర్ గురించి కాసేపట్లో తెలుస్తుందని మురారి అంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడని మురారి అడుగుతాడు.
ముకుంద: కృష్ణని ఒంటరిగా ఇంటికి పంపించి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు.
మురారి: నీకు అంతా తెలుసు కదా. నీ దగ్గర దాయడానికి ఏముంది. సరోగసీ కోసం వచ్చాం కదా. లక్కీగా మదర్ దొరికింది. అది ఎవరో తెలుసుకోవాలి అని కృష్ణ ఆరాటం. రూల్స్ ఒప్పుకోవని తెలుసు కానీ అది ఎవరో తెలుసుకుందామని నా ఫ్రెండ్ పరిమళకి కాల్ చేస్తే డాక్టర్ మీనాక్షికి చెప్పింది. ఆ మదర్ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది.
ముకుంద: ఇప్పుడు ఆవిడ ఎవరో తెలుసుకొని ఏం చేస్తారు.
మురారి: తాను ఎవరో తెలుసుకొని ఆవిడని జాగ్రత్తగా చూసుకుందామని కృష్ణ అంటోంది. అసలు మా బిడ్డని తొమ్మిది నెలలు మోయబోయే ఆవిడ మాకు దేవతతో సమానం. తనని మేం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాం.
ముకుంద: ఆవిడ ఎవరో తెలిస్తే నిజంగానే అంత జాగ్రత్తగా చూసుకుంటావా.
మురారి: చెప్పాను కదా మా బిడ్డను మోసేది అంటే మా ప్రాణాలన్ని మోసేది ప్రాణంగా చూసుకుంటాం. అసలు నీ డౌట్ ఏంటి. ఎంత కేరింగ్‌గా చూసుకుంటామో నీకు అర్థం కాదు. పసి బిడ్డలా చూసుకుంటాం.
ముకుంద: మురారి తల మీద చేయి వేసి.. మీ బిడ్డను మోయబోయే ఆ సరోగసీ మదర్‌ని నేనే.
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద.
ముకుంద: నీ మీద ఒట్టు వేసి చెప్తున్నా కదా నమ్మకం కలగడం లేదా.
మురారి: అసలు నువ్వెందుకు ఇంత పిచ్చి నిర్ణయం తీసుకున్నావ్.
ముకుంద: పిచ్చి నిర్ణయం ఏంటి మురారి గారు. మీరు ఇప్పుడే అన్నారు కదా దేవతలా చూసుకుంటానని.. చంటి పిల్లలా చూసుకుంటామని మీ ప్రేమను పొందడం కోసం ఏమైనా చేస్తా.
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద. ఇలా పరాయి వాళ్ల బిడ్డను మోయడం అంటే సగం జీవితం కోల్పోవడం నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావ్.
ముకుంద: చెప్పాను కదా మురారి నీ ప్రేమ కోసమని.
మురారి: మళ్లీ చెప్పు.
ముకుంద: అదే మీ కుటుంబం ప్రేమ కోసం. అయినా ఏదో ఆశించి చేస్తుంది కాదు. ఇది నా బాధ్యత. ఈ దిక్కు లేని నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నాకు అండగా నిలిచారు. మీ రుణం కొంత అయినా తీర్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను కాదు అనకండి మురారి గారు. ఎందుకు షాక్ అవుతున్నారు. హ్యాపీగా ఫీలవ్వండి. నా కంటే మీ బిడ్డను బాగా చూసుకునే వారు దొరకరు కదా. నాలా మీ పక్కనే ఉండే అమ్మాయి మీకు దొరకదు కదా. నా కడుపులో పెరగడం అంటే కృష్ణ కడుపులో పెరిగినట్లే. హ్యాపీగా ఇంటికి వెళ్లి కృష్ణకు చెప్పండి సంతోషిస్తుంది. వెళ్లండి.
మురారికి తానే సరోగసి మదర్ అని చెప్పి ముకుంద చాలా సంతోషిస్తుంది. మరోవైపు కృష్ణ సరోగసీ మదర్ ఎవరా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మురారి కృష్ణకు చెప్పాలి అని కాల్ చేస్తా అనుకొని ఇప్పుడు కాదు అనుకుంటాడు. ఇంతలో ముకుంద మురారిని చూసి తనకి కనీసం ఇంటికి డ్రాప్ చేస్తానని పిలవడం లేదని తెగ ఫీలవుతుంది. ఇంతలో మురారి ముకుందని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శోభ మాయలో పడి దీపని దారుణంగా అవమానించి.. ఇంటి నుంచి తరిమేసిన అనసూయ