Karthika Deepam 2 Serial Today May 6th: కార్తీకదీపం 2 సీరియల్: శోభ మాయలో పడి దీపని దారుణంగా అవమానించి.. ఇంటి నుంచి తరిమేసిన అనసూయ
Karthika Deepam 2 Serial Today Episode : దీపకి న్యాయం చేస్తానని తీసుకొచ్చిన అనసూయ కొడుకు ఇంట్లో ఉంటానని దీపని తరిమేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : శోభ తన తల్లి పెళ్లి చేసి కోటి రూపాయల విలువ చేసే ఇళ్లు, పది లక్షలతో బంగారం, మరో పది లక్షలతో నర్సింహకు కారు కొని ఇచ్చిందని అనసూయకు చెప్తుంది. అవన్నీ విన్న అనసూయ షాక్ అవుతుంది. శోభ దగ్గరకు వెళ్లి తాను వేసుకున్న నగల్ని ఎగాదిగా చూసి ఇవన్నీ నిజం బంగారమా అని అడుగుతుంది. శోభ అవును అని చెప్పడంతో అనసూయ ప్లేట్ మార్చేస్తుంది.
శోభ: అయినా నీ కొడుకు నన్ను మేపడం కాదు. నేను నీ కొడుకుని పందెం కోడిలా మేపుతున్నా. ఇంకా ఈ నిజం మా అమ్మకి తెలీదు. ఆవిడ మీలాంటిదే చెప్తే ఈ పందెం కోడిని ఉతికి ఆరేసేది.
నర్సింహ: విన్నావా అమ్మా నా కోసం ఇంత చేసిన ఈ శోభని ఏలుకోవాలా.. వేరే వాడితో తిరుగుతున్న ఈ దీపని ఏలుకోవాలా..
దీప: మళ్లీ ఆ మాట అన్నావంటే నాలుక చీరాస్తే చెప్తున్నా.
అనసూయ: చీరావు కానీ.. ఆగవే.. వాడు తప్పు ఒప్పుకున్నాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఈ పిల్లది ఏ తప్పు లేదని అర్థమవుతుంది. నిన్ను ఓ మాట అడుగుతాను సమాధానం చెప్పవే. ఆరేళ్లు నువ్వు మొగుడి కోసం ఎదురు చూశావా లేదా.
దీప: చూశాను.
అనసూయ: నువ్వొచ్చింది వాడి కోసమే కదా.
దీప: అవును.
అనసూయ: మొగుడి కోసం వచ్చిన దానివి.. వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే అంత తేలికగా ఎలా వదిలేసి వెళ్లిపోయావే. ఆడది ఏదైనా వదులు కుంటుంది కానీ సంసారం వదులుకోదు కదా. వాడు అలాంటి వాడే కాబట్టి రకరకాల మాటలు అంటాడు . నువ్వు వదులు కోకూడదు కదా. కాపురం కావాలి అనుకున్నదానివి అయితే వీడు కొట్టినా.. తిట్టినా.. ఇక్కడ నుంచి కదిలే దానివే కాదు. లేదా ఊరు వచ్చి నాకు చెప్పుండాలి. ఈ రోజు చేసిన పని ఆ రోజు చేసేవాళ్లం. చేయలేదు అంటే ఏంటి అర్థం.
నర్సింహ: నా కంటే గొప్పొడు దొరికితే నాతో ఏం పని ఉందమ్మా.
అనసూయ: వాడి మాటల్లో ఎంతో కొంత నిజం ఉందే. వీడు నాకు అబద్దం చెప్పడం కాదు నువ్వే నాకు అబద్ధం చెప్పావు.
శోభ: అత్తని లైన్‌లో పెట్టుకుంటే దీపని తేలికగా వదిలించుకోవచ్చు.
దీప: అన్నీ తెలిసిన నువ్వే ఇలా అంటే నేనేం చెప్పాలి అత్తయ్య.
నర్సింహ: ఇవన్నీ కాదు అమ్మ దీపకు నాకు గొడవ జరిగి వారం అయింది. మళ్లీ నాతో మాట్లాడటానికి ఇది ఒక్కసారి అయినా ఇక్కడికి వచ్చిందా.
దీప: మళ్లీ వచ్చేలా మాట్లాడావా నువ్వు.
నర్సింహ: మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పు. ఇక్కడ నేను నా సుఖం చూసుకున్నట్లే నువ్వు చూసుకున్నావ్.
దీప: నర్శింహ.. మనం ఎన్ని చెప్పినా ఈ మనిషి మారడు అత్తయ్య నీకు ఇప్పటికైనా ఎవరెలాంటి వారో అర్థమైందా.
అనసూయ: నాకు ఇప్పుడే బాగా అర్థమైంది.
దీప: మనమే మారాలి. అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే ఇలాంటి మనిషితో నేను, నా కూతురు బతకలేం. పోదాం పద అత్తయ్య.. అని దీప అనసూయ చేయి పట్టుకుంటే అనసూయ చేయి వదిలించుకుంటుంది. దీప షాక్ అయిపోతుంది.
అనసూయ: వెళ్లవే దీప.. నేను నా కొడుకుతోనే ఉంటాను.
దీప: అత్తయ్య ఈ మనిషిని నమ్మకండి మిమల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెడతాడు. కొడుకు అని చూడకండి. ఆరేళ్ల దూరాన్ని అప్పుల బాధని కోడలికి ఇచ్చిన మాటని అన్నీ మర్చిపోయావా అత్తయ్య.
అనసూయ: గుర్తు పెట్టుకునేంత ఘనకార్యం నువ్వు చేయలేదు కాని నువ్వు బయల్దేరు.
ఎక్కడికి వెళ్లాలి అని దీప అడిగితే అనసూయ ఊరువెళ్లిపోమని చెప్తుంది. దీంతో దీప అప్పుల గురించి అడిగితే నర్సింహ అప్పులతో దీపకు సంబంధం ఏంటని అడుగుతాడు. తానే ఊరు వెళ్లి అప్పులు క్లియర్ చేసేస్తే ఇళ్లు మనది అవుతుంది అంటాడు. దానితో శోభ అవును అత్తయ్య మా అమ్మకి డబ్బులు అడిగాను అవసరం అయితే ఇప్పుడే తెమ్మని మొత్తం మీ చేతిలో పెడతాను అంటుంది. దీంతో అనసూయ పొంగిపోతుంది. దీపని వెళ్లగొడుతుంది. అప్పులకు ఆ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు అని నీకు మాకు ఏ సంబంధం లేదు అని అంటుంది. దీంతో దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక శోభ అత్తయ్యకు జ్యూస్ ఇచ్చి షాపింగ్‌కు తీసుకెళ్లి నాలుగు చీరలు కొంటాను అంటుంది.
మరోవైపు దీప గురించి పోలీసులు చెప్పిన మాటల్ని తలచుకొని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పారిజాతం మనవరాలి దగ్గరకు వచ్చి డల్‌గా ఉండకుండా పార్టీకి వెళ్లి కొంచెం తాగమని చెప్తుంది. ఇంతలో శివనారాయణ వచ్చి తన మనవరాలికి ఏదో చెప్తున్నావ్ అంటాడు. దానికి పారిజాతం గుడికి వెళ్దామని పిలిచానని అబద్ధం చెప్తుంది. ఇంతలో సుమిత్ర, దశరథ్ అక్కడికి వస్తారు. తన ఫ్రెండ్ కూతురు నిశ్చితార్థం ఉందని వెళ్తామని చెప్తారు. దీంతో పారిజాతం అందరి ఇంటికి వెళ్లడం మన ఇంటికి ఎప్పుడు రప్పిస్తావు అంటుంది.
ఇంతలో కార్తీక్ శౌర్యని ఎత్తుకొని వస్తాడు. శౌర్యని ఎత్తుకోవడంతో పారిజాతం తిడుతుంది. దీంతో శివనారాయణ పారిజాతాన్ని తిడతాడు. దీపని కూడా నువ్వే తిట్టుంటావని అంటాడు. దీప గురించి మాట్లాడుతుంటే జ్యోత్స్న చిరాకు పడుతుంటుంది. మరోవైపు దీప అనసూయ, నర్శింహ మాటలు తలచుకుంటూ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.