అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today March 30th: ముకుంద గుర్తులు లేకుండా చేసిన మీరా, మురారి షర్ట్‌తో రొమాన్స్!

Krishna Mukunda Murari Serial Today Episode: మీరా ముకుంద ఫొటో తీసేయాలి అని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో కృష్ణ మీరాని అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode: ముకుంద ఫొటోను గోడకు తగిలించి దండ వేయడం చూసిన మీరా ఆ ఫొటో తీసేయ్‌మని చెప్తుంది. ఆదర్శ్‌ కూడా ఆ ఫొటో ఇంట్లో ఉండటం తనకు ఇష్టం లేదు అంటాడు. ఇక భవాని ఇంట్లో ఉన్నన్ని రోజులు మనల్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఫొటో కూడా అని చెప్పి ఫొటోని తీసేయ్ మని చెప్తుంది. నీ చేతులతో నువ్వే తీసేయ్ అని ఆదర్శ్‌కు చెప్తుంది.

మీరా: అందరూ కలిసి నన్ను బాధ పెట్టి తిరిగి నేనే బాధ పెట్టాను అంటారు. పోనీలే ఫొటో తీయించేశా అది చాలు. 
కృష్ణ: మనసులో.. ఆదర్శ్‌ ముకుంద ఫొటో తీయమన్నాడు అంటే అర్థం ఉంది మరి మీరా ఎందుకు తీయమని అంటుంది. ఇక మధు అందరికి ఫొటో తీస్తాడు. 

కృష్ణ ముకుంద ఫొటోని తీసేయడం తనకు ఏం నచ్చలేదు అని మురారితో చెప్తుంది. ఇక ఆదర్శ్‌ తీయమనడంలో అర్ధం ఉంది. కానీ మీరా ఎందుకు తీయమని చెప్పింది అని మురారిని అడుగుతుంది. మీరా చెప్పిన సమాధానం తనకు నచ్చలేదు అని కృష్ణ చెప్తుంది. మీరా అంతరంగం ఏంటని అడుతుంది. దీంతో మురారి మీరాని సపోర్ట్ చేస్తాడు. మంచిదని పొగుడుతాడు. ఇక కృష్ణ బట్టలు మడతపెడుతూ మురారి షర్ట్ కనిపించడం లేదని వెతుకుంది. ఎక్కడో ఎగిరి పోయి ఉంటుంది అని నేను చూస్తా అని మురారి బయటకు వెళ్తాడు. మరోవైపు మీరా మురారి షర్ట్ చూసుకొని మురిసిపోతుంది. షర్ట్ పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. షర్ట్ పక్కన పడుకొని మురారి ఉన్నట్లు ఊహించుకుంటుంది. 

మీరా: వెళ్లొస్తా మురారి ఎక్కువ సేపు కాదు. ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తా.. ఏంటి ఎక్కడికి అని అడుగుతున్నావా. మా నాన్న దగ్గరకి ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాట్లాడుతారో తెలీదు కదా అందుకే జాగ్రత్తలు చెప్పి వస్తా. ఇది సీక్రెట్ ఎవరికీ చెప్పకు. ఎక్కడికి వెళ్తున్నావని అత్తయ్య అడిగితే అక్కడ చేస్తున్న జాబ్ మానేయమని అన్నారు కదా అది నిజం చేయడానికి అని చెప్పా. ఏంటి నువ్వేం జాబ్ అనుకుంటున్నావ్. ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అంటే చిన్న జాబ్ అని అబద్ధం చెప్పేశా అందుకే అది నిజం చేయడానికి వెళ్తున్నా.. నిన్ను దక్కించుకోవడానికి ఎన్ని అబద్ధాలు అయినా చెప్తా.. బయటకు వెళ్తూ మురారిని చూసి దగ్గరకు వెళ్తుంది మీరా..

మీరా: హాయ్ సార్ ఇంటికి వచ్చినప్పటి నుంచి మిమల్ని పలకరిద్దాం అనుకుంటా కానీ కుదరలేదు. 
మురారి: అయ్యో పర్లేదు ఇప్పుడు మీరు మా ఇంట్లో ఒకరు ఎప్పుడైనా పలకరించొచ్చు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఇక మురారి షర్ట్ గురించి మీరాకు చెప్తాడు. అది కృష్ణకు బాగా ఇష్టం అని చెప్తాడు. దీంతో మీరా ముందు ముందు కృష్ణ ఇంకా ఇబ్బంది పడుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక మీరా జాబ్ రిజైన్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. 

శ్రీనివాస్: అమ్మా నువ్వు కొత్తగా కనిపిస్తున్నావ్  ముఖంలో చిరునవ్వు అంటే చేరాల్సిన చోటుకే చేరావ్ అన్న మాట.
మీరా: లేకపోతే ఆ స్లమ్ ఏరియాలో అలాగే ఉండిపోతా అనుకున్నావా.. అయినా నీ కూతురి విషయంలో నీకు ఎప్పుడూ చిన్న చూసే నాన్న అంత నమ్మకం లేకపోతే ఇది చూడు అని మధు తీసిన ఫొటో చూపిస్తుంది. కొన్నిరోజుల తర్వాత ఇంకో ఫొటో పంపిస్తాను అని అది తాను మురారి పెళ్లి చేసుకునే ఫొటో అని అంటుంది. ఇక మీరా తనకు డబ్బు కావాలి అని తండ్రికి అడుగుతుంది. తర్వాత గోడకు తన ఫొటో తగిలించి దండ వేయమని చెప్తుంది. లేదంటే అందరికీ అనుమానం వస్తుందని అంటుంది. ఇళ్లు అమ్మేసి వేరే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన ఫొటోకి దండ వేయమని చెప్తుంది. 
శ్రీనివాస్: భగవంతుడా బతికున్నా కూతురు చనిపోయింది అనే క్షోభ ఏ తండ్రీకి రాకూడదు. అసలు మురారి అనేవాడే లేకపోతే ఏ బాధ ఉండదు. కానీ కృష్ణ అన్యాయం అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి. 

మరోవైపు కృష్ణ జరిగిన దాని గురించి బాధ పడుతుంది. శ్రీనివాస్ బాబాయ్‌ మళ్లీ ఏమైనా చేస్తాడేమో అని కృష్ణ కంగారు పడుతుంది. మురారి అలా ఏం జరగదు అని కృష్ణకు సర్దిచెప్తాడు. అయినా కృష్ణ కంగారు పడుతుంది. అనవసరంగా భయపడుతున్నావని అంటాడు మురారి. శ్రీనివాస్‌ను గమనిస్తూ జాగ్రత్తగా ఉంటాను అని మురారి అంటాడు. మరోవైపు ఆదర్శ్‌ మందు బాటిల్ తీసుకొని హాల్‌లోకి వస్తాడు. మధు వద్దని వారిస్తే ఆదర్శ్‌ అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 30th: విశాలాక్షి కాళ్లు కడిగిన నీళ్లను కక్కుర్తితో తాగేసిన తల్లీకొడుకులు!

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget