Trinayani Serial Today March 30th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి కాళ్లు కడిగిన నీళ్లను కక్కుర్తితో తాగేసిన తల్లీకొడుకులు!
Trinayani Serial Today Episode విశాలాక్షి దీక్షలో ఉండగా తనకోసం సుమన తీసుకొచ్చిన పాలను వల్లభ ఎంగిలి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode గాయత్రీ పాపని తల్లి నయనినే ఎత్తుకొని వెళ్లాలి అనుకుంది ఎందుకని వల్లభ ప్రశ్నిస్తాడు. అందర్ని నయనిని ప్రశ్నించమని చెప్తాడు. దీంతో నయని తాను నిజంగానే పాపని తీసుకెళ్లి ఇంటికి దూరంగా పెడదామనుకున్నాను అని అంటుంది. అందరూ షాక్ అవుతారు.
నయని: అమ్మానాన్నలను పోగొట్టుకున్న ఈ పాపకి నేను అమ్మని అయ్యాను. అంతటితో తన అదృష్టం ఆగలేదు. గాయత్రీ అమ్మగారి ఆస్తితో పాటు లలిత అమ్మగారి ఆస్తి కూడా దక్కడంతో అపర కుభేరురాలు అయింది. బాగుంటే దిష్టి పడుతుంది. ఇంత ఆస్తి ఉంది అని కూడా తెలీని పిల్ల మీద అసూయ పడేవారు చాలా మంది ఉన్నారు. అందుకే దూరం తీసుకెళ్లి అక్కడ పెడదాం అనుకున్నా.
పావనా: నువ్వు అలా అనడం నీ పరంగా మంచి పనే అమ్మ. కానీ విశాల్ బాబు ఊరుకుంటాడా.
హాసిని: అంతెందుకు లలిత అత్తయ్య గారు ఊరుకుంటాడు.
దురంధర: పిల్లను చూడటానికి మేం లేమా.. ఎక్కడికీ తీసుకెళ్లొద్దు. మా ప్రాణాలు అడ్డుపెడతాం.
హాసిని: వెళ్లి మీ అమ్మకు చెప్పండి ఎవరైనా ఇళ్లు వదిలి వెళ్లిపోవచ్చు కానీ గాయత్రీ పాప ఇక్కడే ఉంటుంది.
హాసిని ఇత్తడి పల్లెం తీసుకొని విశాలాక్షి దగ్గరకు వస్తుంది. విశాలాక్షి తన పాదాలను ఆ పెళ్లెంలో పెట్టమని అంటుంది. హాసిని విశాలాక్షి చెప్పినట్లు చేస్తుంది. ఇక విశాలాక్షి అమ్మవారు కావడంతో పల్లెంలో నీరు పెట్టగానే వాటంతట అవే నీరు వస్తాయి. హసిని షాక్ అయిపోతుంది. ఇక విశాలాక్షి ఆ నీటిని తీసుకెళ్లి పక్కన పెట్టమని హాసినికి చెప్తుంది. ఆ నీటిని తిలోత్తమ, వల్లభలు తాగబోతున్నారు అని విశాలాక్షి హాసినికి చెప్తుంది.
మరోవైపు సుమన పాలు తీసుకొని వస్తుంది. విశాలాక్షికి ఇస్తాను అని అంటుంది. వల్లభ సుమనను ఆపి ఆ పాలు విశాలాక్షికి ఎంగిలి చేసి ఇవ్వమని అంటాడు. సుమన ఆలోచనలో పడుతుంది. మరోవైపు హాసిని ఇంట్లో వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో పావనా మూర్తి రావడంతో తన సంతోషాన్ని చెప్పేస్తా అని హాసిని అంటే ఆ విషయం కేవలం ఒక్కరికే చెప్పాలి అని విశాలాక్షి అంటుంది. దీంతో హాసిని పావనాకు చెప్తుంది. ఇద్దరూ నవ్వుకుంటారు.
సుమన: ఏమీ అనుకోకండి బావగారు ఎంగిలి చేసిన పాలు ఇవ్వాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు.
వల్లభ: నీకు మనసు ఉంది అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇటు ఇవ్వు అని వల్లభ ఎంగిలి చేసేస్తాడు. నువ్వు ఈ పాల గ్లాస్‌ను తనకు ఇవ్వు చాలు. ఎంగిలి పాలు తాగితే తాను చేసిన పూజలు అన్నీ వ్యర్థమే కదా.
సుమన: ఆ పాపం నాకే కదా బావగారు.
వల్లభ: నీకు ఎందుకు పాపం. పాపాలు మాకు. ఎంగిలి పాలు ఆ పిల్లకు. పుణ్యం ఏమైనా వస్తే అది నీకే..
ఇక విశాల్, నయని వాళ్లు అక్కడికి వస్తే హాసిని, పావనాలు నవ్వుతారు. ఏమైందని అడిగితే మీకు చెప్తే మీరు అడ్డుకుంటారని చెప్పమంటారు. ఇక పల్లెం గురించి నయని అడుగుతుంది. విశాలాక్షి ఉండనివ్వమని చెప్తుంది. ఇక దురంధర అందరి కోసం టీ తెస్తుంది. సుమన పాలు తీసుకొని వస్తుంది. వాటిని హాసిని తాగుతా అంటే సుమన వద్దు అంటుంది.
సుమన: ఈ పాలు నీకు కాదు అక్క విశాలాక్షి కోసం తీసుకొచ్చా.
విశాల్: సుమన నువ్వు తెచ్చావా..
సుమన: లేదు బావగారు. పిన్ని తీసుకొస్తుంటే కాఫీ కావాలని అత్తయ్య వాళ్లు పురమాయించారు.
పావనా: గ్లాస్ సుమనకు ఇచ్చి దూర్ కిచెన్‌లోకి వెళ్తుందా..
విశాలాక్షి: ఇప్పుడు ఆ పాలు వద్దు.. అవి ఎంగిలి పాలు కదా.
హాసిని: పాలు తాగి తీసుకొచ్చారా ఏంటి.
తిలోత్తమ: ఏయ్ పిల్లా నువ్వు చూశావా ఏంటి మరి ఎందుకు నింద వేస్తున్నావ్.
విశాలాక్షి: చెప్పేది పూర్తిగా వింటారా నేను తాగాలి అని సుమన తీసుకొచ్చిన పాల వంక పెద్దమ్మ చూసి నాకు కావాలి అని అడిగింది అంటే ఎంగిలి అయినట్లే.
సుమన: చూస్తే ఎంగిలి అవుతుంది.
నయని: అవుతుంది. ఎవరైనా కావాలని అడిగితే దీక్ష చేసిన విశాలాక్షి లాంటి వాళ్లు వాటి వైపు చూడరు. ఇక ఆ పాలను తీసుకొని హాసిని తాగేస్తుంది. మిగతా అందరూ కాఫీ తాగుతారు. ఇంతలో వల్లభ, తిలోత్తమలు మంట అని ఏడుస్తారు. పక్కనే ఉన్న విశాలాక్షి కాళ్లు కడిగిన నీళ్లు తాగేస్తారు. హాసిని పావనాలు షాక్ అయి నవ్వుకుంటారు. దీంతో విశాలాక్షి ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడగారు అని అంటుంది. ఇక హాసిని పళ్లెం తీసుకొని వెళ్లి నాకు పని ఉంది అంటుంది. నయని ఆలోచినలో పడుతుంది. మరోవైపు వల్లభ మంటకు విలవిల్లాడిపోతాడు. పావనా అక్కడికి పంచదార తీసుకొస్తే హాసిని వల్లభకు ఇవ్వకుండా తాను తినేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.