Krishna mukunda Murari Serial Today february 24th: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ : సాగుతోన్న శోభనం ఎపిసోడ్ - ముకుంద కొత్త ప్లాన్ కూడా బెడిసి కొడుతుందా?
Krishna mukunda Murari Today Episode: ముకుంద శోభనానికి కృష్ణ కొత్త బట్టలు తీసుకురావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Krishna mukunda Murari Serial Today Episode: ముకుంద గురించే ఆలోచిస్తూ రూంలో కూర్చుని ఉంటుంది కృష్ణ. గదిలోకి మురారి వచ్చింది కూడా పట్టించుకోకుండా తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మురారి ఎంతసేపు చూసినా కృష్ణ ఉలకదు పలకదు. దీంతో మురారి కోపంగా కృష్ణ మీదకి దిండు విసిరేస్తాడు. దీంతో తేరుకున్న కృష్ణ ఏంటి కోపం వచ్చిందా? అనగానే
మురారి: మన శోభనం గురించి ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు కాదు రెండు జంటలకి ఒకేసారి ముహూర్తం పెట్టిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి మాత్రమే పెట్టిస్తే అర్థం ఏంటి? నేనంటే ఇష్టం లేదా? నీకు.
కృష్ణ: అలా అనకండి ఏసీపీ సర్. ముహూర్తాలనేవి వాళ్ళ జాతకాలని బట్టి పెడతారు.
మురారి: ఆ పంతులు ఫోన్ నెంబర్ ఇవ్వు ముహూర్తాలు ఎందుకు లేవో అడుగుతాను.
అని మురారి అనగానే సరే మనకి కూడా అదే ముహూర్తానికి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్తాను. రేపు మన పిల్లలు ఏ దొంగో రౌడీ అయితే పర్వాలేదా? మీకు అంటూ అడుగుతుంది కృష్ణ. ముకుంద వాళ్ళకి శోభనం జరిగిపోతే ఇక మనకి ఏ అడ్డు లేదు కదా నెక్ట్స్ ఏ ముహూర్తం ఉంటే మనకి అప్పుడే శోభనమని చెప్పి మురారిని కూల్ చేస్తుంది కృష్ణ. మరోవైపు శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలా అని ముకుంద ఆలోచిస్తుంది. ఆదర్శ్ కి చెప్తే ముహూర్తం పెట్టాక నీ అసలు రంగు బయట పెడతావా అని గొడవ చేస్తాడు. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలని ముకుంద ఆలోచిస్తుంది. ఇంతలో ముకుంద రూంలోకి కృష్ణ వస్తుంది.
కృష్ణ: ఏంటి టెన్షన్ లో ఉన్నావ్? ఈ శోభనం వద్దని అనుకుంటున్నావా? మీ ఒక్కరికే ముహూర్తం కుదిరిందని మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? శోభనానికి తెల్ల చీర, తెల్ల పంచె కొనాలి కదా పదండి వెళ్దాం
ముకుంద: ఇప్పుడు నాకు ఓపిక లేదు కృష్ణ. నేను షాపింగ్‌కు రాలేను. మాకు ఏవి బాగుంటాయో మీకు తెలుసు కదా మీరే తీసుకురండి.
అనేసరికి మురారి ఒకే అంటాడు. అత్తయ్యతో మాట్లాడతానని అనుకుని తనతో మాట్లాడితే అర్థం చేసుకుంటుందా? నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? అనుకుంటుంది ముకుంద. వాళ్ళతో వీళ్ళతో కాదు డైరెక్ట్ గా మురారితో చెప్పేయాలని డిసైడ్ అవుతుంది. మధు ముకుంద ఫోటోస్ తీసుకొచ్చి రేవతికి చూపిస్తాడు.
మధు: శోభనం ముహూర్తం పెట్టేటప్పుడు తన మొహం చూడు ఎలా మాడ్చుకుందో, తన ఫీలింగ్స్ మారిపోయాయి. నా అనుమానం నిజం ఆదర్శ్ అంటే ఇష్టం లేదు ముకుంద నాటకం ఆడుతుంది.
రేవతి: ముకుందకు ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పేస్తుంది.
మధు: అది ఇంతక ముందు ఇప్పుడు తను నటిస్తుంది.
కృష్ణ వాళ్ళు షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. వాటిని ఇవ్వడం కోసం ముకుంద దగ్గరకి వెళ్తుంది కృష్ణ. మురారికి విషయం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు. గుండెల్లో దాచుకుంటాడా? లేదంటే అందరికీ చెప్పి అల్లరి చేస్తాడా అని ముకుంద ఆలోచిస్తుంది. కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. నిన్నటి ఎఫెక్ట్ నుంచి నేను పూర్తిగా కొలుకోలేదని శోభనం ఆపేందుకు ట్రై చేస్తుంది ముకుంద. మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఏదైనా ఉంటే తనతో చెప్పమని కృష్ణ, ముకుందకు చెప్తుంది. అప్పుడే ముకుందకి ఫోన్ వస్తుంది. అందులో నా మొగుడు అని పడుతుంది. కృష్ణ మాట్లాడమని చెప్పి వెళ్ళిపోతుంది.
ముకుంద రూంలోంచి బయటకు వచ్చిన కృష్ణ.. ఆదర్శ్ ఫోన్ మాట్లాడటం చూసి ముకుందతోనే మాట్లాడుతున్నాడనుకుంటుంది. కృష్ణ తన గదిలోకి వెళ్లగానే కాఫీ ఏదని మురారి అడుగుతాడు. మర్చిపోయానని కృష్ణ చెప్తుంది. నువ్వు మర్చిపోతావ్ అందుకే ఇందాక ముకుందకు ఫోన్ చేశానని చెప్తాడు. తనకి ఎప్పుడు ఫోన్ చేశారని కృష్ణ అడుగుతే నువ్వు రాక ముందని చెప్తాడు. దీంతో కృష్ణ షాక్ అవుతుంది. ఏసీపీ సర్ నెంబర్‌ను నా మొగుడు అని ఫీడ్ చేసుకుందా? అసలు ఏం ఆలోచిస్తుంది ఈ ముకుంద అని కోపంగా అనుకుంటుంది కృష్ణ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఆహాలో ఆంటోనీ - తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా