Antony OTT Telugu: ఆహాలో ఆంటోనీ - తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా
Kalyani Priyadarshan Joju George movie: 'ఆదికేశవ' విలన్ జోజు జార్జ్, తెలుగు సినిమాలు చేసిన కల్యాణీ ప్రియదర్శన్ నటించిన మలయాళ సినిమా 'ఆంటోనీ'. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
కల్యాణీ ప్రియదర్శన్ మలయాళీ అమ్మాయి. అయితే ఆమె కథానాయికగా పరిచయమైనది మాత్రం తెలుగు సినిమాతోనే. అఖిల్ అక్కినేని 'హలో'తో తొలిసారి ఆమె వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి', శర్వా 'రణరంగం' సినిమాలు చేశారు. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. 'ఆంటోనీ' సినిమాతో గత ఏడాది కేరళలోని థియేటర్లలో సందడి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. మాలీవుడ్ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఆంటోనీ'
Joju George Antony Telugu dubbing streaming on Aha: 'ఆంటోనీ' సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)తో పాటు జోజు జార్జ్ మరో ప్రధాన పాత్ర చేశారు. పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాలో విలన్ రోల్ చేసింది ఈయనే. ఫిబ్రవరి 23న 'ఆంటోని' సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.
Brace yourself, a ruthless Gangster has arrived!👉
— ahavideoin (@ahavideoIN) February 23, 2024
Watch '#Antony' on aha ▶️https://t.co/Fz5Y4TrOQH pic.twitter.com/u2K7qqt4JD
'ఆంటోనీ' సినిమా కథ ఏమిటి?
Antony Movie Story: ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో 'ఆంటోని' చిత్రాన్ని తెరకెక్కించారు. జోజు జార్జ్ టైటిల్ రోల్ చేశారు. ఆయన ఒక క్రూరమైన గ్యాంగ్ స్టర్. అనుకోకుండా గ్జేవియర్ అనే లోకల్ గుండాను చంపేస్తాడు. ఆ తర్వాత నుంచి గ్జేవియర్ కుమార్తె అన్నా మారియాకు అన్నీ తానై చూసుకుంటాడు. ఆమెకు అతడు గార్డియన్ అని చెప్పవచ్చు. ఎంఎంఏలో ట్రైనింగ్ తీసుకున్న అన్నా మారియా కాలేజీలో ఎగ్రెస్సివ్ స్టూడెంట్. అంతా బావుందని అనుకుంటున్న టైంలో వాళ్లిద్దర్నీ చంపడానికి టార్జాన్ అని ఒకడు రంగంలో దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
'ఆంటోనీ' చిత్రానికి జోషి దర్శకత్వం వహించారు. రాజేష్ వర్మ కథ అందించారు. చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయ రాఘవన్, హరి ప్రశాంత్ ఎం, జీజూ జాన్, బిను పప్పు, సిజోయ్ వర్గీస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ప్రస్తుతం కల్యాణీ ప్రియదర్శన్ చేస్తున్న సినిమాలకు వస్తే... తమిళంలో 'జీనీ' చేస్తున్నారు. మాతృభాష మలయాళంలో వర్షన్గళక్కు శేషం' అని మరో సినిమా కూడా చేస్తున్నారు.
డింపుల్... దుబాయ్లో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్కు తయ్యార్#dimplehayathi #tollywoodactress #Dance #Dubai #zabeelpark #Awardshttps://t.co/Z33fysGCVt
— ABP Desam (@ABPDesam) February 24, 2024