Oppenheimer OTT Release Date: ఆస్కార్స్‌లో 13 నామినేషన్స్, బాఫ్టాలో 7 అవార్డ్స్ - హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Oppenheimer OTT Release Date India: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఓపెన్ హైమర్' అతి త్వరలో ఇండియన్ ఓటీటీలో విడుదల కానుంది. సినిమా ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే?
![Oppenheimer OTT Release Date: ఆస్కార్స్‌లో 13 నామినేషన్స్, బాఫ్టాలో 7 అవార్డ్స్ - హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? Oppenheimer OTT release date is here When and where to watch Christopher Nolan Cillian Murphy movie Oppenheimer OTT Release Date: ఆస్కార్స్‌లో 13 నామినేషన్స్, బాఫ్టాలో 7 అవార్డ్స్ - హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/cce69cd67dbde1f72d0d86622cc307841708496122834313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆస్కార్స్ బరిలో (Oscar nominations 2024) నిలిచిన ఆడియన్స్ ఫేవరేట్ సినిమా 'ఓపెన్ హైమర్' (Oppenheimer Movie). హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తీసిన చిత్రమిది. ఆయనకు మన దేశంలోనూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నోలన్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అందువల్ల, ఇండియాలోనూ 'ఓపెన్ హైమర్'కు మంచి వసూళ్లు వచ్చాయి. నోలన్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ఇండియన్ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. 'ఓపెన్ హైమర్' ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పటి నుంచి అంటే?
థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలల తర్వాత
Oppenheimer ott streaming partner India: మార్చి 21 నుంచి తమ ఓటీటీలో 'ఓపెన్ హైమర్' స్ట్రీమింగ్ స్టార్ట్ కానున్నట్లు జియో సినిమా అధికారికంగా తెలియజేసింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే? జియో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు మాత్రమే సినిమాను చూడగలరు. ఇంగ్లీష్, హిందీ సహా దక్షిణాది భాషల్లోనూ 'ఓపెన్ హైమర్' స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.
Oppenheimer OTT Release on Jio Cinema: 'ఓపెన్ హైమర్' ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బుక్ మై షో ద్వారా ఓటీటీ వీక్షకులకు రెంటల్ విధానంలో (డబ్బులు కట్టి చూడొచ్చు) అందుబాటులోకి వచ్చింది. అయితే... ఇప్పుడు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లందరికీ అందుబాటులోకి తీసుకు వస్తోంది.
ఆస్కార్స్ బరిలో 13 నామినేషన్లు...
రీసెంట్ బాఫ్టాలో 7 అవార్డులతో సత్తా!
రాబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం 'ఓపెన్ హైమర్' అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సహా మొత్తం 13 విభాగాల్లో ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి. ఇటీవల జరిగిన బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ సినిమా సహా దర్శకుడు, నటుడు, సహాయ నటుడు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ సినిమా సత్తా చాటింది.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - ఆయనకు నవ్వించడమే కాదు... కంటతడి పెట్టించడమూ వచ్చు!
'ఓపెన్ హైమర్' కంటే ముందు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'బ్యాట్ మ్యాన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'డంకర్క్' సినిమాలకు భారతీయ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 'ఇంటర్ స్టెల్లార్', 'టెనెట్' అర్థం కాలేదని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. ఈ తరం హాలీవుడ్ దర్శకుల్లో ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. అమెరికన్ శాస్త్రవేత్త, అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా, ఆయన పేరుతో తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్ పాత్రలో సిలియన్ మర్ఫీ నటించారు.
ఓపెన్ హైమర్ కథ ఏమిటంటే... రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అణు బాంబు తయారు చేయమని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ (సిలియన్ మర్ఫీ)ని అమెరికన్ అటామిక్ ఎనర్జీ అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్) సంప్రదిస్తారు. లాస్ అల్మాస్ పేరుతో ఓ నగరాన్ని నిర్మించి, కొంత మంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాలు చేస్తారు. విజయవంతంగా అణుబాంబు తయారు చేస్తారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రభుత్వం ఆ బాంబులు వేస్తుంది. అణుబాంబు తయారీకి ముందు ఓపెన్ హైమర్ జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అణుబాంబు ప్రయోగించిన కొన్నేళ్ళ తర్వాత ఓపెన్ హైమర్ మీద అమెరికా ప్రభుత్వం ఎందుకు ట్రయిల్ చేపట్టింది? అనేది సినిమా కథ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)