Krishna Mukunda Murari September 4th: ముకుంద ప్లాన్ సక్సెస్- ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పమని మురారీని అడిగిన కృష్ణ
మురారీ తనని ప్రేమిస్తున్నాడని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.
ముకుంద కృష్ణతో కలిసి బయటకి వెళ్ళి తన ప్రేమ సంగతి చెప్పాలని రెడీ అవుతుంది. తను కిందకి రావడం చూసి రేవతి పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది.
రేవతి: మనం ఏం శత్రువులు కాదు గొడవ పడటానికి చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. కృష్ణకి మీ ప్రేమకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు, మురారీ విడిపోవడానికి కృష్ణ ఏమైనా కారణమా?
ముకుంద: ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు కారణం
రేవతి: ఇప్పుడు కాదు ఒకప్పటి సంగతి తీసుకో. మీ ప్రేమకి కృష్ణకి ఎలాంటి సంబంధం లేదు. తను మీ ఇద్దరినీ విడదీయలేదు మీ మధ్యలోకి కూడ రాలేదు క్లియర్ కదా
ముకుంద: ఇప్పుడు మా మధ్యలోకి కృష్ణ వచ్చింది. మేం విడిపోవడానికి కృష్ణ కారణం. మా ప్రేమకి తనే అడ్డుగోడలాగా తయారైంది
Also Read: ఇగో మాస్టర్ దగ్గర అడ్డంగా బుక్కైన వసు- రిషి మనసులో ఉన్నది ఎవరో ఏంజెల్ కి తెలిసిపోతుందా?
రేవతి: తను మీ మధ్యలోకి రాలేదు. ఇందులో కృష్ణ తప్పేమీ లేదు ఇప్పుడు అవన్నీ తవ్వి తన జీవితాన్ని నాశనం చేయకు. ప్లీజ్ కృష్ణకి మీ ప్రేమ విషయం తెలియదు. నువ్వు కూడా చెప్పకు ఇది న రిక్వెస్ట్
ముకుంద: మీరు బాగా మాట్లాడుతున్నారు వార్నింగ్ కూడా రిక్వెస్ట్ గా చెప్తున్నారు. నేను ప్రేమించిన వాడిని కృష్ణ పెళ్లి చేసుకోవడం తప్పు కదా
రేవతి: నాకు కావలసింది ఒక్కటే మీ ప్రేమ విషయం దానికి చెప్పి దాని జీవితం నాశనం చేయకు
ముకుంద: మీరు ఎన్ని చెప్పినా వినను. నా ప్రేమకి అడ్డు పడితే ఎవరినీ వదిలి పెట్టను. వాళ్ళ అగ్రిమెంట్ అయిపోతే మీరు ఎందుకు తనని తిరిగి తీసుకొచ్చారు
రేవతి: మురారీ ఇప్పటికీ కృష్ణని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు
ముకుంద: లేదు నా ప్రేమని నేను గెలిపించుకుంటాను. కృష్ణకి మా ప్రేమ విషయం నేనే చెప్తాను
మధుకర్ మళ్ళీ రీల్స్ అంటూ కృష్ణని అడుగుతాడు. అయితే షాపింగ్ కి రా అక్కడే రీల్స్ బ్లాగ్స్ చేసుకోవచ్చని మురారీ మధుకర్ ని పిలుస్తాడు. దీంతో సరేనని మధుకర్ సరే అంటాడు. ముకుంద వచ్చి అలేఖ్యని పక్కకి పిలిచి మధుకర్ షాపింగ్ కి రాకుండా ఆపమని అడుగుతుంది. వాళ్ళని చూసి డౌట్ వచ్చిన మురారీ మధుకర్ ని పక్కని తీసుకెళ్ళి ఏదో మాట్లాడతాడు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని కృష్ణ అనుకుంటుంది. మధుని తమతో పాటు రమ్మని అడుగుతాడు. నువ్వు ఉంటే ముకుంద కృష్ణకి ఏమి చెప్పలేదని అంటాడు. కానీ అలేఖ్య మనకి సపోర్ట్ చేయదని చెప్తాడు. ముకుంద, మురారీ మధ్యలో మధుకర్ దంపతులు నలిగిపోతారు. అసలు ఏం జరుగుతుందని కృష్ణ అయోమయంగా అడుగుతుంది. మధుకర్ ని ఆపాలని అలేఖ్య ట్రై చేస్తుంది.
Also Read: సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి విషమం- కావ్యని భార్యగా అంగీకరించిన రాజ్
మధుకర్ వచ్చి కృష్ణతో రీల్స్ చేయాలని అంటాడు. రీల్స్ చేస్తుంటే భవానీ మధుకర్ ని పిలుస్తుంది. దొరికిందే సందు అని అలేఖ్య ముగ్గురిని వెళ్లిపొమ్మని పంపించేస్తుంది.
తరువాయి భాగంలో..
ముకుంద, కృష్ణ, మురారీ రెస్టారెంట్ లో ఉంటారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని ముకుంద అంటే సరేనని అంటారు. మురారీ వైపు బాటిల్ రాగానే ముకుంద తను ప్రశ్న వేస్తానని అంటుంది. కానీ కృష్ణ మాత్రం కాదు తనే అడుగుతానని చెప్తుంది. పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి పేరు ఏంటో చెప్పమని అనేసరికి ముకుంద తెగ సంతోషపడుతుంది.