Guppedanta Manasu September 4th: ఇగో మాస్టర్ దగ్గర అడ్డంగా బుక్కైన వసు- రిషి మనసులో ఉన్నది ఎవరో ఏంజెల్ కి తెలిసిపోతుందా?
Guppedantha Manasu September 4th : గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ నడుస్తోంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.
వసు దగ్గరకి ఏంజెల్ వస్తుంది. రిషి మనసులో ఏముందో తెలిసిందా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా అని అడుగుతుంది.
వసు: లేదు ఏంజెల్ రిషి సర్ కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండటమే ఇష్టమని సర్ అంటున్నారు
ఏంజెల్: అంటున్నాడు కానీ అందుకు గట్టి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది కదా
వసు: నువ్వు రిషి సర్ కి ప్రపోజ్ చేశావ్ కదా
ఏంజెల్: ప్రపోజల్ కాదు డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామని అడిగాను. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నా
వసు: నువ్వు రిషిని ప్రేమిస్తున్నావా
ఏంజెల్: ప్రేమ ఏం లేదు తను నా బెస్ట్ ఫ్రెండ్. కానీ పెళ్లికి ప్రేమ అక్కర్లేదు కదా
వసు: రిషి నిన్ను పెళ్లి చేసుకోకపోతే డిసప్పాయింట్ అవుతావా
Also Read: సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి విషమం- కావ్యని భార్యగా అంగీకరించిన రాజ్
ఏంజెల్: ఎందుకు అవను. బెస్ట్ ఫ్రెండ్ తో లైఫ్ కంఫర్ట్ ఉంటుందని అనుకుంటున్నా
వసు: రిషి నీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది
ఏంజెల్: మరి ఎవరికి కరెక్ట్ అనిపిస్తుంది నీకా? రిషి నాకు సరిపోతాడు
ఇవన్నీ కాదు రిషి గురించి ప్లస్ మైనస్ రాద్దామని చెప్తుంది. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా కదా అవి తనే రాస్తానని చెప్తుంది. రిషిలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువగా రాసి ఇస్తుంది. వీటిని చూసి నిర్ణయం తీసుకోమని చెప్తుంది. దీంతో ఏంజెల్ తన వైపు అనుమానంగా చూస్తుంది. ఇక ఇంట్లో రిషి వసు కళ్ళు డ్రాయింగ్ చూసుకుంటూ ఉంటాడు.
రిషి: ఈ కళ్ళు నాకు ఎన్ని బంధాలు వేశాయి. ఎన్ని వాగ్దానాలు చేశాయి. ప్రతి క్షణం నా వెంటే ఉంటానని చెప్పాయి. మన మధ్య బంధం ముడి పడింది. మనం రిషిధారలు అయ్యాము. కానీ ఈ కళ్ళు నా ప్రేమని చిదిమేసి నన్ను ఒంటరిని చేశాయని అనుకుంటాడు. అప్పుడే ఏంజెల్ వస్తుంది. వెంటనే డ్రాయింగ్ తీసి పిల్లో కింద దాచి పెట్టేస్తాడు. రిషిని ఎక్కడికి వెళ్లొద్దని ఇంట్లోనే ఉండమని చెప్తుంది. ఇంటికి గెస్ట్ ని పిలిచానని అంటుంది. కానీ రిషి మాత్రం తనకి పని ఉందని బయటకి వెళ్తానని అంటాడు. కావాలని తనని అవాయిడ్ చేస్తున్నావని ఏంజెల్ బాధపడుతుంది. దీంతో రిషి తప్పని పరిస్థితిలో ఉంటానని చెప్తాడు. పిల్లో కింద ఏం దాచాడా అని ఏంజెల్ ఆలోచిస్తుంది.
ఏంజెల్ ఇంటికి వసు వస్తుంది. తనని చూసి రిషి షాక్ అవుతాడు. ఇప్పుడు తను ఎందుకు వచ్చిందని అనుకుంటున్నావా? నేను చెప్పిన గెస్ట్ ఎవరో కాదు వసుధారనే అంటుంది. రిషి వెళ్లబోతుంటే ఏంజెల్ ఆపుతుంది.
ఏంజెల్: తనని గెస్ట్ అని ఎందుకు అన్నాను అంటే అవుట్ సైడ్ పర్సన్ లాగా నిన్ను ఎనలైజ్ చేసింది. నీ ప్లస్ లు మైనస్ లు రాసింది చూడు అని చీటీ ఇస్తాడు. పైకి చదవమని చెప్తుంది
రిషి: పాజిటివ్స్.. జెంటిల్మెన్, ప్రిన్స్, డ్రీమ్ బాయ్.. నెగిటివ్- సీరియస్ సింహం, మూడీ, మూడ్ స్వింగ్స్, కొన్ని సార్లు తన మాటే కరెక్ట్ అంటారు. తనకి తానుగా నిజాలు తెలుసుకుంటేనే నమ్ముతారు
ఏంజెల్: కోపం వచ్చిందా రిషి
కాఫీ తీసుకురమ్మని పంపించి వసు మీద అరిచేస్తాడు. మీ మనసులో ఉన్నది ఇదా? పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువగా రాశారు
వసు: అవును నెగిటివ్స్ ఎక్కువగా రాశాను అయితే ఏంటి ఇప్పుడు. ఏంజెల్ దగ్గర బ్యాడ్ చేయాలని అనుకుంటున్న. మీరే చెప్పారు కదా తన దగ్గర మీరు బ్యాడ్ చేయాలని చెప్పారు. మీకోసం మనసు చంపుకుని నెగటివ్స్ రాశాను
లేనికోపం ప్రదర్శిస్తూ వెళ్లిపోతానని బెదిరిస్తుంది. మన ఇగో మాస్టర్ పో అనేస్తాడు. అతి కష్టంగా వెళ్తూ ఏంజెల్ కి చెప్పేసి వెళ్తానని అంటుంది. పర్లేదు నేను చెప్తానులే అని పంపిస్తుంటే ఏంజెల్ వచ్చి ఏంటి వెళ్లిపోతున్నావని అడుగుతుంది. రిషిని కాఫీ తీసుకోమని అంటే వద్దని వెళ్ళిపోతాడు. వసు కూడా జారుకుంటుంది. ఏంజెల్ రిషి గదికి వెళ్ళి దిండు కింద ఏం దాచాడా అని చూస్తుంది. కళ్ళు డ్రాయింగ్ చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఫోటో తీసుకుని ఎవరివా అని ఆలోచిస్తుంది. గది నుంచి బయటకి రాగానే రిషి ఎదురుపడతాడు.
Also Read: వసుకి మనసులో మాట చెప్పిన రిషి, చిరాకు తెప్పిస్తోన్న శైలేంద్ర బిహేవియర్!
నువ్వు నా ఫ్రెండ్.. ఫ్రెండ్ మాత్రమేనని చెప్తాడు. ఇలాంటివి చేసి ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. తనని ఎందుకు వద్దని అంటున్నావని ఏంజెల్ అడుగుతుంది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బంధుత్వవానికి చోటు లేదని చెప్తాడు. మనసులో ఎవరైనా ఉంటే చెప్పమని ఏంజెల్ బలవంతం పెడుతుంది. కానీ రిషి మాత్రం తన దగ్గర సమాధానాలు లేవని అంటాడు. తన విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవద్దని ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని అనుకున్నది జరగదు. ఎప్పటికీ ఈ రిషి ఒంటరి అనేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఒంటరి కాదని ఈ కళ్ళు చెప్తున్నాయని ఏంజెల్ మనసులో అనుకుంటుంది.