Krishna Mukunda Murari October 31st : కృష్ణతో ఛాలెంజ్ చేసిన ముకుంద - కృష్ణ కోసం ఔట్ హౌస్‌కు వచ్చిన మురారి
కృష్ణకు ఔట్ హౌస్ చూపించడానికి వచ్చిన ముకుంద.. కృష్ణతో ఛాలెంజ్ చేస్తుంది.భవాని అత్తయ్య నాకు అండగా ఉంది. మురారి కి నువ్వెవరో గుర్తులేదని చెప్తుంది.
కృష్ణకు ఔట్ హౌస్ చూపించడానికి వచ్చిన ముకుంద.. కృష్ణతో ఛాలెంజ్ చేస్తుంది. భవాని అత్తయ్య నాకు అండగా ఉంది. మురారికి నువ్వెవరో గుర్తులేదు. నేను మురారిని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా భవాని అత్తయ్యతో ఎప్పుడో చెప్పేశాను అంటుంది.
ముకుంద : ఆదర్శ్ రాకూడదని ఆ కమాండర్ డ్రామాలో చెప్పేశా.. అయినా సరే నిన్ను బయటికి నన్ను లోపలికి ఎందుకు పంపించింది. ఇప్పుడు చెప్పు నేనేందుకు భయపడాలి.
కృష్ణ : నేను ఔట్ హౌస్‌లో ఉన్నందుకు బయపడాలి.
ముకుంద : అసలు నువ్వు లోపలికి రావాలిగా..
కృష్ణ : నువ్వెంత ముకుంద.. నేను లోపలికి రావడం కాదు మురారినే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను.
ముకుంద : మా భవాని అత్తయ్యకు చెప్పి నిన్ను ఈ ఔట్ హౌస్‌లో కూడా లేకుండా చేస్తాను.
కృష్ణ కి ఇంత అవమానం జరిగినా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది. మురారి తన పక్కన లేకపోయినా కూడా ఇంత కాన్ఫిడెన్స్ గాఎలా ఉంటుంది అని ముకుందా మనసులో అనుకుంటుంది. కృష్ణ తనకు రూం చూపించమని అడుగుతుంది.
బెడ్ రూంలో ఏదో ఆలోచికస్తూ కూర్చున్న మురారికి కృష్ణ గుర్తుకు వస్తుంది. తర్వాత హాల్లోకి వచ్చి భవాని ని ముకుందా ఎక్కడుందని అడుగుతాడు. దీంతో మధు ఆలోచనలో పడిపోతాడు. మురారి.. కృష్ణ గురించి అడుగుతాడనుకుంటే ముకుంద గురించి అడుగుతున్నాడేంటి అనుకుంటాడు. ఇంతలో రేవతి అక్కడికి వచ్చి మురారిని ఇప్పుడెలా ఉందని అడుగుతుంది. బాగుందని చెప్తాడు మురారి.
రేవతి : నీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేశాను.
మురారి : ఆ కూర అంటే నాకు ఇష్టమా..? ఇంకా ఏవేవి ఇష్టం..?
భవాని : రేవతి ఇప్పుడవన్నీ ఎందుకు ఇప్పుడేవి ఇష్టపడతాడో మనందరం కూడా అవే కంటిన్యూ చేద్దాం. ఏమంటావ్ నాన్నా..
మురారి : నీ ఇష్టం పెద్దమ్మ
ముకుంద టీ తీసుకుని వచ్చి మురారికి తన రూం చూపిస్తుంది. మురారి మధు కలిసి రూంలోకి వెళ్తారు. ముకుందపై రేవతి సీరియస్ అవుతుంది. నీ రూం ఎందుకు చూపించావు అని గట్టిగా అడుతుగుతుంది. భవాని ముకుందను సమర్థిస్తుంది. మురారిని మామూలు మనిషిని చేసే బాధ్యతను ముకుందకు అప్పగిస్తుంది భవాని.
ఔట్ హౌస్‌లో ఉన్న కృష్ణ తను ఏం చేయాలో అలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మధు అక్కడికి వస్తాడు.
కృష్ణ : ఇంతకీ ఏం తెచ్చావ్..
మధు : రిచ్‌గా వెజ్ బిర్యాని తెచ్చాను.
కృష్ణ : డబ్బులు నేను ఇచ్చేదాన్ని గా రిచ్‌గా చికెన్ బిర్యాని తెచ్చి ఉండొచ్చు కదా
అనగానే మధు నవ్వుతూ భోజనం పార్శిల్ అక్కడ పెట్టి మళ్లీ వస్తానని వెళ్తాడు. కృష్ణ ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంటే ముకుంద అక్కడికి వస్తుంది.
ముకుంద : బాగుంది కృష్ణ బాగుంది. నువ్విలాగే పనులు చేసుకుంటూ ఇక్కడే నీ శేష జీవితం గడిపేయాలి.
కృష్ణ : ఎట్టి పరిస్థితుల్లోనూ అ ఇంటికి తిరిగి వస్తాను ఈ కృష్ణను తక్కువ అంచనా వేయకు.
ముకుంద : ఊహల్లో కాదు వాస్తవంలో బతుకు. ఇప్పటికైనా అర్థం చేసుకుని హాయిగా నీ బతుకు నీవు బతుకు కృష్ణ లేకపోతే ఇలాగే ఉంటుంది.
కృష్ణ : చూస్తూ ఉండు..?
ముకుంద : చూస్తానే ఉంటా .. ఈ పనులు నువ్వు చేస్తుంటే నేను చూస్తానే ఉంటాలే..
అంటుండగానే అక్కడికి మురారి వస్తాడు. డాక్టర్ ఎక్కడని అడుగుతాడు. బూజు దులుపుతున్న కృష్ణ మురారిని చూసి కిండపడబోతుంటే మురారి కృష్ణ ను పట్టుకుని కాపాడతాడు.
మురారి : స్టెతస్కోప్ పట్టుకున్న చేతితో చీపురు పట్టుకుంటే ఇలాగే ఉంటుంది. డాక్టర్ గా మీరు నన్ను సేవ్ చేస్తారనుకుంటే నేనే మిమ్మల్ని సేవ్ చేయాల్సి వచ్చింది.
అని తాను కూడా క్లీన్ చేయడానికి హెల్ఫ్ చేస్తానని మురారి కృష్ణను అడుగుతాడు. అయితే మీరు చేయోద్దని అంతగా కావాలంటే ముకుంద చేత క్లీన్ చేయించండి అని చెప్తుంది కృష్ణ. ముకుంద, మురారి ఇంటిని క్లీన్ చేస్తుంటే ఇవాళ్టి ఏపిసోడ్ అయిపోతుంది.