అన్వేషించండి

Brahmamudi August 29th: 'బ్రహ్మముడి' సీరియల్: స్వప్న ప్రెగ్నెన్సీ నాటకం బయటపడనుందా? వర్కౌట్ అయిన కావ్య ప్లాన్?

ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడటానికి కావ్య ప్రయత్నించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Brahmamudi August 29th: ఫేక్ ప్రెగ్నెన్సీ కోసం.. స్వప్న అర్థరాత్రి పెద్ద పళ్లెంలో బిర్యాని పెట్టుకొని తింటుండటంతో అది చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి ఇది అని ఒక్కదానివే ఇంత తినేస్తున్నావు ఏంటి అని అడగటంతో.. ఆకలి వేస్తుంది అని స్వప్న అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి కడుపుతో ఉంటే ఆకలి వేస్తుంది కానీ ఇంతలా తింటే బిడ్డకు ప్లేస్ ఉండొద్దా.. అయిన రోజు డైట్ అంటూ కడుపు మార్చుకుంటే ఇలాగే ఉంటుందని అంటుంది.

ఇక ఆ డైట్ అన్ని పక్కకు పెడితే మీ చెల్లి కావ్య కి చెబితే తను రుచిగా చేస్తుంది కదా అనటంతో ఇక్కడ కూడా తన గురించేనా అని చిరాకు పడుతుంది స్వప్న. ఇక మరోవైపు కృష్ణమూర్తి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి కనకం వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడుగుతుంది. దాంతో తనకు నిద్ర పట్టటం లేదని కావ్య గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇక రేపు వస్తుంది కదా అని కనకం అనడంతో.. అంత పెద్ద గొడవ జరిగాక మళ్ళీ తను అత్తింటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు పంపిస్తున్నారు అని ఆలోచిస్తున్నాను అని అంటాడు.

ఇక కనకం కూడా తనకు కూడా అదే అనుమానం ఉందని.. అక్కడ ఏమైనా జరిగిందేమో అని ఒకసారి కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడతాను అని కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. దాంతో కళ్యాణ్ కావ్యకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పటంతో వాళ్లు కాస్త కుదుటపడతారు. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ స్నానం చేస్తూ ఉండగా కావ్య రాజ్ లేడని గమనించి తీసుకెళ్ళు వెంటనే డిజైన్స్ కోసం గది మొత్తం వెతుకుతూ ఉంటుంది.

ఇక డిజైన్స్ చూస్తున్న సమయంలో అప్పుడే రాజ్ స్నానం చేసి బయటికి బయటకి వచ్చి తన చేతిలో ఉన్న డిజైన్స్ తీసుకొని లోపల పెట్టేస్తాడు. వెంటనే కావ్య ఎందుకలా దాచేస్తున్నారు.. మీ అమూల్యమైన డిజైన్స్ ని చూసే భాగ్యం నాకు కల్పించండని అడుగుతుంది. ఇక ఏవేవో మాట్లాడుతూ ఉండటంతో తనను బయటకు నెట్టేసి తలుపు వేసుకుంటాడు. అయినా కావ్య ఏం ఫీల్ అవ్వదు. ఆ తర్వాత బిర్యానీ బాగా తిన్నందుకు స్వప్నకు వాంతులు వస్తాయి.

ఇందిరా దేవి వచ్చి తనకు వాంతులు అవుతున్నట్లు గమనించి హాస్పిటల్ కి వెళ్లాల్సిందే అని అంటుంది. ఇక హాస్పిటల్ కి వెళ్తే తన ప్రెగ్నెన్సీ నాటకం బయట పడుతుందని కంగారుపడుతుంది స్వప్న. అప్పుడే అక్కడికి రాహుల్, రుద్రాణి రాగ.. ఈ సమయంలో వాంతులు కావడం నార్మల్ ఏ కదా అని రుద్రాణి అంటుంది. వెంటనే ఇందిరా దేవి నాకు కూడా తెలుసు కానీ ఇన్నిసార్లు అవుతున్నాయంటే కడుపులో బిడ్డకు మంచిది కాదు నువ్వే దగ్గరుండి హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని అనటంతో రుద్రాణి సరే అంటుంది.

ఇక వెళ్లి రెడీ అవ్వమని రాహుల్ అనటంతో కంగారుపడుతూ లోపలికి వెళ్తుంది స్వప్న. ఆ తర్వాత రాహుల్ తన తల్లితో.. ఎలాగో హాస్పిటల్ కి వెళ్తున్నాం కదా అనటంతో అక్కడే స్వప్నకి అబార్షన్ చేయిద్దమంటావా అని రుద్రాణి అంటుంది. సూపర్ అమ్మ నా మనసులో మాట ఎలా చెప్పేసావ్ అనటంతో.. నేను నీ తల్లిని రా నీ చెత్త ఐడియాలు నాకు తెలియవా అంటూ.. ఇక అలా చేస్తే ఇంట్లో వాళ్ళు నమ్మినా కూడా కావ్య మాత్రం అబార్షన్ కి కారణం మనమే అని కనిపెట్టేస్తుంది అని అంటుంది.

మరోవైపు గదిలో కావ్య రాజ్ బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉండటంతో.. రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నిన్ను ఎవరు ఐరన్ చేయమన్నారు అంటూ కసురుకుంటాడు. అలా ఇద్దరి మధ్య కాసేపు మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాంతో రాజ్ మాటల్లో.. ఏయ్ నాతో నీకు పోటీ ఏంటి.. నేను నీ భర్తను అనటంతో కావ్య సంతోషపడుతుంది. శ్రావణమాసం శుక్రవారం మీరు నా భర్త అని ఒప్పుకున్నారు.. ఈరోజు ఎంత మంచి రోజు అని సంతోషపడుతుంది.

దాంతో రాజ్ నోరు జారాను అంత ఎక్కువగా ఊహించుకోకు అంటాడు. ఇక కావ్య మాత్రం సంతోషంగా బయటికి వెళ్లి ఇంట్లో వాళ్లందర్నీ మాట్లాడేలా చేస్తాను అని అనటంతో ఇంట్లో వాళ్లంతా నా అంత తింగరోళ్ళు కాదు అని రాజ్ అంటాడు. ఇక కావ్య మొదట ధాన్యలక్ష్మితో మాట్లాడించాలని ఫిక్స్ అవుతుంది. ఇక ధాన్యలక్ష్మి కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తుంటే తన దగ్గరికి వెళ్లి చాకు లాక్కుంటుంది. కానీ దాన్యలక్ష్మీ మళ్ళీ ఆ చాకు తీసుకొని తన పని తను చేసుకుంటూ ఉండగా మీ మనసు బంగారం అంటూ కావ్య తన మనసులో మాటలు బయటపెడుతుంది.

అంతేకాకుండా కాస్త ఎమోషనల్ గా కూడా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు నాకు సహాయం చేస్తే ఇంట్లో అందరూ నాతో మాట్లాడేలా చేస్తాను అని.. అనటంతో తను ఏం చేయాలి అన్నట్లుగా సైకిల్ చేస్తుంది ధాన్యలక్ష్మి. మీ వేలు కట్ అయింది అని నాటకం ఆడండి.. వంట నేను చేస్తాను అనడంతో దానికి సరే అంటుంది. ఇక కావ్య వంట చేస్తున్న దానిని చూసి అపర్ణకు బాగా కోపం వస్తుంది.

వెంటనే ధాన్య లక్ష్మీ దగ్గరికి వచ్చి.. నిన్నే వంట చేయమన్నాను కదా పరాయి వాళ్ళతో ఎందుకు చేస్తున్నావు అంటూ అరుస్తుంది. దాంతో తన వేలు కట్ అయిందని చెబుతుంది. వెంటనే అపర్ణ.. కుడి చేతితో కట్ చేస్తే ఎడమ చేయి వేలు ఎలా తెగింది అని అనుమానంతో అడగటంతో ధాన్యలక్ష్మి కవర్ చేస్తుంది. ఇక అపర్ణ చిరాకు పడి అక్కడ నుంచి వెళ్లగా వెంటనే ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్లి నవ్వుకుంటుంది.

 

also read it : Intinti Gruhalakshmi August 28th: రాజ్యలక్ష్మికి చుక్కలు చూపిస్తున్న దివ్య.. భార్య ప్రేమకు ఫిదా అయిన విక్రమ్?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Kerala Lottery : కేరళ లాటరీ టిక్కెట్లను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా? ఆన్ లైన్‌లో కొంటె చెల్లుతాయా ?
కేరళ లాటరీ టిక్కెట్లను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా? ఆన్ లైన్‌లో కొంటె చెల్లుతాయా ?
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Special Buses for Sankranthi : సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్‌ -7,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ప్రకటన
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్‌ -7,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ప్రకటన
Embed widget