Intinti Gruhalakshmi August 28th: రాజ్యలక్ష్మికి చుక్కలు చూపిస్తున్న దివ్య.. భార్య ప్రేమకు ఫిదా అయిన విక్రమ్?
దివ్య తన అత్తకు చుక్కలు చూపించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Intinti Gruhalakshmi August 28th: ఈ రోజు ఎపిసోడ్ లో నందు తులసి గుడిలో ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు నందు తులసితో మాట్లాడడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడు. మరొకవైపు విక్రమ్ వాళ్ళ నాన్న ఎంచక్కా కుర్చీలో కూర్చుని గేమ్స్ ఆడుతూ ఉండగా ఇంతలో బసవయ్య అక్కడికి వచ్చి గేమ్స్ ఆడుతున్నారా బావగారు మొన్నటి వరకు చేతులు ఆడలేదు, ఇప్పుడు అదే చేతులతో మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నావా అని అనగా వెంటనే అతను మొన్నటి వరకు అందరూ నాతో ఆడుకున్నారు.
ఇప్పుడైనా నన్ను ఆడుకోనివ్వండి అంటూ పక్కనే ఉన్న రాజ్యలక్ష్మిని చూసి అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి తన భర్త మాట్లాడిన మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి పై అతను సెటైర్లు వేస్తాడు. ఇంతలోనే అక్కడికి విక్రమ్ దివ్య అక్కడికి వస్తారు. విక్రమ్ నీ సూటు బూట్ లో చూసి రాజ్యలక్ష్మి, సంజయ్ బసవయ్య అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు విక్రమ్ వెళ్లి రాజ్యలక్ష్మి ఆశీర్వాదం తీసుకోగా ఎక్కడికి నాన్న పార్టీకి వెళ్తున్నావా అనగా లేదమ్మా హాస్పిటల్ కి అనడంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది.
హాస్పిటల్ కి నువ్వెందుకు నాన్న నువ్వు ఇంట్లో కూర్చో నేను చూసుకుంటాను కదా అనగా రాను రాను నీ ఓపిక తగ్గిపోతుంది కదా అమ్మ అందుకే నేను వెళ్లి చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి నా కాలు బాగానే ఉంది అని అటు ఇటు తిరగగా మళ్లీ ఒకసారిగా కాలు పట్టేయడంతో లోపల నొప్పితో బాధపడుతూనే బయటకు మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది.. అప్పుడు దివ్య వాళ్ళ మామయ్య ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మి మీద సెటైర్స్ వేయడంతో రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సంజయ్ పూజని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడంతో వెంటనే విక్రమ్ సీరియస్ అవుతాడు.
అప్పుడు సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని విక్రమ్ దివ్య ఇద్దరు బయలుదేరుతుండగా విక్రమ్ కింద పడిపోతుండగా దివ్య పట్టుకుంటుంది.. అప్పుడు ఇద్దరు ఒకరి వైపు ఒకరు అలా చూసుకుంటుండగా రాజ్యలక్ష్మి సంజయ్ వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు దివ్య విక్రమ్ తో ప్రేమగా మాట్లాడడంతో విక్రమ్ సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కారు దగ్గర వరకు ప్రేమగా నడుచుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు విక్రమ్ వాళ్ళ మామయ్యని పిలిచి కార్ డోర్ తీయమని చెబుతాడు. దాంతో బసవయ్య షాక్ అవ్వడంతో విక్రమ్ రెండు బిస్కెట్లు వేయగా సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు బసవయ్య.
అప్పుడు విక్రమ్ బసవయ్య ఆట పెట్టించి కార్ డోర్ తెరిచేలా చేసి విక్రమ్ దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే రాజ్యలక్ష్మి కుంటుకుంటూ అక్కడికి హాస్పిటల్ కి వెళ్లడానికి వస్తుంది. మరొకవైపు లక్కీ మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా ఇంతలో లాస్య ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లాస్య లక్కీ మీద లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ ఉంటుంది. ఇంతలోనే తులసి నందు గుడి నుంచి ఇంటికి వచ్చి లక్కీని చూసి లాస్యవాడిని కావాలనే వేధిస్తోంది అనుకుంటూ లక్కీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నందు లక్కీ దగ్గరికి వెళ్తాడు. మీ అమ్మ కాల్ చేసింది కదా ఏమంటుంది అనడంతో మమ్మీ ఎప్పుడు చేసినా కాల్ చేసి నన్ను విసిగిస్తూనే ఉంది డాడీ అని అంటాడు లక్కీ. అప్పుడు నందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అనడంతో ఇది మా డాడీ లో అయితే నా ఇల్లు అవుతుంది అంటూ లక్కీ తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లక్కీ కామెడీ చేస్తూ నందుకి పిచ్చి పట్టేలా మాట్లాడుతూ ఉంటాడు.
also read it : Trinayani August 25th - 'త్రినయని' సీరియల్: డెలివరీ ముందు గరుడ పూజ చేస్తున్న సుమన, చెల్లి కోరిన చిన్న కోరికను తీర్చలేకపోయిన నయని?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial