Karthika Deepam మే 13 ఎపిసోడ్: నిరుపమ్ నిశ్చితార్థంలో షాకింగ్ ట్విస్ట్- జ్వాల ప్రేమ సంగతి తెలుసుకున్న హిమ
నిరుపమ్‌ను జ్వాల ప్రేమిస్తుందని తెలుసుకున్న హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటుంది. మిగతా ఫ్యామిలీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు.
తన ఆటో ఎక్కడానికి వచ్చిన ప్యాసింజర్‌తో నిరుపమ్ గురించి చెబుతుంది జ్వాల. మళ్లీ నిరుపమ్ ఫొటో చూసి మాటలతో మురిసిపోతుంది. వేరే ప్యాసింజర్ తో కలిసి గుడికి వెళ్తుంటుంది.
జ్వాల వెళ్లిన గుడిలోనే నిరుపమ్, హిమ నిశ్చితార్థం జరుగుతుంటుంది. నిశ్చితార్థానికి ఒక్క ప్రేమ్ తప్ప అంతా వచ్చి ఉంటారు. ప్రేమ్ రాలేదేంటని స్వప్నను అడుగుతాడు సత్యం. వచ్చి ఏం చేస్తాడులే అంటుంది స్వప్న. మీకు ఇప్పుడేమీ అర్థం కాదని సత్యంతో చెబుతుంది. ఈ నిశ్చితార్థం జరగదని స్వప్న అనుకుంటుంది.
హిమ ఏదో టెన్షన్‌లో ఉంటుంది. నిరుపమ్ అడిగితే ఏం లేదని సమాధానం చెబుతుంది. నిశ్చితార్థం జరగదుగాక జరగదు అనుకుంటుంది స్వప్న. హిమ టెన్షన్ చూసి ఏం జరిగిందని సౌందర్య అడుగుతుంది. నీ కోరిక మేరకే అన్నీ జరుగుతాయని సర్ధి చెబుతుంది సౌందర్య. హిమ ఓకే అని తల ఊపుతుంది.
ఇంతలో నిరుపమ్ ఫోన్ కలవడం లేదని జ్వాల అనుకుంటుంది. తనపై ఎంత ప్రేమ ఉందో అనుకుంటుంది. అందుకే ఫోన్, ఆటో కొని ఇచ్చారని మురిసిపోతుంది. అనుకుంటూ ఫోన్ చేస్తుంది. స్విచ్చాఫ్ అని వస్తుంది. హిమ ఇంటికి వెళ్దామనుకుంటుంది.
ఇక్కడ ప్రేమ్ తన ఫెయిల్యూర్ లవ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఆమె కోసం తీసుకొచ్చిన ఉంగరాన్ని పారేస్తాడు. తన తండ్రి చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లడం అవసరమా అని అనుకుంటాడు. వెళ్లకపోతే బాగోదని అనుకొని వెళ్లడానికి బయల్దేరుతాడు.
ఇంతలో సత్యం ఇంటికి వస్తుంది జ్వాల. ఇంటికి తాళం వేసి ఉన్న సంగతి గుర్తించి... మ్యారేజ్ డేకు వెళ్లలేదనే ఫీల్ అయి ఉంటారని అనుకుని అక్కడి నుంచి బయల్దేరుతుంది.
నిశ్చితార్థానికి ప్రేమ్ వస్తాడు. ఫొటోలు తీస్తుంటాడు. బాధపడుతూనే... బయటపడకుండా జాగ్రత్తపడుతుంటాడు.
స్వప్న కూల్‌గా కూర్చుంది అంటే ఏదో చేయబోతుందని గ్రహిస్తుంది సౌందర్య. కాసేపు ఆగు నీకే తెలుస్తుందని మనసులో అనుకుంటుంది స్వప్న.
ఉంగరాలు మార్చుకునే సరికి ఉంగరాలు కనిపించకుండా పోతాయి. అందరిలో మళ్లీ టెన్షన్. ఆ ఉంగరాలను స్వప్న తీసేస్తుంది. ముహూర్తం దాటిపోతే నిశ్చితార్థం ఆగినట్టేనంటాడు పంతులు. ఇంతలో సౌందర్య మరో రెండు ఉంగరాలను తన బ్యాగ్ నుంచి తీస్తుంది. ఈ శుభకార్యాన్ని ఎవరూ ఆపలేరు అంటుంది.
స్వప్న మళ్లీ వేరే ప్యాసింజర్‌ను తీసుకొని నిశ్చితార్థం జరిగే గుడి వద్దకు వస్తుంది. అక్కడ కూడా నిరుపమ్ గురించే ఆలోచిస్తుంది. దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తుంది. ఇద్దరికీ పెళ్లి కావాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది.
జ్వాల గుడికి వచ్చిన సంగతిని హిమ గుర్తిస్తుంది. సౌందర్య, ప్రేమ్ ఏం చెబుతున్నా హిమకు ఎక్కడం లేదు. ఇంకా ఏదో టెన్షన్ పడుతూనే ఉంది.
రేపటి ఎపిసోడ్
పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తుంది హిమ. సౌందర్యతోపాటు అంతా షాక్ అవుతారు. తల్లిదండ్రుల ఫొటోల వద్దకు వెళ్లి ప్రేమను అడ్డేసి మీ మాట నిలబెట్టబోతున్నాను అంటుంది హిమ. జ్వాల మనసులో మాట ఇవాళ తెలిసిందని అంటుంది.