అన్వేషించండి

Karthika Deepam Today March 26th: అనుకోని రీతిలో కన్నతల్లిని చేరిన దీప - అదిరిపోయిన కార్తీక్, వంటలక్కల తొలి పరిచయం!

Karthika Deepam 2 Serial: జ్యోత్స్న కారణంగా కార్తీక్ కొలనులో పడిపోతే దీప కార్తీక్‌ను కాపాడి తన తల్లి సుమిత్రను మొదటి సారి కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: ధనవంతుల ఇంట్లో సిరి సంపదల మధ్య కార్తీక్‌కు మరదలిగా పెరగాల్సిన దీప తన తాతయ్య శివనారాయణ రెండో భార్య పారిజాతం కుట్రకు బలై నిరుపేద కుభేర దగ్గర పెరుగుతుంది. దీపను కుభేర్ అల్లారు ముద్దగా పెంచుతాడు. దీప వల్ల కుభేర జీవితం మారిపోయిందట. ఇక ఓ టిఫెన్ షాపు దగ్గర కాలనీ వాళ్లు అందరూ చిట్టీలు వేస్తుంటారు. అక్కడ ఉన్నవారు అంతా నా చిట్టీలో నా పేరు వస్తుంది అంటే నా పేరు వస్తుంది అని అంటారు. ఇంతలో కుభేర్ వచ్చి గొడవ పడొద్దని అంటారు. ఇక దీప వస్తే చీటీ తీస్తుంది అని కుభేర్ చెప్తాడు. కుభేర్ అలా చెప్పగానే దీపగా ఓ చిన్న పాప సైకిల్ మీద ఎంట్రీ ఇస్తుంది.ఇక అక్కడ అందరూ దీపని పొగిడేస్తారు.

కుభేర: అవును బాబాయ్ తండ్రి గొప్పవాడు అయితే ఆ కూతురు బతుకు బాగుంటుంది. అదే కూతురు తెలివైనది అయితే ఆ తండ్రి రాతే మారిపోతుంది. నా బతుకులోకి వెలుగు తీసుకొచ్చింది నా కూతురే బాబాయ్.. సరే అమ్మ నువ్వు బడికి వెళ్లు వీళ్లకి నేను టిఫెన్ పెడతాను. నువ్వు బాగా చదువుకొని పెద్ద కలెక్టర్‌వి కావాలి.

మరదలి సంతోషం కోసం బావ సాహసం

మరోవైపు జ్యోత్స్న, కార్తీక్‌లు కలిసే పెరుగుతుంటారు. కార్తీక్, జ్యోత్స్నలు తన తల్లితో పాటు గుడికి వస్తారు. అక్కడ జ్యోత్స్న కొలను దగ్గరకు వెళ్లి తన బావ కార్తీక్‌కు కలువ పువ్వు అడుగుతుంది. ఇక కార్తీక్ కొలనులో మునిగిపోతాడు. జ్యోత్స్న భయంతో తన తల్లిని పిలుచుకు వస్తుంది. అయితే అటుగా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న దీప కార్తీక్‌ కొలనులో మునిగిపోవడం చూసి కార్తీక్‌ను దీప కాపాడుతుంది. 

కార్తీక్ దీపల పరిచయం

ఇక అక్కడే దీప మొదటి సారి తన బావతో పాటు తల్లి సుమిత్రను కూడా దీప కలుస్తుంది. తన మేనల్లుడిని కాపాడినందుకు సుమిత్ర దీప చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. సుమిత్ర తెలీకుండానే ఎమోషనల్ అవుతుంది. ఇక దీప కూడా సుమిత్రను అమ్మ అని పిలుస్తుంది. ఇక దీపకు తల్లి లేదు అని సుమిత్రకు తెలుస్తుంది. ఇక సుమిత్ర దీపకు డబ్బులు ఇవ్వబోతే దీప వద్దుంటుంది. దీపని సుమిత్ర నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఇక కార్తీక్ తనకు సాయం చేసినందుకు దీపకు థ్యాంక్స్‌ చెప్పి భవిష్యత్‌లో తనకు సాయం చేస్తాను అని కార్తీక్ దీపకు చెప్తాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక కొలనులో దిగిన తర్వాత దీపకు తన తల్లి గుర్తుగా తండ్రి కుభేర్ ఇచ్చిన చైన్ కార్తీక్‌ జేబులో ఉంటుంది. 

దీప తల్లి జ్ఞాపకం కార్తీక్ దగ్గర.. 

కుభేర్: దీప నీ మెడలో గొలుసు ఏదమ్మా..
దీప: ఒకబ్బాయి నీళ్లలో పడిపోతే కాపాడాను అప్పుడు పోయింది నాన్న. మొత్తం వెతికాను కానీ దొరకలేదు. చాలా బాధగా ఉంది నాన్న.
కుభేర్: అది మీ అమ్మ గుర్తు అమ్మ ఎక్కడికీ పోదులే మళ్లీ నీ దగ్గరకే వస్తుంది. ఇక దాని గురించి పోయి చదువుకో. 

దీపని కోడల్ని చేసుకుంటానన్న అనసూయ 

ఇక కుభేర్ అక్క అనసూయ వచ్చి దీపని తిట్టి వాడు రాత్రీ పగలు కష్టపడుతుంటే నువ్వు హాయిగా చదువుకుంటావా పోయి పనులు చేయు అని పుస్తకాలు విసిరేస్తుంది. తమ్ముడుని ఆరోగ్యం పాడవుతుందని తిడుతుంది. తన తమ్ముడు బాధ పడటం చూసి దీప మీద చాలా సీరియస్ అవుతుంది అనసూయ. దీపని నీ సొంత కూతురు కాదు అని అంటుంది. ఇక అనసూయ కొడుకు నర్శింహ గాలి తిరుగులు తిరుగుతున్నాడు అని కుభేర్‌ తిడతాడు. ఇక అనసూయ దీపకు నర్శింహకు పెళ్లి జరిగితే వాడే సెట్ అవుతాడు అని అనసూయం అంటుంది. 

వంటలక్కగా మారుతానన్న చిట్టి దీప..

కుభేర్ బయటకు వచ్చే సరికి దీప కనిపించదు. కుభేర్ మొత్తం వెతుకుతాడు. చదువు మానేశాను అని దీప కుభేర్‌కు షాక్ ఇస్తుంది. కుభేర్ చదువుకోమని చెప్తే ఇంటి నుంచి వెళ్లిపోతాను అని దీప షాక్ ఇస్తుంది. దీంతో కుభేర్ ఏమీ అనుకుండా సైలెంట్‌ అయిపోతాడు. దీప తన తండ్రిని తనకు వంటలు నేర్పించమని చెప్తుంది. అయిష్టంగానే కుభేర్ సరే అంటాడు. 

కొన్నేళ్ల తర్వాత దీపక్క గ్రాండ్ ఎంట్రీ..

దీప పెద్దయి సైకిల్ మీద టిఫెన్లు పెట్టుకొని వస్తుంటుంది. ఆమె కోసం రోడ్డు మీద చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇక దీప అందరికీ తన చేతితో టిఫెన్ పెడుతుంది. అందరూ తింటుంటే తన కడుపు నిండినట్లు చాలా సంతోష పడుతుంది. ఇక డబ్బులను మూటలో పెట్టుకొని ఇంటికి బయల్దేరుతుంది. ఇక అక్కడ ఉన్నా వారంతా దీపను తెగ పొగిడేస్తారు. 

సౌర్య ఎంట్రీ..

స్కూల్ బయట ఓ పాప రెండు చేతులు కట్టుకొని నిల్చొంటుంది. పిల్లలు అందరూ బడిలోకి వెళ్తే పాప మాత్రం వెళ్లదు. ఇంతలో ఓ టీచర్ వచ్చి సౌర్య క్లాస్‌కి రా అని పిలిచినా సౌర్య రాను అంటుంది. తన తండ్రి ఈ రోజు వస్తారు అని అమ్మ వస్తే వెళ్తాను అని అంటుంది. ఇక టీచర్‌కి కూడా దీప టిఫెన్ ఇస్తుంది. టీచర్‌ మెచ్చుకుంటుంది. ఇక దీప సౌర్యని తీసుకొని జాతరకు వెళ్దామంటుంది. ఇక దీపకు సౌర్య తన తండ్రి గురించి అడుగుతుంది. ఇక దీప తన గతం గురించి భర్త గురించి బాధపడుతుంది. ఇక దీప తన కూతురు సౌర్యను తీసుకొని జాతరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ మార్చి 26th: రామ్ నన్నే ప్రేమించాడని చెల్లితో లొల్లి పెట్టుకున్న మధు.. మహాలక్ష్మిని రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్న సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
Tamannaah: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Sourav Ganguly: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి
క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి
Embed widget