Seethe Ramudi Katnam Serial Today March 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్ నన్నే ప్రేమించాడని చెల్లితో లొల్లి పెట్టుకున్న మధు.. మహాలక్ష్మిని రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్న సీత!
Seethe Ramudi Katnam Serial Today Episode: మధుమితని ఇంట్లో నుంచి వెళ్లిపోమని సీత చెప్పడంతో మధు రామ్ తననే ఇష్టపడ్డాడు అని చెప్పి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మధు తన తల్లిదండ్రులను మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. లలిత ఏడుస్తుంది. దానికి శివకృష్ణ ఇప్పుడు ఎందుకు ఏడుస్తావ్.. నేను మైల స్నానం చేసినప్పుడే నువ్వు కూడా దాన్ని మర్చిపోతే బాగుండేది అని అంటాడు.
సీత: మనం తొందరపడితే మన చేతుల నుంచి అక్క జీవితం వెళ్లిపోతుంది నాన్న.
శివకృష్ణ: తొందరపడకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. మేం నీ కాపురం ఆలోచించి నీకు ఇబ్బంది కాకూడదు అని ఇక్కడికి వచ్చాం. వచ్చే ముందు మా పై అధికారులతో మాట్లాడి సూర్యని విడిపించడం గురించి మాట్లాడి వచ్చాం. కొంచెం టైం పడుతుందని అని అన్నారు.
లలిత: మధు మారిపోయింది సీత కచ్చితంగా తను నిన్ను ఇబ్బంది పెడుతుంది అనిపిస్తుంది. మహాలక్ష్మి అండ చూసుకొని రెచ్చిపోతుంది. మధు మారాలి అంటే మీ నాన్న పద్ధతే కరెక్ట్ సీత. ఆలస్యం చేస్తే నువ్వు నష్టపోతావు.
సీత: నా గురించి నాకు బాధ లేదు అక్క జీవితం గురించే నా బాధ అంతా. మీ ప్రయత్నం కూడా విఫలం అయింది కాబట్టి ఈ సారి నేను ప్రయత్నిస్తాను. మీరు బయల్దేరండి.
సీత: అక్క నీ ఉద్దేశం ఏంటి. ఇక్కడే పర్మినెంట్‌గా ఉండాలి అనుకుంటున్నావా.. ఇదేం నీ పుట్టిల్లో అత్తారిల్లో కాదు పర్మినెంట్‌గా ఇక్కడే ఉండిపోవడానికి. అమ్మానాన్నలు రెండు సార్లు వచ్చారు. వాళ్లతో వెళ్లడానికి నీకు ఏంటి బాధ.
మధు: అసలు నీ బాధ ఏంటే. నా కంటే వెనక పుట్టి నన్నే ప్రశ్నిస్తున్నావ్.
సీత: నువ్వు తప్పు చేస్తున్నావ్ అందుకే అడుగుతున్నాను.
మధు: అసలేంటే నేను చేసిన తప్పు. అమ్మానాన్నలకు కూతురిగా పుట్టడమా.. నీకు అక్కని అవ్వడమా.. సూర్యని ప్రేమించడమా.. ఎవరూ ఆదుకోకపోతే ఈ ఇంటికి రావడమా.. ఏంటి నా తప్పు.
సీత: నువ్వు ఈ ఇంట్లోనే ఉండటం తప్పు. ఇక్కడే ఉంటాను అనడం తప్పు. అమ్మానాన్నలు చెప్పినా వాళ్లతో వెళ్లకపోవడ తప్పు.
మధు: అసలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ ఇంట్లో ఉండటమే తప్పు అని అంటున్నావ్. నన్ను ఎప్పుడు తరిమేద్దామని చూస్తున్నావ్.. అసలు నీ బాధ ఏంటే. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్.
సీత: నేను నీ గురించే చెప్తున్నా.. నువ్వు నీ కాపురం ఏమైపోతుందో అని బెంగతో చెప్తున్నా అక్క.
మధు: మాట్లాడితే వెళ్లిపో వెళ్లిపో అంటావ్.. ఇదేమైనా ఈ ఇళ్లు అనుకుంటున్నావా.. నీ కష్టార్జితమా నన్ను వెళ్లు అనడానికి నీ హక్కు ఏంటి.
సీత: ఇది నా అత్తారిల్లు అక్క. నేను మామ భార్య స్థానంలో ఉన్నాను. ఈ ఇంటి కోడలి హోదాలో ఉన్నాను.
మధు: ఈ ఇళ్లు నీ మామ ఈ హెదా అన్నీ నేను నీకు పెట్టిన భిక్షే. చిన్నప్పుడు నా బుక్స్‌ని, వస్తువుల్ని ఇచ్చినట్లు ఈ ఇంట్లో నీ స్థానాన్ని రామ్ భర్త హోదాని నేను నీకు ఇచ్చానే. నిజానికి ఈ ఇళ్లు స్థానం హోదా అన్నీ నావి. నేను వదిలితే నువ్వు వచ్చావని మర్చిపోకు. రామ్ గారు మొదటి ఇష్టపడింది. మహాలక్ష్మి గారు కోడల్ని చేసుకోవాలి అనుకున్నది నన్ను. నన్ను.. నిన్ను కాదు.. ఇవేవి నివ్వు కోరుకుంటే రాలేదు నేను వద్దు అనుకుంటే వచ్చాయి. గుర్తుపెట్టుకో.
సీత: ఏంటి అక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.
మధు: నువ్వు నీ బుద్ధి చూపిస్తే నేను పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది.
సీత: అవును అక్క చిన్నప్పటి నుంచి నేను నువ్వు వదిలేసినవే తీసుకున్నాను. ఒప్పుకుంటున్నాను నువ్వు ఎప్పుడూ నాకు మంచే చేస్తున్నావు. కానీ నీకు తెలీకుండా నువ్వు పెద్ద ఊబిలో కూరుకుపోతున్నావు. ఆ మహాలక్ష్మి మామూలుది కాదు. ఆవిడ వల్ల మనిద్దరికీ ప్రమాదం.
మధు: నువ్వు చెప్తున్న ప్రమాదం ఏదీ నాకు కనిపించడం లేదు. నా సమస్య నా కళ్లముందే ఉంది అది తీరే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇంకేం చెప్పినా వినను. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మహాలక్ష్మిగారు ఆవిడ చెప్తే వెళ్లిపోతా. నీకు చేతనైతే ఆవిడతో చెప్పించు. వెళ్లిపో ఇక్కడి నుంచి.
సీత ఏడుస్తుంటే ఆ కన్నీటి బొట్టును మహాలక్ష్మి పట్టుకొని మీ అక్కే నిన్ను ఏడిపించింది. ఎంతైనా మధు నాకు కాబోయే కోడలు కదా నాలాగే ఆలోచిస్తుంది అంటుంది మహాలక్ష్మి. సీత, మధుల మాటలు మొత్తం వినేశాను అని చెప్తుంది. మధుమితలో మార్పు వచ్చిందని చెప్తుంది. సీతను నువ్వు దిక్కు లేకుండా ఏడిస్తే అప్పుడు తన పగ వదిలేస్తాను అని మహాలక్ష్మి అంటుంది.
సీత: ఆగు అత్త నీ పాటికి నువ్వు ఏదో ఒకటి చెప్పి వెళ్తే నేను చెప్పింది వినవా.. నా మామ మారడు. నా భర్త నాకు అన్యాయం చేయడు. ఆయన మారనంత వరకు మీరు నాకు ఏం చేయలేరు.
మహాలక్ష్మి: అయితే నేను రామ్‌ని కూడా మార్చేస్తా.
సీత: నేను ఆయన మనసులో ఉన్నాను. అది మార్చడం మీ వల్ల కాదు.
మహాలక్ష్మి: మీ అక్క మనసులో కూడా నువ్వే ఉన్నావే. మీ అక్క మారింది మరి రామ్ మారలేడా..
సీత: మామ మారడు ఎప్పటికైనా నా భార్యే నాకు కావాలి అని మామ చెప్తాడు.
మహాలక్ష్మి: సీత వద్దు మధు ముద్దు అనేలా రామ్‌తో నేను చెప్పిస్తా. నీకు చేతనైతే నాకు సీత కావాలి అని రామ్‌తో అనిపించు.
ఇక జలజతో వీధిలో వాళ్లు వచ్చి మాట్లాడుతారు. మధుమిత సూర్యని వదిలేసింది అని తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయింది. అని తమ పరువు తీయడానికి ఎవరి ఇంటికి వెళ్లిపోయింది అని చెప్తుంది. ఆ మాటలు శివకృష్ణ, లలితలు వింటూ ఉంటారు. కోపంతో రగిలిపోతారు. జలజను లాగి లలిత కొడుతుంది. జలజ లలిత మీద తిరగబడుతుంది. ఇక లలిత నీ మాటలు వింటుంటే నువ్వే మధుని హైదరాబాద్ తీసుకెళ్లావని అంటుంది. జలజ భయపడుతుంది. ఇక జలజ లలిత తనకు ఇచ్చిన వార్నింగ్ ఇచ్చిన విషయం మహాలక్ష్మికి చెప్తుంది. మరోవైపు సీత అక్కడికి వస్తుంది. మహాలక్ష్మి సీతను చూసి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.