అన్వేషించండి

Karthika Deepam 2 Serial September 21st: కార్తీకదీపం 2 సీరియల్: కాబోయే అల్లుడిని కర్రతో చితక్కొట్టిన శ్రీధర్.. కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి జరగదన్న శివనారాయణ!

Karthika Deepam 2 Serial Episode స్వప్నతో పెళ్లి వద్దని దాసు కాశీతో చెప్పడం కాశీ స్వప్నని కలవడానికి వెళ్లడం అక్కడ శ్రీధర్ కాశీని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నర్శింహ దీపని పొడవడానికి ప్రయత్నిస్తే దీప ఎదురు తిరుగుతుంది. పక్కనే కనిపించిన కర్రతో నర్శింహని చావకొడుగుతుంది. దాంతో నర్శింహ దీన్ని చంపాలని నేను వస్తే నన్ను చావగొడుతుందని అనుకొని పరుగెడతాడు. ఇక దీప శౌర్యని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు కాశీ పారిజాతం, జ్యోత్స్న స్వప్న తల్లిదండ్రులతో మాట్లాడుంటారని అనుకుంటాడు. ఇంతలో దాసు ఇంటికి వస్తాడు.

కాశీ: నాన్న స్వప్న వాళ్ల నాన్నతో మాట్లాడటానికి నానమ్మ, అక్కలను పంపించాను. ఈపాటికి వాళ్లు మాట్లాడే ఉంటారు. నువ్వు వెళ్లి మాట్లాడు.
దాసు: ఈ పెళ్లి జరగదురా.
కాశీ: అదేంటి నాన్న అంత మాట అన్నావ్. అడుగుతుంటే మాట్లాడవేంటి. 
దాసు: వాళ్ల నాన్న ఒప్పుకున్నాడా. ముందు ఆయన ఒప్పుకోని తర్వాత చూద్దాం. రెండు నెలల వరకు నువ్వు ఈ పెళ్లి గురించి మాట్లాడకు.
కాశీ: అయితే ఏదో తేడా జరిగింది. వాళ్ల నాన్న ఒప్పుకోకపోతే ఏమైంది ముందు పెళ్లి చేసుకుంటాం. తర్వాత ఆయన ఒప్పుకోడా ఏంటి.
దాసు: నేను నీలా ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నా కాబట్టే తర్వాత అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిపోయా. నేను చేసిన తప్పు నువ్వు చేయకు. అందరి అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఒక్క రెండు నెలలు ఆగు.
కాశీ: ఒకపక్క స్వప్నకి వాళ్ల నాన్న పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాన్న ఏంటి రెండు నెలలు ఆగమంటారు. పారు, జ్యోత్స్నలకు కాల్ చేస్తాడు. ఎవరూ లిఫ్ట్ చేయరు. నాన్న మాటలకు వీళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఏమైనా కారణం ఉందా. నాకు ఏదో తేడా కొడుతుంది. నేను డైరెక్ట్‌గా స్వప్న తండ్రిని కలిసి మాట్లాడితే మంచిది.

స్వప్న ఏడుస్తుంది. నాన్న పాజిటివ్‌గా రెస్పాండ్ అయి మధ్యలో ఇలా వచ్చేసి పెళ్లి చేయను అని కాశీకి వార్నింగ్ ఇచ్చి శ్రీకాంత్‌తో నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదంతా ఏంటి అని స్వప్న తల్లిని అడుగుతుంది. తల్లి కూడా కాశీని మర్చిపో శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకో అని అంటుంది. కాశీని వద్దు అనడానికి కారణం అడుగుతుంది. దాంతో కాశీతో నీకు పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు ఇదే కారణం ఆ కాశీని మర్చిపో అని అంటుంది. ఎవరు ఏం చెప్పినా నేను కాశీని వదులుకోని అని స్వప్న అనుకుంటుంది. 

మరోవైపు శ్రీధర్ రెండో పెళ్లి కూతురు గురించి తెలిసిన పారిజాతం తెగ టెన్షన్ పడుతుంది. కాశీ ఫోన్ చేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని జ్యోత్స్నతో చెప్తుంది. కాశీ ఇంటికి వస్తే ఏం చేద్దామని జ్యోత్స్న అంటే దాసు ఆపుతాడని అంటుంది. మామ రెండో పెళ్లి గురించి తెలిస్తే నా పెళ్లి ఎందుకు వద్దంటారు. తాత కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు కదా అల్లుడూ అంతే అని జ్యోత్స్న అంటుంది. 

పారిజాతం: మీ నాన్నమ్మ చనిపోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి మీ తాత నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ అల్లుడు కాంచన బతికుండగానే ఇంకోదాని మెడలో తాళి కట్టాడు. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందంటే ఈ తతంగం ఎప్పుడు నడిపాడో. అల్లుడు చేసిన చెండాలం అందరికీ తెలిసే లోపు నువ్వు కార్తీక్‌కి పెళ్లాం అయిపోవాలి. లేకపోతే ఈ పెళ్లి జరగదు. 
శివనారాయణ: ఏ పెళ్లి జరగదు. 
పారిజాతం: వచ్చావా ఇంకా రాలేదేంటి అనుకుంటున్నా.
జ్యోత్స్న: మా ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం డాడీ. తనకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతలో అబ్బాయి తండ్రికి రెండో పెళ్లి జరిగిందని తెలిసింది. ఇప్పుడు ఆ విషయం మా ఫ్రెండ్ వాళ్ల ఫాదర్‌కి తెలిసింది. పెళ్లి చేయను అని చెప్తున్నాడు. తండ్రి చేసిన పనికి కొడుకు ఏం చేస్తాడు. దానికి మీరే సమాధానం చెప్పండి తాత మా ఫ్రెండ్ వాళ్ల తాత చేసింది తప్పా.
శివనారాయణ: మీ ఫ్రెండ్ వాళ్ల నాన్న చేసింది కరెక్టే. ఆ పెళ్లి జరగకూడదు. తాళి కట్టేది కొడుకు అయినా వియ్యం అందుకునేది కుటుంబంతో. భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకోవడాన్ని సమాజం ఒప్పుకుంటుంది. కానీ భార్య బతికుండగా పెళ్లి చేసుకుంటే అది అక్రమ సంబంధమే అవుతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మనిషికి సమాజంలో విలువ లేదు. అలాంటి విలువ లేని మనిషి వియ్యంకుడు అని మీ ఫ్రెండ్ తండ్రి సమాజంలో ఎలా చెప్పుకుంటాడు.
పారిజాతం: అయ్యో గోవిందా..
జ్యోత్స్న: అంటే శ్రీధర్ బావ అక్రమ సంబంధం తెలిస్తే ఇప్పుడు డాడీ కూడా ఇలాగే ఫీలవుతారేమో.
శివనారాయణ: కొన్ని సార్లు ఈ పరువు తక్కువ పని వేరే విధంగా కూడా ఉంటుంది. మొన్న నువ్వు రాఖీ కట్టిన కాశీ గాడు ఈ ఇంటి పని మనిషి కొడుకు. పారిజాతం కొడుకే అయిన దశరథ్ పక్కన తమ్ముడి స్థానం ఇద్దాం అనుకున్నా. ఈ ఇంటి పని మనిషిని పెళ్లి చేసుకొని నా పరువు తీశాడు.
జ్యోత్స్న: అంటే ఈ పరువు తక్కువ పని ఎవరు చేసినా ఇదే నిర్ణయం తీసుకుంటారా.
శివనారాయణ: అవును.
జ్యోత్స్న: మా డాడీ చేసిన ఇదే నిర్ణయం తీసుకుంటారా.
సుమిత్ర: జ్యోత్స్న.. నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమైందా.
దశరథ్: సుమిత్రా నువ్వు ఆగు నేను తప్పు చేసినా నాన్న ఇదే నిర్ణయం తీసుకుంటారు. 
శివనారాయణ: నాకు అన్నింటి కంటే పరువే ముఖ్యం  అవసరం అయితే పరువు కోసం ఫ్యామిలీనే కాదు నా ప్రాణాలు కూడా వదిలేస్తా. 
సుమిత్ర: కొన్ని అడిగే విషయాలు కొన్ని అడగకూడని విషయాలు ఇవి అడగకూడని విషయాలు. కొన్ని సార్లు పెద్ద వాళ్లు ఉంటారు కానీ చెప్పరు. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడుగు.
పారిజాతం: అందరికీ తెలిసే లోపు నీ పెళ్లి అయిపోవాలి.
జ్యోత్స్న: ఈ విషయాలు దీపకు తెలీవు కదా.
పారిజాతం: తెలిసే అవకాశం ఉంది అంటావా.

కాశీ స్వప్నని కలుస్తాడు. ఏదో జరుగుతుందని అంటాడు. నానమ్మకి విషయం చెప్పినా తను మాట్లాడలేదని మా నాన్న కూడా రెండు నెలల వరకు పెళ్లి గురించి మాట్లాడొద్దని అంటాడు. రెండు రోజుల్లో తన పెళ్లి అని మనల్ని ఎవరూ పట్టించుకోకపోతే మనమే మన జీవితం చూసుకుందామని అంటుంది. కాశీ వెంటనే పెళ్లి చేసుకుందామని అంటాడు. ఇంతలో శ్రీధర్ ఐరన్ రాడ్ తీసుకొని చేసుకుంటావ్‌రా నేను వెధవని అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావ్ అని అంటాడు. స్వప్న అడ్డుకున్నా వినకుండా శ్రీధర్ కాశీని చితక్కొడతాడు. శ్రీధర్ ఎంతకీ వినకపోవడంతో స్వప్న చచ్చిపోతానని చేయి కోసుకుంటుంది.  

దీప ఇంటికి వచ్చి నర్శింహ అనసూయకు చెప్తుంది. నర్శింహ నీ జోలికి పాప జోలికి వస్తే చంపేస్తానని అనసూయ అంటుంది. కార్తీక్‌, జ్యోత్స్నల పెళ్లి అయితే ఊరి వెళ్లిపోదాం అంటుంది. ఇంతలో కాశీ దీపకి కాల్ చేస్తాడు. జరిగింది దీపక చెప్పి హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ముఖర్జీ ప్రాజెక్ట్ కోసం సుమతి సంతకం ఉండాల్సిందే.. టీచరే సుమతని బయటపడుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget