Seethe Ramudi Katnam Serial Today September 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ముఖర్జీ ప్రాజెక్ట్ కోసం సుమతి సంతకం ఉండాల్సిందే.. టీచరే సుమతని బయటపడుతుందా!
Seethe Ramudi Katnam Today Episode సుమతిని బయటకు తీసుకురావడానికి ముఖర్జీ ప్రాజెక్ట్‌ని మహాలక్ష్మీ అడ్డుపెట్టుకోవడం, టీచర్ ఎవరికీ తెలీకుండా సంతకం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని బెదిరించి డబ్బు తీసుకున్నానని సీత తండ్రితో చెప్తుంది. మధు కష్టాన్ని తండ్రిగా తాను తీర్చలేకపోయినా నా కొడుకు స్థానంలో నువ్వు ఉండి తీర్చావని శివకృష్ణ సీతకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక మధు వాళ్లకి ఈ విషయం చెప్పొద్దని సీత చెప్తుంది. సూర్య ఆపరేషన్‌కి రేపు వాళ్లతో నువ్వు అమ్మా వెళ్లమని అంటుంది. ఇక సీత ఇంట్లోకి వచ్చి విద్యాదేవి టీచర్ సహకారంతో బొటిక్ తెరిచానని బావ ఆపరేషన్ తర్వాత మీరంతా రావాలని చెప్తుంది. ఇక సీత, రామ్‌లు బయల్దేరుతారు.
మధు: వెళ్లొస్తాం నాన్న ఇంటికి వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి.
శివకృష్ణ: అలాగే అమ్మ మేం రేపు హాస్పిటల్‌కి వస్తాం.
సూర్య: తప్పకుండా అండీ మీరు వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది.
విశాలాక్షి: దేవుడి దయ వల్ల రేపు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంత సంతోషంగా ఉండాలి.
మహాలక్ష్మీ: టీచర్, సీత కూరగాయలు కట్ చేస్తుంటారు. మహాలక్ష్మీ అందరినీ హాల్‌లోకి సీరియస్‌గా పిలుస్తుంది. ముఖర్జీ ఆఫీస్ నుంచి అగ్రిమెంట్ వచ్చింది. ముందు ఉన్న టెర్మస్ అండ్ కండీషన్స్ మార్చి మళ్లీ అగ్రిమెంట్ పంపారు. 200 కోట్ల ప్రాజెక్ట్ ఓకే చేయాలి అంటే మనం మన కంపెనీ డైరెక్టర్స్‌తో పాటు సుమతి కూడా సంతకం చేయాలంట. సుమతి సంతకం పెడితేనే ఈ అగ్రిమెంట్ చెల్లుతుందంట లేదంటే ఈ ప్రాజెక్ట్ మనకు రాదంట. రెండు రోజుల్లో సుమతి సంతకం చేయాలంట.
జనార్థన్: సుమతి చాలా ఏళ్లగా మన కంపెనీల్లో లేదు కదా.
గిరిధర్: సుమతి వదిన మన డైరెక్టర్స్లో ఒకరు కాదు. కంపెనీలో షేర్ కూడా లేదు కదా.
అర్చన: కంపెనీతో ఏ సంబంధం లేని సుమతి సంతకం ఎందుకు.
మహాలక్ష్మీ: రేవతి నిశ్చితార్థంలో ఈ సీత చేసిన ఓవర్ యాక్షన్ వల్ల.
సీత: నేనేం చేశాను అత్తయ్య.
మహాలక్ష్మీ: ఆరోజు నువ్వు ముఖర్జీ గారితో నేను జనా రెండో భార్యని అని కంపెనీ ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా సుమతి అని చెప్పావు కదా.
రామ్: అది నిజమే కదా పిన్ని అందులో తప్పు ఏంటి.
మహాలక్ష్మీ: అది మనకు తప్పు కాదు కానీ ఇప్పుడు కంపెనీ మన పేరునే ఉంది అసలైతే మనం సంతకం చేస్తే చాలు కానీ రేపు ఎప్పుడైనా సుమతి వచ్చి కంపెనీ నాది అంటే ఇబ్బంది అవుతుందని వాళ్లు భయపడుతున్నారు. అక్కడే సమస్య వచ్చింది. అందుకే మన అందరి సంతకంతో పాటు సుమతి సంతకం అడుగుతున్నారు. ఇదంతా ఈ సీత వల్లే.
జనార్థన్: మమల్ని కాదని రేవతి నిశ్చితార్థం చేసింది చాలక నోటికి వచ్చిందంతా వాగి సమస్యని తీసుకొచ్చావ్ ఇప్పుడేం చేయాలి.
సీత: ఇలాంటి సమస్య వస్తే నాకేం తెలుసు.
సీతని తిట్టొద్దని సుమతి అలాంటి కాదని మీకు తెలుసు కదా మీరే ముఖర్జీ గారితో అర్థమయ్యేలా మాట్లాడమని అంటుంది. విద్యాదేవిని మధ్యలోకి రావొద్దని మహాలక్ష్మీ చెప్తుంది. దీనికి రెండే దారులు ఉన్నాయని ఒకటి సుమతితో సంతకం పెట్టించాలని లేదంటే ప్రాజెక్ట్ వదులుకోవాలని అంటుంది. ప్రాజెక్ట్ వదులుకోవడం వల్ల మన మార్కెట్‌లో విలువ తగ్గి కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోతుందని అంటుంది. దానికి ఏదైనా మార్గం లేదా అని రామ్ అడిగితే రేపు ఎప్పుడైనా సుమతి వచ్చినా తనకు ఈ కంపెనీతో ఏం సంబంధం లేదని షేర్లు మొత్తం వారసులుగా నీ పేరు మీద ప్రీతి పేరు మీద రాసేస్తే సరిపోతుందని అంటుంది. అది కుదరదని సుమతి పేరు పెట్టడం కుదరదని సీత అంటుంది. దాంతో మహాలక్ష్మీ సుమతితో ఈ పేపర్ల మీద సంతకం పెట్టించమని అంటుంది.
మహాలక్ష్మీ: ఏం చేద్దామో నువ్వే చెప్పు రామ్ కంపెనీలో మీ అమ్మ ఇన్వాల్వ్ మెంట్ లేదని చేయిద్దామా లేదంటే ప్రాజెక్ట్ వదిలేస్తామా లేదంటే మీ అమ్మతో సంతకం పెట్టించు. సీత మీ పుట్టింటికి సుమతి వస్తుంది కదా రేపు నువ్వు రామ్ మీ పుట్టింటికి వెళ్లి సుమతితో సంతకం పెట్టించండి అంతే.
అర్చన ప్రాజెక్ట్ గురించి మహాలక్ష్మీకి అడుగుతుంది. అది నిజంగానే ముఖర్జీ పనా లేక సీత ప్లానా అని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ ఇది సీత ప్లాన్ కాదు నా ప్లాన్ అని అంటుంది. ముఖర్జీ సుమతి గురించి పంపించలేదని నేను అలా చేశానని అంటుంది. సుమతిని బయటకు రప్పించడానికే ఇలా చేశానని చెప్తుంది. ఇంటి చూట్టూ ఉంటూ బయటకు రాని సుమతి ఈ విషయం తెలిసి చచ్చినట్లు బయటకు వస్తుందని అంటుంది. సుమతి బయటకు వస్తే నా చేతిలో చస్తుందని అంటుంది. రామ్ సీతలు అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటారు. విద్యాదేవి చాటుగా రామ్ మాటలు వింటుంది. అమ్మ పరువు కోసం అయినా అమ్మ సంతకం కావాలని రేపు ఊరు వెళ్దామని సీత, రామ్‌లు అనుకుంటారు. సీత, రామ్ ఇద్దరూ పడుకున్న తర్వాత విద్యాదేవి వాళ్ల గదికి వచ్చి పేపర్ల మీద సంతకం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.