అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham Serial October 2nd: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి వద్దు బావే కావాలని గోల చేస్తున్న జ్యోత్స్న.. కార్తీక్ మాటలకు బిత్తరపోయిన శ్రీధర్!

Karthika Deepam 2 Serial Episode రోడ్డు మీద కార్తీక్‌ తన తండ్రి కనిపించడం క్షమించమని అడగటంతో తండ్రిని తిట్టి తమ జీవితాల్లోకి రావొద్దని కార్తీక్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode జ్యోత్స్న తాత మీద విరుచుకుపడుతుంది. తాతయ్య నువ్వు చాలా సెల్ఫిష్ అని అంటుంది. నీ పరువు మర్యాద కోసం మనవరాలి జీవితం నాశనం చేశావని దెప్పి పొడుస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఆపు అని జ్యోత్స్నని తండ్రి అంటాడు. దాంతో జ్యోత్స్న తాన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు మామ చేసుకుంటే తప్పా అని అడుగుతుంది. దాంతో దశరథ్ జ్యోత్స్నని కొట్టడానికి వస్తాడు. దాంతో శివనారయణ కొడుకుని ఆపుతాడు. 

దశరథ్: చూడు జ్యోత్స్న నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోతే నన్ను మా చెల్లిని చూసుకోవడానికి ఈ ఇంటి కోసం ఓ ఆడతోడు ఉండాలని మా నాన్న అందరి సమక్షంలో పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకున్నారు. కానీ మీ మామయ్య భార్య బతికుండగానే భార్యకు తెలీకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. తిను నా భార్య అని మా నాన్న పిన్నిని చూపించగలడు. మీ మామయ్య ఆ రెండో భార్య చూపించగలడా. ఏ విలువా లేని ఆ ఇంటికి నిన్ను పంపిస్తే నువ్వు నీ పిల్లలు తరతరాలు ఆ నింద మోస్తూ భరించాలి. దొంగలా ఎనాళ్లు బతుకుతారు. నువ్వు మా వారసురాలివమ్మా మా తర్వాత ఈ ఇంటిని ఈ ఆస్తిని మా గౌరవాన్ని కాపాడాల్సింది నువ్వే.
జ్యోత్స్న: నాకు ఇవేమీ వద్దు డాడీ. నాకు బావ కావాలి. బావతో నాకు పెళ్లి చేయండి. ఎవరు ఎంత చెప్పినా నేను వినను నాకు అర్థం కాదు బావతో నాకు పెళ్లి చేస్తారు. 
దశరథ్: తీసుకున్న నిర్ణయం మారదు మీ బావని మర్చిపో.
జ్యోత్స్న: అది ఈ జన్మలో జరగదు డాడీ. నేను బావతోనే బతుకుతాను తనే నాభర్త తనకి నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది తనే నా భర్త. కాదు అనడానికి మీరు ఎవరు. 
పారిజాతం: ఆగు దీప మొత్తం విని ఏం మాట్లాడకుండా వెళ్లిపోతున్నావేమీ.
దీప: జ్యోత్స్న బాధలో అర్థముంది కదమ్మా
పారిజాతం: దాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వే కదా. ప్రశాంతంగా ఉన్న ఇంటిని ఒక్క పెళ్లితో విడదీసేశావ్. నిన్ను చేరదీసిన పాపానికి మాకు ఈ గతి పట్టించావా. నువ్వు బాగు పడవే. మా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. 

ఇంతలో అనసూయ వచ్చి పారిజాతాన్ని ఆపుతుంది. దీప ఈ పెళ్లి చేయకపోయినా జరిగుండేదని తప్పకుండా వ్యవహారం బయట పడేదని అంటుంది. తప్పు చేసిన మనిషిని వదిలేసి దీపని అంటావేంటని అడుగుతుంది. దానికి పారిజాతం నీ కొడుకు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు సమర్దించావ్ కదా అప్పుడు ఈ బుద్ధి ఏమైందని ప్రశ్నిస్తుంది. కొడుకు తరిమేయడం వల్ల నీ కోడలి పంచ చేరావని అంటుంది. తప్పు చేయడం తప్పు కాదు అది తప్పు అని చెప్పడం తప్పులా ఉందని అనసూయ అంటుంది. ఇక తన కోడలి జోలికి రావొద్దని నేను అసలే మంచిదాన్ని కాదని దీపని తీసుకొని వెళ్లిపోతుంది. 

మరోవైపు శ్రీధర్ రోడ్డు మీద కొబ్బరి బొండాలు కొని వాటిని తీసుకెళ్తూ కార్తీక్ కారుకి అడ్డంగా వెళ్తాడు. కార్తీక్‌ని చూసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే కార్తీక్‌ మాట్లాడటానికి చిరాకు పడతాడు. కావాలనే తప్పు చేశారని తండ్రిని తిడతాడు. శ్రీధర్ క్షమాపణ చెప్తే ఎవరికి కావాలి మాస్టారూ మీ క్షమాపణ అని అంటాడు. నా తల్లి నమ్మకం పోయిందని పుట్టింటి బంధం తెగిపోయిందని అంటాడు. 

శ్రీధర్: కార్తీక్ పుట్టింటి బంధం తెగిపోవడం ఏంటి.
కార్తీక్: పరువు మర్యాద గంగలో కలిపిన ఇలాంటి ఇంటితో వియ్యం ఏంటి అని మామయ్య తాతయ్య వచ్చి సంబంధం క్యాన్సిల్ చేశారు. వాళ్లు తెంపుకుంది సంబంధాన్ని కాదు బంధాన్ని కూడా. నా తల్లికి మెట్టినింటిని పుట్టింటిని రెండింటినీ ఒకేసారి దూరం చేశారు మీరు. మిమల్ని నాన్న అని పిలవడానికే అసహ్యంగా ఉంది అంటే ఏ స్థాయికి దిగజారిపోయావో చూసుకో. ఇంట్లో ఉండాల్సిన జీవితాలను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చావ్. నాన్న ఒక్కటి చెప్పు మేం ఏం తప్పు చేశాం ఏం పాపం చేశావ్. 
శ్రీధర్: ఎప్పటికప్పుడు నిజం చెప్పాలనే చూశానురా.
కార్తీక్: ఎందుకు నా తల్లిని చంపడానికా అందుకేనా ఇన్ని రోజులు ఈ నిజం నేను దాచుకున్నది. 
శ్రీధర్: ఏంట్రా నువ్వు అనేది ఈ నిజం నీకు ముందే తెలుసా.
కార్తీక్:  తెలుసు కానీ అప్పుడు నా తల్లి ఉన్న కండీషన్కి నీ తప్పు తెలుసుంటే బతికుండేది కాదు. నువ్వు చేసిన తప్పునకు నా తల్లికి ఎందుకు శిక్ష పడాలి. ఈ విషయాల్నీ దీపకు కూడా తెలుసు. దీప నాకు చెప్పలేదు. ఒక రోజు రోడ్డు మీద మీ రెండో ఫ్యామిలీతో మిమల్ని చూశాను. చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. మీరు అబద్ధం చెప్తారంటేనే నేను నమ్మను అలాంటిది మీరు ఇలా చేశారంటే నమ్మడం నావల్ల కాలేదు. నా పరిస్థితే ఇలా ఉంటే అమ్మ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. తప్పు మీరు చేస్తే నష్టం మా అమ్మకి జరిగింది. మీరంతా సంతోషంగా ఉన్నారు కానీ మా అమ్మ ఏడుస్తుంది. ఏం చెప్పాలి ఆమెకు. నేను ఇంట్లో ఏడ్వలేను అందుకే బయటకు  వచ్చి ఏడ్వాలనుకున్నా. నువ్వు అందర్ని మోసం చేశావు. చివరకు నీ మోసాలు బయట పడతాయని నా చెల్లికి కూడా ఇష్టం లేని పెళ్లి చేయడానికి రెడీ అయ్యావు. 
శ్రీధర్: దీప వల్లే ఇదంతా జరిగిందిరా.
కార్తీక్: ఆపండి మాస్టారూ దీప దగ్గరుండి పెళ్లి చేసింది స్వప్నకి కాశీకి మీకు పిన్నికి కాదు. 
శ్రీధర్: మీరు లేకుండా నేను బతకలేనురా ఏం చేయాలో చెప్పురా
కార్తీక్: దారికి అడ్డు తప్పుకోండి మాస్టారూ మీ వల్ల మాకు జరిగిన నష్టం చాలు ఇక మాకు వదిలేయండి. 
శ్రీధర్: రేయ్ ప్లీజ్ రా రేయ్ కార్తీక్ ప్లీజ్.. పొండిరా పొండి.

దీపతో అనసూయ వెళ్లిపోదామని అంటుంది. ఇక శౌర్య వచ్చి కార్తీక్‌ దగ్గరకు వెళ్తానంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప కార్తీక్‌తో మా నాన్న చేసిన తప్పునకు మిమల్ని మీ తాత వద్దునుకోవడం ఏంటి అని అడుగుతుంది. దాంతో కార్తీక్ అది తేల్చుకోవడానికే ఇంటికి వచ్చానని అంటాడు. ఏ నేరం చేసిందని నా తల్లికి ఈ శిక్ష వేశాడో అడుగుతాను అని అంటాడు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మైత్రికి పెళ్లి చూపులు నందిని హడావుడి.. గెటప్ మార్చేసిన రుద్ర.. తెలుగు మాస్టర్‌కి బుక్కైన క్రిష్!  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget