అన్వేషించండి

Satyabhama Serial Today October 2nd: సత్యభామ సీరియల్: మైత్రికి పెళ్లి చూపులు నందిని హడావుడి.. గెటప్ మార్చేసిన రుద్ర.. తెలుగు మాస్టర్‌కి బుక్కైన క్రిష్!

Satyabhama Today Episode బామ్మ ద్వారా క్రిష్ పుట్టుక తెలుసుకున్న సత్య చక్రవర్తి మామని ఇంటికి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్యను చంపేస్తే ఏ ఇబ్బంది ఉండదని రుద్ర తండ్రి మహదేవయ్యతో చెప్తాడు. మహదేవయ్య రుద్రని తిడతాడు. చిన్నా తన చేయి జారకుండా సత్య అనే ఐస్‌క్రీమ్ అందించానని అంటాడు. సత్య ఈ ఇంటికి రావడం నందిని ఆ ఇంటికి వెళ్లడమే తనకు కలిసి వచ్చిందని ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని అంటాడు. తనకు తెలీకుండా సత్యని చంపాలని ట్రై చేస్తే చంపేస్తానని అంటాడు.

మరోవైపు మైత్రికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నందిని హడావుడి చేస్తుంది. అత్తామామలకు పనులు పురమాయిస్తుంది. అందరూ వచ్చి చాలా సంతోషిస్తారు నందిని చలాకీకి. ఎలా అయినా ఈ సంబంధం కుదరాలని మంచి సంబంధం అని అంటుంది. ఇక మైత్రి దగ్గరకు వెళ్తుంది. 

నందిని: రామచంద్రా సినిమాకి పోవడానికి రెడీ అయ్యావా పెళ్లి చూపులకు రెడీ అయ్యావా ఈ చీర ఏంటి. ఈ వాలకం ఏంటి.
మైత్రి: ఏమైంది బానే ఉంది కదా నందిని.
నందిని: పెళ్లి కూతురు ముస్తాబంటే ఎలా ఉండాలి. నిన్ను చూడగానే చంకనెత్తుకొని పారిపోయేలా ఉండాలి. స్పాట్‌లో ముహూర్తం పెట్టించేలా ఉండాలి. మంచి సంబంధం అంట హర్ష చెప్పాడు. ఎలా అయినా కుదిరిపోవాలి.
మైత్రి: నా వైపు నుంచి నో చెప్పను పెళ్లి కొడుకు ఎలా ఉన్నా ఓకే చెప్తాను మాటిస్తున్నాను. 
నందిని: ఒప్పుకుంటే నీకే మంచిది. నా దగ్గర మంచి చీరలు ఉన్నాయ్ ఉండు తీసుకోస్తా.

హర్ష షర్ట్‌లు పట్టుకొని ఏది వేసుకోవాని ఆలోచిస్తుంటే నందిని వచ్చి పెళ్లి చూపులు నీకు కాదు అంటుంది. నువ్వు ఈ హడావుడి ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు మైత్రికి పెళ్లి అయితే వెళ్లిపోతే నీకు హ్యాపీ అనే ఇలా ఉన్నావని అంటాడు. దానికి నందిని నువ్వు ఏమైనా అనుకో అని మైత్రికి పెళ్లి అయితే తన జీవితంతో పాటు నా జీవితం కూడా సంతోషంగా ఉంటుందని అంటుంది. మరోవైపు రుద్ర గెటప్ మార్చేస్తాడు. మంచిగా పాంట్ షర్ట్ వేసుకొని మెడలో రెండు చైన్లు చేతికి ఉంగరాలు మండచైన్ పెట్టుకొని హీరోలా రెడీ అయిపోతాడు. అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతాడు. పాట పెట్టుకొని ఒక్క మగాడు అంటూ గెంతులేస్తాడు. రేణుక వచ్చి భర్తని చూసి సూపర్ ఉన్నావని చెప్పి చేయి పట్టుకొని హాల్‌లోకి అందరి ముందుకు తీసుకెళ్తుంది. అందరికీ మన ఇంటికి హీరో ఇచ్చాడని తన భర్తని చూపిస్తుంది. తల్లిదండ్రులు రుద్రని పొగిడేస్తారు.

ఇక క్రిష్, బాబీ సత్య చెప్పిన తెలుగు మాస్టర్ దగ్గరకు వెళ్తాడు. క్రిష్ తనని తాను సత్యభామ భర్త అని పరిచయం చేసుకుంటాడు. ఆ మాస్టర్‌తో మాట్లాడుతుంటే కాస్త ఇంగ్లీష్ పదాలు వస్తుంటే క్రిష్‌ని దద్దమ్మా, అది ఇదీ అని తిడతాడు. మాస్టార్ వయసు క్రిష్ అడిగితే ఊరికే ఏదీ చెప్పనని అంటాడు. దాంతో క్రిష్ గురు దక్షణ ఇస్తానని అంటాడు. దానికి గురువుగారు అల్లసాని పెద్దన పద్యం చెప్తానని తిరిగి తప్పులు లేకుండా చెప్తేనే వయసు చెప్తానని అంటాడు. క్రిష్ సరే అంటాడు. ఇక పంతులు అటజని కాంచె భూమీసురడంబర చుంబీ.. పద్యం చెప్పగానే క్రిష్, బాబీలు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోతారు. 

మరోవైపు జయమ్మ క్రిష్‌ జాతకాన్ని భద్రంగా దాస్తుంది. అది చూసి సత్య బామ్మ దగ్గర కూర్చొని క్రిష్ పుట్టడం నీకు గుర్తుందా పక్కనే ఉన్నావా అని బామ్మని అడుగుతుంది. బామ్మ పక్కనే ఉన్నానని పుట్టినప్పుడు జరిగింది మొత్తం సత్యకు చెప్తా అని అంటుంది. క్రిష్ పుట్టినప్పుడు రౌడీలు మహదేవయ్యని బెదిరించడం తాను రుద్రని తీసుకొని పారిపోవడం గురించి చెప్తుంది. క్రిష్‌ని మహదేవయ్య కాపాడుకున్నాడని చెప్తుంది. సత్య ఆలోచనలో పడుతుంది. ఇంతలో చక్రవర్తి సత్యకి కాల్ చేస్తాడు. క్రిష్‌ గురించి అడుగుతాడు. ఏమైందని చక్రవర్తి అడిగితే ఎందుకో మాట్లాడాలి అనిపించిందని చెప్పి క్రిష్‌ గురించి సత్యకు మళ్లీ జాగ్రత్తలు చెప్తాడు. ఇక సత్య చక్రవర్తిని ఇంటికి పిలుస్తుంది. 

తన పద్యంతో విస్తుపోయిన క్రిష్‌, బాబీలకు తెలుగు మాస్టారు లేపి పద్యం చెప్తేనే వయసు చెప్తాను అని అంటాడు. క్రిష్ కొంచెం కొంచెం పద్యం చెప్పమంటే మాస్టారు చెప్తాడు కానీ అది కూడా క్రిష్ నోరు తిరగదు. చూడటానికి చాలా కామెడీగా ఉంటుంది. అవ్వట్లేదని క్రిష్ అంటే మాస్టార్ వెళ్లిపోమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపని మెడ పట్టుకొని గెంటేసిన శ్వేత.. తల్లి మాటలతో రూప తండ్రికి ఎదురు తిరుగుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Embed widget