Ammayi garu Serial Today October 1st: అమ్మాయి గారు సీరియల్: రూపని మెడ పట్టుకొని గెంటేసిన శ్వేత.. తల్లి మాటలతో రూప తండ్రికి ఎదురు తిరుగుతుందా?
Ammayi garu Today Episode రాజు, శ్వేతలకు పెళ్లి చేయనున్నారని తెలుసుకున్న రూప అత్తారింటికి వెళ్లడం శ్వేత రూపని గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూప తండ్రిని ఒప్పించాలని ప్రయత్నిస్తే సూర్య ప్రతాప్ ఒప్పుకోడు. వాళ్ల గురించి తన దగ్గర మాట్లాడొద్దని అంటాడు. తండ్రి బాధలో నిజం ఉందని అనుకున్న రూప తెళ్లారి అత్తతో మాట్లాడాలని అనుకుంటుంది. ఇక ఉదయం ముత్యాలు పంతుల్ని పిలిచి మాట్లాడుతుంది. తన భర్త వచ్చి కూతురు ధనాలు గురించి కూడా ఆలోచించమని అంటాడు. కూతురిని అత్తారింటికి ఇప్పటి వరకు పంపించలేకపోయాం అని ఇప్పటి అయినా తనని అత్తారింటికి పంపిద్దామని అంటాడు. దానికి ముత్యాలు మన పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఉన్నప్పుడు పంపిద్దామని అంటాడు.
ఇంతలో శ్వేత అత్తయ్య అత్తయ్యా అనుకుంటూ వస్తుంది. కోడల్ని చూసి నా కోడలు బంగారు అంటూ ముత్యాలు వచ్చి పక్కన కూర్చొపెట్టుకుంటుంది. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమన్నారని మీ కోసం చీర తీసుకొచ్చానని ముత్యాలుకి చీర గిఫ్ట్‌గా ఇచ్చి బుట్టలో వేసుకుంటుంది శ్వేత. ఇంతలో రూప అక్కడికి వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు.
శ్వేత: అత్తయ్యా ఇది మళ్లీ వచ్చింది ఏంటి తెగదెంపులు అయిపోయాయి కదా.
ముత్యాలు: తెగదెంపులు అయిపోయాయి నా కొడుకు సంబంధించిన ఇంకో సంబంధం మాటా మంచి కూడా అయిపోయాయమ్మా.
రూప: అత్తయ్యా రాజుకి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలిసే వచ్చా అది ఎలా కుదురుతుంది అత్తయ్యా. మాది పవిత్ర మైన బంధం అలా ఎలా విడదీయాలని అనుకుంటారు.
ముత్యాలు: ఏయ్ నా కొడుకుకి నీకు ఏ సంబంధం లేదని చెప్పిందే మీ నాన్న అప్పుడెందుకు తెరవలేదు ఈ నోరు. నువ్విళ్లు పారిపోతే మీ నాన్న నా కొడుకు మీద గన్ గురి పెట్టాడు అప్పుడేమైంది నీ పవిత్ర బంధం. అన్నింటికీ మించి నా కొడుకు ఆఫీస్ కూలగొట్టినప్పుడేం చేశావ్ ఆపకుండా. మర్యాదగా బయటకు పో.
రూప: అత్తయ్య నన్ను బయటకు పొమ్మనే హక్కు రాజుకి తప్పు ఎవరికీ లేదు.
శ్వేత: రాజు చెప్పడు రాజుకి కాబోయే భార్యగా చెప్తున్నా పో
రూప: నువ్వు కాబోయే భార్యవి అవునో కాదో నాకు తెలీదు కానీ నేను రాజు భార్యని నేను తలచుకుంటే ఇప్పుడే నిన్ను తరిమేయగలను.
మాటా మాటా పెరిగి శ్వేత రూపని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఇంతలో రాజు వచ్చి రూపని పట్టుకుంటాడు. తల్లితో పాటు శ్వేత మీద కూడా ఫైర్ అవుతాడు. రూపని పట్టుకొని దగ్గరకు తీసుకొని తను నా భార్య. అమ్మాయి గారిని తప్ప మరొకరిని నా భార్యగా ఊహించుకోనని అంటాడు. తన కోసం చేసే పనులు మానుకోకపోతే చంపడానికి కూడా ఆలోచించనని శ్వేతతో చెప్తాడు. ఇక ముత్యాలు శ్వేతతో నా కొడుకు నా మాట వింటాడు నేను పెళ్లికి ఒప్పిస్తా మీరు వెళ్లండని ఒప్పించి పంపుతుంది. అత్తయ్య నా మీద ఎందుకు కనీసం జాలి కూడా చూపించడం లేదని అత్తయ్య మనసులో నాకు చోటు లేదని రాజుతో రూప చెప్తుంది. దాంతో రాజు ఆ ఇంట్లో నిన్ను ఒప్పుకోకపోతే వేరుగా ఉందామని అంటాడు. దాంతో రూప వద్దని ఎన్ని కష్టాలు ఉన్నా అత్తారింట్లోనే ఉండాలని అంటుంది. కరెక్ట్ అంటూ విరూపాక్షి వస్తుంది. నీ భర్తే నీకు తోడు ఉంటే నీకు ఇంకేం కావాలని విరూపాక్షి అడుగుతుంది. భర్తతో పాటు నా అత్తారిళ్లు కూడా కావాలని అంటుంది. దాంతో అందుకు మీ నాన్నని ఒప్పించాలి విరూపాక్షి అంటుంది.
వాళ్లని రోడ్డుకి ఈడ్చడం వల్ల రాజు తల్లి మీ నాన్న మీద కోపం పెంచుకుందని మీ నాన్నని ఒప్పించాలని అంటుంది. మిమల్ని విడదీయడానికి ప్రయత్నించిన మీ నాన్న మిమల్ని కలిపేలా చేయమని అంటుంది. అందరూ కలిసి సూర్యప్రతాప్ ఇంటికి వెళ్తారు. వాళ్లని చూసి సూర్యప్రతాప్ కోపంతో రగిలిపోతాడు. విజయాంబిక మరింత నూరిపోస్తుంది. దాంతో సూర్య ప్రతాప్ వాళ్లని గుమ్మం దగ్గరే ఆపేసి తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సొగసరి అత్తల్ని తన షాప్‌లో బట్టలమ్మేలా ప్లాన్ చేసిన గడసరి కోడలు!