అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సొగసరి అత్తల్ని తన షాప్‌లో బట్టలమ్మేలా ప్లాన్ చేసిన గడసరి కోడలు! 

Seethe Ramudi Katnam Today Episode సీత మెట్ల మీద నుంచి జారిపోయినట్లు నటించి మహాలక్ష్మీని తన బొటిక్‌లో కూర్చొనేలా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ సీతని బిజినెస్‌లో ఇబ్బంది పెట్టాలని సీత దగ్గర ఆర్డర్స్ చేసిన అందరికీ ఫోనులు చేసి ఆర్డర్స్ క్యాన్సిల్‌ చేసుకోమని చెప్తుంది. అర్చన మహాతో నీ ఫ్రెండ్సే అక్కడికి వెళ్తున్నారు మహా ఈ దెబ్బతో వాళ్ల వెళ్లరని అంటుంది. సీత ఇక బిజినెస్ మూసేసి ఇంట్లో కూర్చొవడం ఖాయమని  అంటుంది మహాలక్ష్మీ. 

శివకృష్ణ, లలితలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో రేవతి, కిరణ్‌లు శివకృష్ణకు ఫోన్ చేసి పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తామని అంటాడు. పర్లేదని ఫోన్‌లో పంపేమని అంటాడు సీత తండ్రి. 

శివకృష్ణ: మనలో మనకు ఈ ఫార్మాలిటీస్ ఎందుకు కిరణ్. పెళ్లి అంటే చాలా పనులుంటాయ్. పైగా నువ్వు ఒంటరి వాడివి. అన్నీ నువ్వే చూసుకోవాలి. (కిరణ్ బాధ పడతాడు)
రేవతి: మీరు ఉండగా తను ఒంటరి వాడు ఎలా అవుతాడు బావగారు. మా నిశ్చితార్థం జరిపించినట్లే పెళ్లి కూడా మీరే దగ్గరకుండి జరిపించాలి.
లలిత: తప్పకుండా లలిత. మేం పెళ్లికి దగ్గర్లో వస్తాం.
రేవతి: ఇదంతా సీత వల్లే అయింది అక్క. తనే లేకుంటే మా పెళ్లి ఇక్కడి వరకు రాదు.

ఇక కిరణ్ శివకృష్ణకి కిరణ్ ఫోటో పంపిస్తాడు. అందులో తన పేర్లు చూస్తారు. తామే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలని అనుకుంటారు. మహాలక్ష్మీ అడ్డుకోవాలని చూస్తుందని అయినా సీత ఊరుకోదని అనుకుంటారు. మరోవైపు గదిలో సీత తన బిజినెస్ వల్ల వచ్చిన డబ్బు లెక్కలేసుకుంటుంటే.. రామ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ బిజినెస్‌లు గురించి మాట్లాడుకుంటారు. మీ సపోర్ట్ ఉంటే నేను డెవలప్ అవుతానని సీత అంటుంది. ఇక రామ్ సీతకి ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే సీత వద్దని అంటుంది. ఇక మహాలక్ష్మీ అత్తయ్య పేరు పెట్టుకోవడం వల్లే నాకు బిజినెస్‌లో అదృష్టం వచ్చిందని అంటుంది. మహాలక్ష్మీని తెగ పొగిడేస్తుంది. రామ్ కూడా మహాలక్ష్మీ చేయి లక్ అని తనని అర్థం చేసుకుంటే నీకు చాలా సాయం చేస్తుందని అంటాడు. దానికి సీత రోజూ అత్తయ్య కాలు కడుగుతానని పొగిడేస్తుంది.

ఉదయం మహాలక్ష్మీ, అర్చనలు సీత బిజినెస్ లాస్ అవుతుందని మాట్లాడుకుంటారు. ఇంతలో సీత కిందకి వస్తుంటుంది. ఇంతలో సీత మెట్ల మీద నుంచి పడిపోతుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. రామ్, విద్యాదేవి టీచర్ సీతని పట్టుకొని సోఫాలో కూర్చొపెడతారు. సీత నడుము విరిగిపోయిందని నొప్పి అని అరుస్తుంది. రామ్ వాళ్లు కంగారు పడతారు. హాస్పిటల్‌కి తీసుకెళ్దామని విద్యాదేవి అంటే సీత టీచర్‌ని చూసి యాక్టింగ్ అన్నట్లు కన్ను కొడుతుంది. హాస్పిటల్‌కి వద్దని అంటుంది. షాప్‌ని తీయలేనని నడుం నొప్పితో వెళ్లలేనని అంటుంది. విద్యాదేవి కూడా సీత యాక్టింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. షాప్ తెరవకపోతే మహాలక్ష్మీ అత్తయ్య పేరు పోతుందని అంటుంది. సీత ఏదో స్కోచ్ వేస్తుంది మహాలక్ష్మీ అర్చన అనుకుంటారు. 

సీత: ఈ రోజు నా బదులు మహాలక్ష్మీ అత్తయ్య షాప్ తీయాలి మామయ్య.
రామ్: మా పిన్ని షాప్ తీయడం ఏంటి సీత.
విద్యాదేవి: తప్పేముంది. 
జనార్థన్: మహా షాప్ తీసి కూర్చొవాలా ఏం మాట్లాడుతున్నారు.
విద్యాదేవి: చెప్పేది జాగ్రత్తగా వినండి ఆవిడే షాప్ ఓపెన్ చేశారు వారంలోనే షాప్ మూత పడితే మహాలక్ష్మీ గారినే తప్పుగా అనుకుంటారు కదా . లక్కీ హ్యాండ్‌ అని తెచ్చుకున్న మీకు చెడ్డ పేరు రావడం ఎలా.
రామ్: అవును పిన్ని అయితే మీరు ఈ రోజు షాప్‌లో కూర్చొండి.
జనార్థన్: కరెక్టే మహా సీత బిజినెస్ పక్కన ఉంచి నీ పరువు కోసం వెళ్లాలి. 

అందరూ మహాలక్ష్మీని చీరల షాప్‌లో కూర్చొమని అంటారు. మహాలక్ష్మీ షాక్ అవుతుంది. మీరంతా నా గురించి ఏమనుకుంటున్నారని మహాలక్ష్మీ అడుగుతుంది. దానికి మీ పేరు పోతే మన పరువు మొత్తం పోతుందని సీత అంటుంది. పొగుడుతూనే సీత, విద్యాదేవిలు మహాలక్ష్మీని తిడతారు. జనార్థన్‌ మాత్రం మహాలక్ష్మీ షాప్ తెరవాల్సిందే అని అంటాడు. అర్చనను తోడుగా వెళ్లమని గిరిధర్ చెప్తాడు. ఇక రామ్‌ సీతని పైకి తీసుకెళ్లి నడుం నొప్పికి మందు రాస్తాడు. సీత అక్కడ కాదు ఇక్కడ కాదు అని యాక్టింగ్ చేస్తుంది. అర్చన దూరం నుంచి చూసి అదంతా యాక్టింగ్ అని తెలుసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని చంపేద్దామని తండ్రితో చెప్పిన రుద్ర.. ఇక సత్య, క్రిష్‌లకు ముహూర్తం లేనట్లే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Embed widget