Karthika Deepam 2 Serial Today March 5th: కార్తీకదీపం 2 సీరియల్: లాకెట్ చూపిస్తూ దీపకు నిజం చెప్పి చెప్పనట్లు ఓ ఆట ఆడుకున్న కార్తీక్.. ప్రమాదంలో జ్యో!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్నని వదిలేయమని దీప కార్తీక్‌తో చెప్పి మరోసారి జ్యో తప్పు చేస్తే చంపేస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటాడు. దీప వద్దని అంటుంది. ఇలా వదిలేస్తే జ్యోత్స్న మారదని అంటాడు. దాంతో దీప కార్తీక్‌తో దశరథ్ తనతో చెప్పిన విషయం చెప్తుంది. ఆయన చేతులు పట్టుకొని క్షమాపణ అడిగారని కోపం అక్కడితోనే పోయిందని అంటుంది. సుమిత్ర తనని కొట్టిందని చెప్తుంది.
కార్తీక్: తన కూతురికి ప్రమాదం రాకుండా నీ దగ్గర మాట తీసుకొని ఆపేశాడు.
దీప: పాపాలు చేసేవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. జ్యోత్స్న ఇక ఏ తప్పు చేయలేదు కార్తీక్ బాబు. మరోసారి జ్యోత్స్న పాప జోలికి వస్తే నా గురించి వార్తల్లో వింటారు. ఆవేశానికి ఆకలి ఎక్కువ లేచింది అంటే బలి కోరుతుంది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మీ అమ్మగారికి మా అత్తకి ఈ విషయం చెప్పొద్దు. శౌర్యకి కూడా. జ్యోత్స్నది ఏ తప్పు లేదు తను చూసింది అబద్ధం అని చెప్పాలి లేదంటే అది రోజు భయపడుతుంది.
కార్తీక్: నేను జ్యోత్స్నకి దక్కలేదు అన్న కోపమే కదా మీ మీద కోపం. మీరు లేకపోతే నేను తనకు దక్కుతాను అని తన ఉద్దేశం. ఈ మాట గుర్తు పెట్టుకుంటా దీప ఎక్కడో ఒక చోట గట్టిగా సమాధానం చెప్పాల్సిందే. ముందు మనం ఇంటికి వెళ్దాం పద. వెళ్లిన తర్వాత నీకు ఒకటి చెప్పాలి. మనసులో నువ్వే నా ప్రాణ దాతవని నాకు నిజం తెలిసిపోయిందని చెప్తా దీప.
శివనారాయణ: దీపని ఊరికే వదిలేయకూడదురా తగిన బుద్ధి చెప్పాలి.
దశరథ్: ఆధారాలు తీసుకొస్తా అని వెళ్లింది కదా వదిలేయండి నాన్న.
శివనారాయణ: ఇంట్లో ఉన్న మనిషి కోసం ఏం ఆధారాలు తెస్తుందిరా. ఆ ఇంట్లో అందరూ అలా తయారయ్యారు. ఒక్కరూ నిదానంగా ఆలోచించడం లేదు.
సుమిత్ర: అవును మామయ్య గారు నన్ను కాపాడింది అన్న కృతజ్ఞత నన్ను కాసేపు మర్యాదగా మాట్లాడేలా చేశాయి. తన కూతురు తనకు ఎంతో నా కూతురు నాకు అంతే కదా. ఒంటి మీద చేయి పడగానే తట్టుకోలేకపోయాను.
దశరథ్: నిన్ను నేను అర్థం చేసుకోగలను సుమిత్ర. కానీ ఒకవేళ తప్పు మన కూతురు చేసిందని తేలితే.
దీప: నా కూతురు ఏ తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నా కాబట్టి చెంప దెబ్బ దీపకి తగిలింది. లేదంటే జ్యోత్స్నకి తగిలేది. నేను తప్పుని సమర్దించను ఎవరినైనా వదలను. ఇది తప్పు చేస్తే నేనే దీన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తా.
శివన్నారాయణ: అవసరం లేదమ్మా నా మనవరాలు పొరపాట్లు చేస్తుంది కానీ తప్పు చేయదు. జ్యోత్స్న నువ్వు లోపలికి వెళ్లు.
దశరథ్: జ్యోత్స్న దాసుని చంపాలి అనుకోవడానికి దీప, శౌర్యలను చంపాలి అనుకోవడానికి ఏమైనా కారణం ఉందా.
దీప, కార్తీక్‌లు ఇంటికి వెళ్తారు. శౌర్య జ్యోత్స్న గురించి చెప్పబోతే దీప ఆపేస్తుంది. ఇక కార్తీక్ రేపటి నుంచి శౌర్య బస్సులో వెళ్తుందని తన కోసం ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది. ఇక కార్తీక్ ఏం భయం లేదని కానీ జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. దీప శౌర్యతో నువ్వు చూసింది జ్యోత్స్న కాదని అలాగే ఉన్న మరో మనిషి అని చెప్తుంది. ఆమెని కలిసి వార్నింగ్ ఇచ్చామని అంటుంది. ఇక విషయం మర్చిపోయావని ఎవరికీ ఏం చెప్పొద్దని అంటుంది. ఇక కార్తీక్ దీప కోసం మజ్జిగ తీసుకొస్తాడు. ఇక శౌర్య కార్తీక్‌తో తన లాకెట్ పోయిందని సారీ చెప్తుంది. దాంతో దీప మళ్లీ పొగొట్టేశావా అది రెండో సారి కూడా పోయింది అని దీప అంటే కార్తీక్ మొదటి సారి ఎప్పుడు పోయింది అని నిజం చెప్తుందేమో అని అడుగుతాడు. అది మీ ప్రాణ దాతది కదా అని దీప అంటే నీది కాకూడదా కార్తీక్ అంటాడు.
పాపతో సారీ వాపస్ తీసుకోమని నా ప్రాణ దాత నన్ను వదిలేసి పోదని ఎప్పటికీ నాతోనే ఉంటుందని అంటాడు. దీప మనసులో నిజం తెలిసిపోయిందా అనుకుంటుంది. అమ్మ నీ ప్రాణ దాత అమ్మని అడుగుతున్నావ్ అని శౌర్య అంటే మీ అమ్మ నా ప్రాణ దాతే. మీ అమ్మ పెద్ద ప్రాణ దాత లాకెట్ చిన్న పాణ దాతది అని చెప్తాడు. ప్రాణం పోయిన లాకెట్ పోగొట్టుకోను అని బయటకు తీస్తాడు అందరూ సంతోషిస్తారు. నీకు దొరికిందా నాన్న అని పాప అడిగితే నా ప్రాణం కదా ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ వస్తుందని అంటాడు. కార్తీక్ బాబు నిజం తెలిసినట్లు మాట్లాడుతున్నాడేంటి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి





















