అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 24th: కార్తీకదీపం 2 సీరియల్: ముఖ్యమైన విషయం అందరితో చెప్తానన్న కార్తీక్.. దీప, జ్యోత్స్న, పారులు టెన్షన్‌తో పోయేలా ఉన్నారుగా!

Karthika Deepam 2 Serial Episode కార్తీక్ సన్నాయి మేళాలతో సుమిత్ర ఇంటికి వచ్చి అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్తానని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప దగ్గరకు జ్యోత్స్న వచ్చి పుట్టగానే తన బావతో తనకు పెళ్లి అయిపోయిందని ఇప్పుడు సంప్రదాయం ప్రకారం పెద్దలు తాళి కట్టించి ఒకటి చేస్తున్నారని చెప్తుంది. తన భర్తతో ఎలా బతకాలి అనే విషయంపై కాలంతో కోటలు కట్టాను అని ఎవరైనా వచ్చి వాటిని కూల్చాలి అని చూస్తే ఊరుకోను అని, తన అదృష్టాన్ని ఎవరైనా లాక్కోవాలి అని చూస్తే వాళ్ల అంతు చూస్తానని జ్యోత్స్న హెచ్చరిస్తుంది. 

దీప: చూడు జ్యోత్స్న నిన్ను కావాలని ఎవరో రెచ్చగొడుతున్నారు. నీ అదృష్టాన్ని నీ నుంచి ఎవరూ దూరం చేయరు. కొంత మంది వాళ్ల వ్యక్తి గత స్వార్థాల కోసం నచ్చని మనుషుల్ని చెడ్డమనుషులుగా చిత్రీకరిస్తారు. వాళ్లు నేరుగా తాము అనుకునేది చేయలేక వేరే వాళ్లతో చేయిస్తారు. అది తప్పు. నేను వచ్చింది నీ పెళ్లి చూడటానికి అది అర్థం చేసుకో చాలు.
జ్యోత్స్న: ఈ మాట గుర్తు పెట్టుకో దీప. ఈ నిశ్చితార్థం జరగకపోయినా పెళ్లి జరగకపోయినా ఈ జ్యోత్స్న బతకదు. ఇది ఆవేశంతో అనడం లేదు. నా బావ లేని జీవితం నాకు వద్దు. 
దీప: జ్యోత్స్న ఇలా అంటుంది. కార్తీక్ బాబు పెళ్లి వద్దు అంటున్నాడు. ఇప్పుడు కార్తీక్ బాబు పెళ్లి ఆపితే హాస్పిటల్‌లో అన్న ఆ మాటలే నిజం అని వీళ్లు అనుకుంటారు. అప్పుడు నా పరిస్థితి నా బిడ్డ పరిస్థితి ఏంటి. ఇప్పుడు నేను ఏం చేయాలి. కార్తీక్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు.

కార్తీక్ తన తండ్రి రెండో కుటుంబం ఫొటో చూసి చిరాకు పడతాడు. ఇన్నేళ్లు నిజం తెలీకుండా బలే నాటకం ఆడావు నాన్న అనుకొని బాధ పడతాడు. ఇక కాంచన కార్తీక్‌ని పిలుస్తుంది. కార్తీక్ వచ్చే సరికి శ్రీధర్ ప్రేమగా కాంచనకు వడ్డిస్తుంటే కార్తీక్ చిరాకు పడతాడు. శ్రీధర్ తన చేతితో కాంచనకు తినిపిస్తాను అని తినపించబోతే కార్తీక్ ఆపి తాను తినిపిస్తాను అంటాడు. 

కార్తీక్: ఇనాళ్లు మీరు ప్రేమ చూపించి చూపించి నాకు కూడా అసూయ కలిగేలా చేశారు. ఇప్పుడు ఆ అసూయ పోగొట్టాలి.
శ్రీధర్: ఓహో నాతోనే పోటీ అన్నమాట.
కార్తీక్: మీరు నాతో పోటీ పడకండి నాన్న ఎందుకంటే మీకు మళ్లీ ఈ అవకాశం ఇవ్వను.
శ్రీధర్: చూశావా కాంచన కార్తీక్ ఎలా అంటున్నాడో. వీడి మాటలు ప్రవర్తన చూస్తుంటే నిజం వీడికి తెలిసిపోయినట్లే ఉంది. 

కార్తీక్ తనకు తినిపించడంతో కాంచన మురిసిపోతుంది. పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకే అర్థం కావడంలేదని కార్తీక్ అనుకుంటాడు. దీప జ్యోత్స్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. తాను తిరిగి రావడం వల్ల జ్యోత్స్న భయపడుతుంది అని దీప అనుకుంటుంది. కార్తీక్ నిజం ముందే చెప్పుంటే అసలు ఈ ఇంటికే రాకపోయేదాన్ని అనుకుంటుంది దీప. ఇక తాను ఇప్పుడు వెళ్లి పోయిన నింద తన మీదే పడుతుందని అనుకుంటుంది. ఇప్పుడు కార్తీక్ తీసుకొనే నిర్ణయం మీదే చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని అనుకుంటుంది. కార్తీక్ దీప మాటలు తలచుకొని బాధ పడతాడు. ఇక్కడ దీప ఆలోచనలో పడుతుంది. 

ఉదయం కాంచన కార్తీక్‌ని పిలిచి నిశ్చితార్థం గురించి మాట్లాడటానికి తాతయ్య పిలిచారు రమ్మని కార్తీక్‌ని పిలుస్తుంది. కార్తీక్ డల్‌గా ఉండటం చూసి నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. కార్తీక్ చూపు తేడా ఉందని శ్రీధర్ అనుకుంటాడు. కార్తీక్ కడుపులో ఉన్నప్పుడు కాంచనకు యాక్సిడెంట్ అయి కాళ్లు పోయావని అప్పటి నుంచి సుమిత్ర నిన్ను పెంచిందని కాంచన చెప్తుంది. తనకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టమని మీ పిల్లలతో నా ముచ్చట్లు తీర్చుకొని సంతోషంగా ఉంటాను అని కాంచన చెప్పగానే కార్తీక్ రెడీ అయి వస్తాను అని అంటాడు.

హాల్‌లో అందరూ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటారు. శ్రీధర్ నిశ్చితార్థం ఎవరికీ చెప్పకుండా సింపుల్‌గా చేద్దామన్నాడని చెప్తుంది. ఇంతోల మంగళ వాయిద్యాలతో తాంబూళం తీసుకొని కార్తీక్, కాంచన వాళ్లు వస్తారు. ఆడుకుంటున్న శౌర్య కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఈ రోజు పెళ్లా అని అడిగితే అవును పెళ్లి అని అంటాడు. అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని లోపలికి రమ్మని పిలుస్తాడు. జ్యోత్న్స, పారిజాతం టెన్షన్ పడతారు. ఏదో డౌట్‌గా ఉందని అంటాడు. శౌర్య నా కూతురు అన్నాడు కదా ఇప్పుడు దీప నా భార్య అనడు కదా అని అంటుంది. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు పెళ్లి అంటున్నాడు అంటే ఏంటని టెన్షన్ పడతారు. మన ఫ్యామిలీలో ఓ పర్సన్‌ తగ్గారని అన్న కార్తీక్ దీపని కూడా పిలిపించమని అంటాడు.  నా పరిస్థితి ఏంటి అని జ్యోత్స్న చాలా టెన్షన్‌ పడుతుంది. దీప కూడా అక్కడికి వచ్చేస్తుంది. కార్తీక్ అందరితో నా జీవితంలో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నాను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో అడుగుపెట్టబోతున్న సంయుక్త.. తనని మర్చిపోమని జానుతో చెప్పిన వివేక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget