![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో అడుగుపెట్టబోతున్న సంయుక్త.. తనని మర్చిపోమని జానుతో చెప్పిన వివేక్!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode తన తల్లి చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనని మర్చిపోమని వివేక్ జానుతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో అడుగుపెట్టబోతున్న సంయుక్త.. తనని మర్చిపోమని జానుతో చెప్పిన వివేక్! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today july 23rd episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో అడుగుపెట్టబోతున్న సంయుక్త.. తనని మర్చిపోమని జానుతో చెప్పిన వివేక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/725f19ba31db9014fea9f20fe48852931721708019775882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: సంయుక్త స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ మీదకు వస్తుంది. లక్కీ, జున్నులు సంయుక్తగా ఉన్న లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. లక్ష్మిని చూసిన జున్ను అది తన తల్లే అని అంటాడు. ఎందుకు అమ్మ అలాంటి డ్రస్ వేసుకుందని అడుగుతాడు. తను అమ్మ కాదు అని అర్జున్ జున్నుకి నచ్చచెప్తాడు. ఊరికే ఉండమని గొడవ చేయొద్దని అంటాడు. ఇక లక్కీ కూడా లక్ష్మీ గురించి చెప్పబోతే మిత్ర సైలెంట్‌గా ఉండమని వివేక్ని పాపని బయటకు తీసుకెళ్లమని అంటాడు. తను జున్ను వాళ్ల అమ్మ కాదని అంటాడు. ఇక లక్ష్మీ స్పీచ్ మొదలవుతుంది.
సంయుక్త: ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మా నాన్న కోరిక రెండోది మన సంసృతి సంప్రదాయాలు ఇక్కడ బంధాలు బాంధవ్యాల మీద ఇష్టం ఉండటం. ఇక్కడ భార్యభర్తల బంధం చాలా గొప్పది అది ఎవరూ విడదీయలేనిది. కుటుంబ వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది.
మనీషా: ఆంటీ తను సంయుక్త కాదు అని ఆ రూపంలో ఉన్న లక్ష్మీ అని నా అనుమానం.
అరవింద: అమ్మా సంయుక్త నీ స్పీచ్ చాలా బాగుంది. నువ్వు కోరుకునే బంధాలు బంధుత్వాలు మా ఇంట్లో ఉంటాయి. నువ్వు మా ఇంట్లో భోజనానికి రావాలి.
సంయుక్త: అలా అయితే ఎప్పుడో ఎందుకు రేపు వస్తాను ఆంటీ.
తన దగ్గర ఏమైనా దాస్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని జున్ను అర్జున్, జానులను అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు అని జాను చెప్తుంది. సంయుక్త తన తల్లి కాదు జాను చెప్తుంది. అయినా జున్ను నమ్మడు. ఇంట్లో అమ్మ ఉందా లేదా అని చూడటానికి వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్లి వసుంధరకు అమ్మ ఉందా లేదా అని అడుగుతాడు. అమ్మ ఇంట్లో లేదు అని ఫంక్షన్‌లో ఉన్నామే అమ్మ అని అడుగుతాడు. ఇంతలో లక్ష్మీ అమ్మ ఇక్కడే ఉందని జున్ను ఎదురుగా వస్తుంది. జున్ను తల్లిని వాటేసుకొని అక్కడ ఎవరు ఉన్నారు. ఆ ఆంటీ ఎవరో నీలాగే ఉందని అంటాడు. జున్నుతో పాటు అందరినీ మోసం చేస్తున్నాను అని లక్ష్మీ బాధ పడుతుంది. అర్జున్ సర్దిచెప్తాడు.
లక్ష్మీని జాను రేపు మిత్ర వాళ్ల ఇంటికి వెళ్తావా అక్క అని అడుగుతుంది. దానికి లక్ష్మీ వెళ్తాను అని నాతో పాటు నువ్వు రావాలి అని అంటుంది. జాను రాను అంటే ఆ ఇంటికి కాబోయే కోడలివి నువ్వు నాతో వచ్చి ఆ ఇంట్లో ఉండాలి అని అంటుంది. దానికి జాను దేవయాని గారు నన్ను చూస్తే మండి పడతారు. అక్కడ ఉండటం కష్టం అని జాను అంటుంది. జాను జానులా అయితే ఆ ఇంట్లో ఉండటం కష్టమని సంయుక్త మనిషిలా అయితే ఉండొచ్చని అర్జున్ ఐడియా ఇస్తాడు.
మిత్ర ఆలోచనలో పడతాడు. సంయుక్త నిజంగానే సంయుక్తనా లేక లక్ష్మీనా అని అనుకుంటాడు. తన గదిలో ఉన్న లక్ష్మీ ఫొటో తీసి చూస్తాడు. ఇంతలో మనీషా అక్కడికి వచ్చి మిత్ర చేతిలో లక్ష్మీ ఫొటో చూస్తుంది. మరచిపోయిన గుర్తులు గుర్తొస్తున్నాయి ఎందుకు అని ప్రశ్నిస్తుంది. దాంతో మిత్ర తను లక్ష్మి అని అనిపిస్తుందని అంటాడు.ఇక అందరూ సంయుక్త రాక కోసం ఎదురు చూస్తారు. సంయుక్త వస్తుందని రెడ్ కార్పట్ ఇంట్లో వేయిస్తారు. ఇక ముందు జాను ఆ ఇంటికి వస్తుంది. జాను బావగారు మామయ్యగారు అని వరసలు పిలిస్తే దేవయాని తిడుతుంది. అరవింద దేవయానిని తిడుతుంది. జాను మిత్రతో తనకు శాలరీ సరిపోక జాబ్ మానేశాను అని ఏదైనా జాబ్ తెలిసిన వాళ్ల దగ్గర ఉంటే ఇప్పించమని అంటుంది. దానికి మిత్ర జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఇక్కడే ఉండమని అంటాడు. ఇక మిత్ర సంయుక్త వెళ్లిపోయిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుదామని అంటాడు. ఇక వివేక్ జానుతో నా పెళ్లి అయితే నువ్వు ఏడవవు కదా నామీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడే తుడిచేయ్ నేను మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)