Karthika Deepam 2 Serial Today January 6th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఇంట్లో దీప వంటలు.. కాళ్లు మొక్కతా అన్న పారు.. రెస్టారెంట్ పెట్టిస్తానన్న జ్యోత్స్న.. నిజమేనా?
Karthika Deepam 2 Serial Today Episode దీప హోటల్ నుంచి సుమిత్ర టిఫెన్లు తీసుకొచ్చి ఇంట్లో వాళ్లకి పెట్టడం అందరూ లొట్టలేసుకొని తినడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటే ఎదురుగా శ్రీధర్ కారులో వస్తుంటాడు. తండ్రి కారు దిగి కార్తీక్ దగ్గరకు వచ్చి నువ్వు నీ సైకిల్ కొత్త లుక్ అదిరింది అని అంటాడు. అర్జెంట్‌గా వెళ్లాలి అని కార్తీక్ అంటే హో తొందరగా వెళ్లి టిఫెన్ కొట్టులో పొట్లాలు కట్టుకోవాలా అంటాడు. తాను కంపెనీ పెట్టుకోమని చెప్పినా వినకుండా ఇలాంటి పరిస్థితి ఏంటి అని అంటాడు. కోరి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావ్ అని అంటాడు.
శ్రీధర్: రెస్టారెంట్ పెట్టుకోమన్న తండ్రి మాట నచ్చలేదు కానీ ఇడ్లీ కొట్టు పెట్టుకోమన్న పెళ్లాం మాట నచ్చింది.
కార్తీక్: మేం ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోవడం లేదు. సొంతంగా మా కాళ్ల మీద నిలబడ్డాం. నిజం చెప్పాలి అంటే ఈ దరిద్రాలు అన్నీ మొదలైంది నీ వల్లే. అందమైన పూల వనం లాంటి ఇంట్లో గంజాయి మొక్కలా తయారయ్యావ్.
శ్రీధర్: నేను నీ తండ్రినిరా.
కార్తీక్: ఇంక ఆ విషయం ఎక్కడా చెప్పకండి. ఆ రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాడు మీ నాన్నేనా అంటున్నారా
శ్రీధర్: ఓహో నా వల్ల మీ పరువు పోతుందా.
కార్తీక్: పోవడానికి ఇంకేముంది ప్రాణాలు తప్ప. ఇంతకు ముందు ఎక్కడికేనా వెళ్తే నేను శివన్నారాయణ మనవడిని అంటే చాలా గౌరవం ఇచ్చేవారు. అందరూ మనల్ని పొగడటంతో మన కుటుంబం ఆకాశంలో శిఖరంగా కనిపించేది కానీ తమరి రెండో పెళ్లి దగ్గర నుంచి నేను ఇళ్లు వదిలి వచ్చే వరకు ఆ శిఖరం నేల మట్టం అయిపోయింది. భవిష్యత్లో మనం సాధించే విజయాలు గతాన్ని మార్చేస్తాయి.
శ్రీధర్: ఆ దీప నీ పక్కన ఉండగా అది నీకు జరగదులే. అది మీతో ఉన్నంత వరకు నువ్వు మీ అమ్మ సర్వనాశనం అయిపోతారు. నువ్వు అరిచినా గోల చేసినా నేను ఇదే చెప్తా. నువ్వు సరే అంటే నిన్ను ఇప్పుడే సైకిల్ నుంచి కారులోకి మార్చుతా.
కార్తీక్: ఇది నేను కొనుకున్న సైకిల్ ఇది ఎప్పుడూ ఇలాగే ఉండిపోను.
దాసు సుమిత్రను దీప టిఫెన్ కొట్టు దగ్గరకు తీసుకొస్తాడు. దీప టిఫెన్స్ ఆమ్ముతూ ఉంటే కాంచన అక్కడే ఉండి చట్నీలు వేయం చూసి సుమిత్ర బాధ పడుతుంది. వదిన అలా ఉండటం చూసి కన్నీరు పెట్టుకుంటుంది. ఎలా బతికిన తన వదిన ఎలా బతుకుతుందో అని దాసుతో చెప్పి ఏడుస్తుంది. ఇక దీపని చూపించి దీపని ఆ పరిస్థితిలో చూస్తే గుండె పిండేస్తుందని కార్తీక్‌ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది అనుకుంటే దేవుడు మళ్లీ ఇలా చేశాడని అంటాడు. ఇక దాసు ఆవేశంలో దీప తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెప్పేస్తాడు. సుమిత్ర దాసుని ప్రశ్నించేసరికి ఆత్మలుగా తన చుట్టూ ఉంటారని అంటాడు. ఇక సుమిత్ర తనకు దీపకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుందని అంటుంది. ఇక్కడ ఉండటం నావల్ కావడం లేదని వెళ్లిపోదాం అని సుమిత్ర అంటుంది.
ఇక సుమిత్ర దీప చేతి వంట తినాలి అని అంటుంది. దాంతో దాసు మరోవ్యక్తికి చెప్పి టిఫెన్ తీసుకురమ్మని చెప్తాడు. ఆయన తీసుకొచ్చి టిఫిన్ ఇస్తే వాసనకే నోరు ఊరిపోతుందని ఆటోలో కూర్చొనే సుమిత్ర అంటే వెనకాలే కార్తీక్ వచ్చి నోరు ఊరితే తినేయొచ్చు కదా అని అంటాడు. సుమిత్ర కార్తీక్‌ని చూసి చాలా సంతోషిస్తుంది. అందర్ని ఒక్క సారి చూసి నీకు మమకారం గుండెకు తాకినట్లుంది అందుకే కన్నీరు ఆగడం లేదని అంటాడు. ఇలా ఎలారా అన్ని వదిలేసి హ్యాపీగా ఉంటున్నారు అంటే దీపని చూపించి దీపం అలా వెలుగుతుంటే సంతోషంగా ఉన్నాం అని చెప్తాడు. అందరం మళ్లీ కలవాలి అని సుమిత్ర అంటే అవన్నీ జరుగుతాయిలే అంటాడు. ఇక దూరం నుంచి చూసి సంతోషపడుతావేంటి అని అంటే వదినతో మాట్లాడటానికి ముఖం చెల్లడం లేదని అంటుంది. కార్తీక్ ఆటోలో ఎవరితో మాట్లాడుతున్నాడని దీప, కాంచన అనుకుంటారు. కానీ సుమిత్రని చూడరు. కార్తీక్ రాగానే కాంచన ఎవరితో మాట్లాడావు అంటే కావాల్సిన వాళ్లు అని అంటాడు. టిఫెన్ తీసుకెళ్లారని అంటాడు.
జ్యోత్స్న పారిజాతం దగ్గరకు వెళ్లి లిఫ్స్టిక్ తింటావేంటి వచ్చి టిఫెన్ తిందామని అంటుంది. ఇక జ్యోత్స్న తండ్రి, తాతని కూడా తినడానికి పిలుస్తుంది. అందరూ రాకముందే సుమిత్ర వాళ్లకి దీప టిఫెన్ సెంటర్ నుంచి అని తెలీకూడదు అని ఫాస్ట్ ఫాస్ట్‌గా వాటిని సర్దేస్తుంది. టిఫెన్ గుమగుమలు అదిరిపోతున్నాయ్ అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పారిజాతం మీద పెద్దాయన సెటైర్లు వేస్తారు. జ్యోత్స్నతో పాటు అందరూ టిఫెన్స్ అదుర్స్ అని అంటారు. మన రెస్టారెంట్‌లో ఇలాంటి చట్నీలు పెట్టాలని అంటుంది. సుమిత్ర చేసిందని అందరూ పొగిడేస్తారు. ఈ టేస్ట్‌కి రెస్టారెంట్ స్థాయి ఉందా అంటే ఉంది అని అందరూ అంటారు. రోడ్ల పక్కన పెట్టే బండికి ఈ టేస్ట్ అంటే ఒప్పుకుంటారా అంటుంది. దాంతో ఇంపాజిబుల్ అని దశరథ్ అంటే దానికి పారిజాతం దండ వేసి దండ పెట్టొచ్చని అంటుంది. జ్యోత్స్న వాళ్లతో బ్రాంచ్ పెట్టొచ్చని అంటుంది. దాంతో సుమిత్ర ఈ టిఫెన్స్ దీప చేసిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!