అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today February 12th: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్ ముందే ఒక్కటైపోయిన సవతులు.. ఇక ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడి పని అయిపోయినట్లే!

Karthika Deepam 2 Serial Today Episode కాంచన దీపని తీసుకొని కావేరి దగ్గరకు వెళ్లడం కావేరి అక్కని చూసి ఎమోషనల్ అయి మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode నిజం తన దగ్గర చెప్పలేదని కార్తీక్ దీపని ప్రశ్నిస్తాడు. తన తండ్రి మాటలు వింటుంటే నెత్తురు బయటకు వస్తుందని అంటాడు. రెండో పెళ్లి  చేసుకున్నాడని ఆయన్ని మా అమ్మ వద్దనుకుంటే ఈ రోజు నీ కూతురి ప్రాణం నేను పెట్టిన భిక్ష అని నన్ను తల దించుకునేలా చేశాడని కార్తీక్ అంటాడు. 

కార్తీక్: ఏ మనిషి ముందు నేను తల దించకూడదు అనుకున్నానో ఆ మనిషి ముందే నా తల నరికేసినట్లయింది. నా ఆత్మాభిమానం మంట గలసేలా నాకు సజీవ దహనం చేసేశారు.
దీప: లేదు కార్తీక్ బాబు నా దేవుడికి మోసం చేసే అంత చెడ్డ మనసు నాకు లేదు.
కార్తీక్: నువ్వు నాకు ఇక ఏం చెప్పొద్దు. నీ గురించి అందరూ నాకు చెప్తున్నారు. ఆ స్థితిలో నువ్వు నన్నుఉంచావ్.
దీప: కావేరి గారిని ఇంత వరకు మీ అమ్మకి ద్రోహం చేసిన మనిషిగా మీరు చూశారు. చేసిన పాపానికి ప్రశ్చాత్తాపపడుతున్న మనిషిని నేను చూశాను. వేరొక ఆడదాని మాంగల్యం లాగేసుకున్నా అని ఆ మనిషి కుమిలిపోతుంది. నన్ను ఓదార్చడానికి కావేరి కారు హాస్పిటల్‌కి వచ్చారు. నీకే ఏం భయం లేదు శౌర్యకి ఏం కాదు అన్నారు. ఓదార్పు మాటలు నా కూతురిని బతికించలేవని అనుకున్నాను. మీ మంచి తనం గురించి నా కంటే ఎక్కువ అర్థం చేసుకున్న మనిషి ఆవిడ. మీ గురించి చెప్తూ కంట తడి పెట్టుకున్నారు. శౌర్యకి ఏం కాదు అని వెళ్లిపోయారు. తర్వాత మనకు పాప ఆపరేషన్ అని అన్నారు. డబ్బులు ఎవరు కట్టారో మీలాగే నాకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉంటే దూరంగా కావేరి గారు కనిపించారు. అప్పుడు నాకు అర్థమైంది. అంతకు ముందే తాను వచ్చినట్లు మీకు చెప్పొద్దు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఆవిడ డబ్బు కట్టారని. కానీ వెంటనే మీకు ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే అప్పటికీ నాకు పూర్తిగా నమ్మకం కుదరలేదు. తర్వాత ఆవిడను అడిగితే అప్పుడు ఒప్పుకున్నారు. అక్కకి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం అని అవిడ అన్నారు. ఏ సాయం చేయని మీ నాన్న అన్ని మాటలు అన్నారు కానీ సాయం చేసి కూడా కావేరి గారు ఏం మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా నా లాంటిదాని దగ్గర సాయం పొందడం మా అక్కకి కార్తీక్‌కి ఇష్టం ఉండదు అందుకే చెప్పలేదు.
కాంచన: మీ నాన్న చెప్పింది విన్నాం ఇప్పుడు దీప చెప్పింది విన్నాం. నిజం మనకు అర్థమైంది కదా. ఈ రోజు చంటిది మన ముందు సంతోషంగా ఉంది కాబట్టి ఇలా ఉన్నాం కానీ ఆ రోజు ఎలా ఉన్నాం. ఇందులో దీప తప్పు లేదురా.
కార్తీక్: ఇందులో ఎవరి తప్పు లేదు ఈ తప్పు నాదే దీన్ని నేనే సరిదిద్దుకుంటా.
కాంచన: దీప మనం చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పాలి.

జ్యోత్స్న గ్రానీతో అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారని అనుకుంటారు. దీప ఇంటికే వెళ్లుంటారని జ్యోత్స్న అంటుంది. ఇంతలో దశరథ్, సుమిత్ర వస్తారు. ఎక్కడికి వెళ్లారని అడిగితే సుమిత్ర జ్యోత్స్నని తిడుతుంది. అవసరానికి మించి మాట్లాడితే ఇలాగే ఉంటుందని దశరథ్ అంటాడు. జ్యోత్స్న తాతని చూడు తాత ఎలా వెళ్లిపోయారో అంటే దానికి దశరథ్ వాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం కాలేదు అనుకున్నావా అనుకొని టైం వచ్చే వరకు మాట్లాడకూడదని చెప్పి వెళ్లిపోతాడు. పారిజాతం జ్యోత్స్నతో తండ్రి మాట దాటని దశరథ్ మారిపోయాడని మీ తాత కూడా మారిపోతాడని అంటుంది. పరువు కోసం బతికే తాత మారడని జ్యోత్స్న అంటుంది. 

కావేరికి శ్రీధర్ ఈ రోజు విషయం తేలిపోవాలని డబ్బు గురించి అడిగితే కావేరి కోప్పడుతుంది. అది నా డబ్బు నా ఇష్టం అంటుంది. అంత డబ్బు కట్టి ప్రాణాలు కాపాడిన నిన్ను ఎవరూ థ్యాంక్స్ కూడా చెప్పలేదని అంటాడు. కాంచన 

శ్రీధర్: నువ్వు చేసిన సాయం విలువ వాళ్లకి తెలీదు. అదే తెలిసుంటే కాంచన నిన్ను నోరారా కావేరి అని పిలిచేది.
కాంచన: కావేరి.. 
కావేరి: అక్కా.
కాంచన: నీతో మాట్లాడటానికి వచ్చా లోపలికి రావొచ్చా.
శ్రీధర్: రాకూడదు.
కావేరి: రావొచ్చు అక్క ఇది మన ఇళ్లు నువ్వు అసలు పర్మిషన్ అడగడం ఏంటి అక్క.
శ్రీధర్: ఇక్కడ నేనొకడిని ఉన్నాను.
కావేరి: అక్క మిమల్ని పర్మిషన్ అడగలేదు. అన్నింటికీ భూత పేరంటంలా అడ్డు పడొద్దు. ఆయన అలాగే అంటారు మీరు రండి అక్క.
శ్రీధర్: గతం మర్చిపోకు. వ్రతానికి నిన్ను పిలవడం చిన్నతనం అని గడపకు బొట్టు పెట్టి వెళ్లిపోయింది పెద్ద మేడం.
కావేరి: ఈయనకు మతి సరిగా లేదులే అక్క మీరు లోపలికి రండి. దీప నువ్వు అలా కూర్చొ.
శ్రీధర్: అంత మర్యాద అవసరం లేదు.
కావేరి: దీప నా కోడలు. 
శ్రీధర్: అన్ని దరిద్రాలు నాకే.
కావేరి: అక్క కాఫీ తెస్తా.

కాంచన కావేరి చేయి పట్టుకోవడంతో కావేరి ఎమోషనల్ అవుతుంది. నువ్వు వచ్చి నన్ను పేరు పెట్టి పిలవడం నా చేయి పట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది కావేరి. కాంచన కూడా ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ఇప్పుడేం మాట్లాడినా చేసిన సాయానికి నాకు కృతజ్ఞత చెప్పినట్లు ఉంటుందని అంటుంది. దానికి కావేరి నా కూతురిని నువ్వు నీ కూతిరిలా చూసుకున్నప్పుడే నా తప్పు నాకు అర్థమైందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP DesamSRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CM Chandrababu: సత్యసాయి జిల్లాలో  రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
Embed widget