గార్డెన్ టిప్స్

గులాబీ మొక్కలకు ఆ ఒక్కటి వేస్తే పూలు బాగా పూస్తాయట

Published by: Geddam Vijaya Madhuri

గులాబీలను చాలామంది ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. అయితే అవి మరింత బాగా పెరగాలంటే ఒక్క టిప్ ఫాలో అయితే చాలట.

టీ పెట్టిన తర్వాత ఆ టీ ఆకులు, టీ పొడిని పడేస్తూ ఉంటారు కదా. దానిని గులాబీ మొక్కలకు వేస్తే చాలా మంచిదట.

ఉపయోగించిన టీ ఆకులను గులాబీ మొక్కలకు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

టీ పొడిలలోని నత్రజని, భాస్వరం, పొటాషియం మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి గులాబీ మొక్కల పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

సేంద్రియ ఎరువుగా దీనిని వినియోగించడం వల్ల గులాబీ మొక్క పెరుగుదల బాగుంటుంది.

టీ ఆకుల్లోని టానిక్ ఆమ్లం మొక్కకు, కాండానికి బలాన్ని అందిస్తుంది.

గులాబీ పువ్వుల కాపును కూడా పెంచడంలో టీ పొడి మంచి ఫలితాలు ఇస్తుంది.

మరికొందరు ఉల్లిపాయ తొక్కలు, గుడ్డుపై పెంకులను కూడా గులాబీ మొక్కలకు ఎరువుగా వాడుతారు.

మొక్కకు ఎండ తగిలేలా పెడితే మంచి గ్రోత్ ఉంటుంది.