Karthika Deepam 2 Serial Today December 12th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి సుపారీ ఇచ్చిన జ్యోత్స్న.. జ్యో ముందే ఫోన్‌లో కార్తీక్, దీపల రొమాంటిక్ ముచ్చట్లు!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న ముందు కార్తీక్ దీపతో ఫోన్‌లో రొమాంటిక్‌గా మాట్లాడి జ్యోత్స్న ఫీలయ్యేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న, కార్తీక్‌లు మాత్రమే అర్థరాత్రి అయినా ఆఫీస్‌లో ఉంటారు. జ్యోత్స్న డైవర్‌కి ఇంటికి వెళ్లిపోమని తాను బావతో వస్తానని చెప్తుంది. ఇక కార్తీక్‌ని దూరం నుంచి చూసుకుంటూ మురిసిపోతుంది. బావతో ఇంటి కెళ్దాం పద బావ మిగతా వర్క్ తర్వాత చేయొద్దని అంటుంది. దాంతో కార్తీక్ రెండు నిమిషాలు ఆగు అని చెప్పి వర్క్ అంతా పూర్తి అయిపోయింది చెక్ చేసుకో అంటాడు. నన్ను డ్రాప్ చేయ్ అని జ్యోత్స్న అంటే నేను అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి అంటాడు. ఇంతలో దీప కాల్ చేస్తే ఇప్పుడు జ్యోత్స్నతో ఆడుకుంటానని మనసులో అనుకుంటాడు.
కార్తీక్: మా ఆవిడ ఫోన్ చేసింది. దీపా చెప్పు.
దీప: బాబు రోజూ ఈ టైంకి వచ్చేసే వారు ఈ రోజు రాలేదు.
కార్తీక్: ఏంటి నేను రాలేదని భోజనం చేయకుండా ఇంటి బయట వెయిట్ చేస్తున్నావా. నీకు ఎన్ని సార్లు చెప్పాను దీప తొందరగా భోజనం చేయమని. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా.
దీప: నేనేం అడిగాను కార్తీక్ బాబు ఏం చెప్తున్నారు.
కార్తీక్: ఈరోజు ఎందుకు ఆఫీస్ లేటు అయిందా మా కొత్త సీఈవో గారు వారం పని ఈ ఒక్క రోజులోనే చేయించేశారు.
దీప: ఓహో జ్యోత్స్న ఇబ్బంది పెడుతుందన్నమాట.
జ్యోత్స్న: నేను టార్చర్ పెడుతున్నానని దీపకి తెలియాలి చెప్పావా తెలియని ఇది టార్చర్ కాదు నా ప్రేమ.
కార్తీక్: ఇంకేంటి దీప ఈ రోజు ఏం వండావ్ పాలక్ పన్నీరా సూపర్ సూపర్ అది అంటే మనద్దరికీ ఇష్టం కదా. ఏంటన్నావ్ గట్టిగా చెప్పు మళ్లెపూలా అది నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయాలా చెప్పు తీసుకొస్తా. రేపు నేను ఆఫీస్‌కి వెళ్లక్కర్లేదు ఇలా ఓవర్ టైం చేస్తే రేపు ఆఫీస్ లీవ్ తీసుకోవచ్చు.
జ్యోత్స్న: ఇన్ డైరెక్ట్‌గా రేపు రాను అని చెప్తున్నాడు.
దీప: జ్యోత్స్న పక్కనే ఉందనకుంటా ఇలా మాట్లాడుతున్నారు.
జ్యోత్స్న: మీ ప్రేమ ముచ్చటలు అయ్యాయా బావ నన్ను డ్రాప్ చేయ్.
కార్తీక్: క్యాబ్ బుక్ చేసుకో బాయ్.. సారీ ఒక మాట చెప్పడం మర్చిపోయా అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి ఎందుకు అన్నావ్ కదా మా ఆవిడ కోసం మా ఆవిడ వెయిటింగ్. దీప దీపా వచ్చేస్తున్నా దీప.
జ్యోత్స్నని కార్తీక్ వదిలేసి వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఇక దీప కార్తీక్ కోసం వెయిట్ చేసి హాల్‌లోనే పడుకుండిపోతుంది. కార్తీక్ చూసి నిద్ర లేపుతాడు. ఇక ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. కార్తీక్ బాగా అలసిపోయి తల నొప్పిగా ఫీలవడం దీప గమనిస్తుంది. తన వల్లే జ్యోత్స్న కార్తీక్‌ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటుంది. ఇక తిన్న తర్వాత కార్తీక్‌కి దీప తలనొప్పి మందు రాస్తుంది. జ్యోత్స్నకి మీరు కావాలి మిమల్ని పెళ్లి చేసుకునే వరకు వదిలేదు అని చెప్తుంది. జ్యోత్స్నని పెళ్లి చేసుకోమని దీప చెప్తే కార్తీక్ తల నొప్పి మందు తీసుకొని నేనే రాసుకుంటా ఇచ్చేసి వెళ్లిపో అంటాడు.
ఉదయం జ్యోత్స్న, పారిజాతం రౌడీల దగ్గరకు వస్తారు. ముందు నాకు ఎందుకు చెప్పలేదు అని పారిజాతం జ్యోత్స్న మీద సీరియస్ అవుతుంది. ఇంతలో రౌడీ వస్తాడు. వాడికి దీప ఫొటో ఇచ్చి మిగతా వివరాలు మెసేజ్ చేశా ఈమె ఈరోజే చనిపోవాలని చెప్పి అడ్వాన్స్ ఇస్తుంది. పని అయితే ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తుంది. పారిజాతం టెన్షన్ పడుతుంది. ఉన్నట్టుండి దీపని చంపడం ఎందుకే అని అంటుంది. దీప చావాలి అని పారిజాతం కూడా మనసులో అనుకుంటుంది. ఇక ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీపకి ఆ రౌడీ కాల్ చేసి స్కూల్ అటెండర్ అని పాప ఆడుకుంటూ గ్రౌండ్‌లో పడిపోయిందని తొందరగా రమ్మని చెప్తాడు. దీప కంగారు పడుతూ విషయం అనసూయకి చెప్పి స్కూల్‌కి పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకే చోట కనకం, విహారి.. వెనకాలే సహస్ర.. యమునకు ఘోర అవమానం!