Karthika Deepm Actress: 'కార్తీక దీపం' నటికి చేదు అనుభవం - ఫ్రాడ్ కేసులో ఆమె పేరు!, డీఎస్పీ నుంచి ఫోన్.. చివరికి
Actress Usha Rani: కార్తీక దీపం నటికి చేదుకు అనుభవం ఎదురైంది. ఓ ఫ్రాడ్ కేసులో తన నంబర్ ఉందంటూ డీఎస్సీ నుంచి ఫోన్ వచ్చిందంటూ వీడియో షేర్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది.
Karthika Deepam Actress Usha Rani Shared Video on Online Fraud: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగాయి. ముఖ్యం బ్యాంక్ ఆన్‌లైన్ లావాదేవిలపై సైబర్ నేరగాళ్లు కన్నేసి కోట్టు కోట్లు కోట్టేస్తున్నారు. ఈ మోసాలకు సాధారణ ప్రజలతో పాటు సలబ్రిటీలు సైతం బలి అవుతున్నారు. ప్రముఖ సంస్థ, పోలీసుల పేర్లతో ఫోన్ చేసి ఓటీపీ(వన్ టైమ్ పాస్‌వర్డ్) అడుగుతున్నారు. అది చెప్పారంటే క్షణాల్లో మన అకౌంట్ ఖాళీ అవుతుంది. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్న అక్కడక్కడ ఇంకా ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు
ఇక తాజాగా ఓ టీవీ నటి సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఆమె 'కార్తీక దీపం' సీరియల్ నటి ఉషా రాణి. గుర్తు తెలియని వ్యక్తి డీఎస్పీ అంటూ ఫోన్ చేసి ఓటీటీ వివరాలు అడిగినట్టు చెప్పింది. ఈ మేరకు ఆమె వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ఉషా రాణి ఇలా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ "ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు పర్సనల్ ఓ ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఒక ఐసీఐసీఐ (icici) క్రెడిట్ కార్డ్ ఉండేది. దానితో దాదాపు రూ.5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దాన్ని మా అబ్బాయి ఓ రోజు షాపింగ్‌కి తీసుకువెళ్లి ఎక్కడో పొగొట్టాడో, ఏం చేశాడో తెలియదు.
View this post on Instagram
డీఎస్పీని అంటూ ఫోన్
అయితే వాడు ఒక్కొసారి కార్డ్‌ని ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఏదో ప్యాంట్ జెబులో ఉండి ఉంటుందిలే అని నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ కార్డు బిగ్ బాస్కెట్, అమోజాన్‌కి లింక్ అయి ఉండటం వల్ల నా షాపింగ్‌కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని కార్డు గురించి పెద్దగా ఆలోంచలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో 'నేను డీఎస్పీని మాట్లాడుతున్న అన్నారు. అవతలి వ్యక్తి 'మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఓ ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఈ కేసును క్యాన్సిల్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది. అది షేర్ చేయండి' అని అడిగారు. కాసేపు ఆలోచించాను. అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే చెపుతుంటారు కదా.
ఆఫీసుకి వస్తా అన్నాను
మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారని అడిగాను. నేనే ఆఫీసు వచ్చి చెప్తాను అనడంతో ఆ వ్యక్తి కాల్ కట్ చేశారు. కాసేపటికి నా వాట్సప్ నా పేరుతో ఉన్న ఒక బిల్లు పెట్టారు. అందులో నా పేరు, మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్‌తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. అది చూడగానే నేను షాక్ అయ్యాను. ఇది ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందో అని వెంటనే అలెర్ట్ అయ్యి బ్యాంక్‌కి వెళ్లి ఆ కార్డు బ్లాక్ చేయించాను. కాబట్టి ఇలా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి షేర్ చేసి మోసపోకండి" అంటూ ఆమె అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక తనకు ఎదురైన అనుభవాన్ని అందరితో షేర్ చేసిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.