Karthika Deepam 2 Serial Today May 24th : ‘కార్తీకదీపం 2’ సీరియల్: కేసు విత్ డ్రా చేసుకున్న కార్తీక్ – దీపను నరసింహకు విడాకులివ్వమన్న సుమిత్ర
Karthika deepam 2 Today Episode: కార్తీక్, దీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు విత్ డ్రా చేసుకోవడంతో పోలీసులు నరసింహను వదిలేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Karthika Deepam 2 Serial Today May 24th : ‘కార్తీకదీపం 2’ సీరియల్: కేసు విత్ డ్రా చేసుకున్న కార్తీక్ – దీపను నరసింహకు విడాకులివ్వమన్న సుమిత్ర Karthika deepam 2 serial today episode May 24th written update Karthika Deepam 2 Serial Today May 24th : ‘కార్తీకదీపం 2’ సీరియల్: కేసు విత్ డ్రా చేసుకున్న కార్తీక్ – దీపను నరసింహకు విడాకులివ్వమన్న సుమిత్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/bed31156cac241e380137197612859e61716514349856879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika deepam 2 Serial Today Episode: 'నరసింహను పోలీసులకు పట్టించింది కార్తీకేనని తెలిసిపోయింది కదా ఇప్పుడేమంటావు' అంటూ జ్యోష్ణ వాళ్ల అమ్మను నిలదీస్తుంది. 'బావకు ఏ సంబంధం లేని దీప విషయంలో ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి కనీసం కేసు పెట్టేటప్పుడైనా నీకు చెప్పాలి కదా' అంటుంది. 'అసలు బావ మనసులో నా స్థానం ఏంటని నాకనిపిస్తుంది అంటూ బాధపడుతుంది' జ్యోష్ణ. 'నా బిడ్డతో అసలు మాట్లాడొద్దని చెప్పావు కదా ఇప్పుడు చూడు నీ కూతురినే నీకు శత్రువుగా తయారు చేశాను' అని మనసులో అనుకుంటుంది పారిజాతం. ఇంతలో ధశరథ్ వస్తాడు.
ధశరథ్: బావ నాకు అన్నీ చెప్పాడు. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాడెలాంటి వాడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ప్రతిదీ బూతద్దంలో చూడకు
పారిజాతం: నేను నాలుగు మాటలు చెప్పి దీన్ని నా వైపు తిప్పుకున్నాను అనుకునేలోపే ఎవరో ఒకరు వచ్చి దీన్ని మార్చేస్తారు. ( అని మనసులో అనుకుంటుంది.)
మరోవైపు నరసింహ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉంటాడు. శోభ, అనసూయమ్మ స్టేషన్ బయట నిలబడి ఉంటారు. 'అది అమాయకురాలు కాదత్త అని నేను ఎంత చెప్పినా మీరు వింటారా?' అని శోభ మాట్లాడుతుండగానే కార్తీక్, దీప స్టేషన్‌కు వస్తారు. కార్తీక్ కేసు వాపస్ తీసుకోవడంతో పోలీసులు నరసింహను వదిలేస్తారు.
దీప: అత్తయ్యా ఏం జరిగిందో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి.
అనసూయ: నువ్వేంటో అర్థ చేసుకోవడానికి ఇంతకు మించి తెలియాల్సిన అవసరం లేదు. ( దీప అనాథ అన్న విషయం గుర్తు చేసుకుంటుంది అనసూయ) పొరపాటు చేశాడు, నా తమ్ముడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. నీ విషయంలో చాలా చాలా పెద్ద పొరపాటు చేశాడు.
కార్తీక్: ఇప్పుడు మీకు సంతోషమే కదా పదండి వెళదాం..
దీప: నేను మీతో మాట్లాడాలి బాబు. ఇంటి దగ్గర మీ అమ్మగారు, నాన్నగారు ఉన్నారని మీతో మనఃస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను బాబు.
అంటూ దీప కార్తీక్‌ను 'నాకు సాయం చేయమని నిన్ను వేడుకున్నానా?' అంటూ నిలదీస్తుంది. 'వాడ్ని కేసు పెట్టి ఇంకా రెచ్చగొట్టారు. ఇంకో సారి నా విషయంలో కలగజేసుకోకండి' అంటూ చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత అనసూయ చెప్పిన నా తమ్ముడు తప్పు చేశాడని అన్న మాటను గుర్తు చేసుకుంటుంది. తమ్ముడంటే అత్తయ్యకు చాలా ఇష్టం, అటువంటి అత్తయ్య తమ్ముడు తప్పు చేశాడని అంది అంటే అని ఆలోచిస్తుండగానే సుమిత్ర వస్తుంది.
దీప: రండమ్మా కూర్చోండి నేనే మీ దగ్గరకు రావాలనుకున్నాను. జరిగిన దానికి మిమ్మల్ని క్షమాపణ అడగాలి. నా వల్లే మీకు ఇదంతా జరిగింది.
సుమిత్ర: జరిగిందంతా కార్తీక్ చెప్పాడు దీప. కేసు వెనక్కి తీసుకుని వాణ్ని వదిలేశారు. కానీ టిఫిన్ సెంటర్ దగ్గర జరిగిన అవమానానికి వాణ్ణి జైలుకు పంపించాల్సింది. నీ విషయంలో నిన్ను అడక్కుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
దీప: ఏంటమ్మా..
సుమిత్ర: నీ భర్తతో నువ్వు విడాకులు తీసుకో… వాడు కట్టిన తాళి నీ మెడలో ఉందన్న అహంకారంతోనే కదా నిన్ను ఇన్ని బాధలు పెడుతున్నాడు. విడాకులు తీసుకుని వాడు కట్టిన తాళి వాడి ముఖాన్నే కొట్టు..
అని సుమిత్ర చెప్పగానే దీప షాక్ అవుతుంది. అలా నేను చేయలేనని చెప్తుంది. దీంతో నా కూతురు భవిష్యత్తు ముడిపడి ఉంది. అనగానే సుమిత్ర ఎన్నో రకాలుగా దీపను కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దీప కన్వీన్స్ కాదు. మరోవైపు కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. దీపకు శ్రేయోభిలాషిగా ఉంటానని.. ఆ నరసింహ గాడ్ని మాత్రం వదిలే ప్రశక్తే లేదని అనుకుంటాడు. మరోవైపు అనసూయ, నరసింహ, శోభ ముగ్గురూ కలిసి కార్తీక్, దీప గురించి మాట్లాడుకుంటుంటారు. దీప ఇలా చేస్తుందంటే అసలు ఊరే దాటనిచ్చే దాన్ని కాదని అనసూయ అనగానే అది ఆ కార్తీక్ గాడితో సంబంధం పెట్టుకుంది కాబట్టే ఊరు దాటిందని నరసింహ అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ:హేమ డ్రగ్స్ కేసుపై మాట్లాడిన కరాటే కళ్యాణి | ABP DESAM
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)