Karthika deepam 2 Serial Today August 17th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: దాసును ఇంట్లోంచి గెంటివేసిన శివనారాయణ – స్వప్నను అనుమానించిన కావేరి
Karthika deepam 2 Today Episode: కూతురి కోసం ఇంటికి వచ్చిన దాసును కోపంతో శివనారాయణ ఇంట్లోంచి గెంటివేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Karthika deepam 2 Serial Today Episode: దశరథ కూతురు బతికే ఉంది. ఇప్పుడు నేను వచ్చింది నా కూతురు కోసమేనని నా కూతురిని చూడాలని అంటాడు దాసు. అన్నయ్య కూతురు నా కూతురే. అప్పుడు దశరథ అన్నయ్య అన్నాడు కదా నాకు కూతురు పుట్టింది అది నీ మనవరాలే అని. తనని చూడటానికి వచ్చాను తనని చూస్తే నా కూతురిని చూసినట్టే ఉంటుందని అంటాడు దాసు. ఇంతలో జ్యోష్ణ కిందకి వస్తుంది. జ్యోష్ణను చూసిన దాసు షాక్ అవుతాడు. రెస్టారెంట్‌లో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటాడు దాసు. ఇంతలో ధశరథ వచ్చి దాసును ప్రేమగా పలకరిస్తాడు. భోజనం చేద్దాం రమ్మని పిలిస్తే వద్దు ఆకలిగా లేదని అంటాడు దాసు.
దశరథ: నీ కొడుక్కి నువ్వైనా చెప్పు పిన్నీ భోం చేయమని.. అమ్మా జ్యోష్ణ.. దాసు నీకు బాబాయ్ అవుతాడు.
శివనారాయణ : ఎవర్రా బాబాయ్… మళ్లీ ఎందుకు వచ్చావురా..? నీకు ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు. ఉంది అనుకున్న వాళ్ళు తనతో పాటు వెళ్లిపోవచ్చు. ఇలాంటి వాళ్ళను ఉంచాల్సింది గేటు బయట ఇంటి లోపల కాదు.
దాసు: నన్ను క్షమించండి..
అని దాసు, శివనారాయణను అడగ్గానే పారిజాతం మాత్రం తనన కొడుకుని శివ నారాయణ అవమానించడం చూసి బాధపడుతుంది. శివనారాయణ మాత్రం దాసును వెంటనే వెళ్లిపోమ్మని గద్దిస్తాడు. అయితే మిమ్మల్ని అందర్నీ చూడాలనిపించి వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాడు ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరి సారి. మళ్ళీ వస్తే తల్లితో తిరిగి వెళ్లాల్సి వస్తుందని శివనారాయణ, పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. బయటకు వెళ్తున్న దాసు నా కూతురు ఎంతో పద్ధతిగా పెరిగి ఉంటుంది అనుకున్నా కానీ అలా లేదు. పెంపకంలో ఏదో తప్పు జరిగింది. అనుకుంటూ వెళ్తున్న దాసు అవుట్ హౌస్ లో ఆడుకుంటున్న శౌర్య చూస్తాడు. అక్కడే అక్కడే కుబేర ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసే లోపు పారిజాతం, దాసును వెనక్కి తీసుకెళ్తుంది.
పారిజాతం: నన్ను క్షమించు దాసు నీ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. ఈ ఇంటికి నువ్వు మళ్ళీ రావొద్దు. ఆ మనిషి చీదరించుకోవడం నేను చూడలేను.
దాసు: సరేనమ్మా.. కానీ జ్యోత్స్న నన్ను కొట్టింది.. తను జాగ్రత్త అమ్మా..
అని దాసు వెళ్లిపోతుంటే నా కొడుకును నాకు దూరం చేశావ్ కదా నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అని మనసులో అనుకుంటుంది పారిజాతం. మరోవైపు స్వప్న ఫోన్ మాట్లాడటం చూసి అనుమానిస్తుంది కావేరి. వెళ్లి స్వప్న ఫోన్ చెక్ చేసేందుకు ట్రై చేస్తుంది.
స్వప్న: అమ్మా నా మీద నమ్మకం లేదా? నేను అలాంటి దాన్ని కాదమ్మా..?
కావేరి: నేను మొదట ఇలాగే ఉండేదాన్ని కానీ మీ నాన్న విషయంలో మోసపోయాను.పెళ్ళికి ముందే మీ నాన్న మొదటి పెళ్లి గురించి తెలిసింది. కానీ అప్పటికే నేను మూడు నెలల గర్భవతిని ప్రేమించిన వాడిని వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. నాలాంటి బతుకు నీకు వద్దు గౌరవంగా బతకాలి. స్వప్న నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా?
స్వప్న: అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తానమ్మా..? కానీ ఒక్కటి మాత్రం నిజం నీ కూతురు ఎప్పటికీ తప్పు చేయదమ్మా.
అంటూ వాళ్ల నాన్న వేరే ఆవిడతో కారులో ఉండటం చూశానని అప్పుడే డాడీ మీద అనుమానం వచ్చిందని ఇదే విషయం నిన్ను అప్పుడే అడుగుదామనుకున్నానని స్వప్న చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఆషికా రంగనాథ్ స్టన్నింగ్ లుక్ - పింక్ చీరలో మతిపోగోడుతున్న కన్నడ బ్యూటీ