Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారికి ఐలవ్‌యూ చెప్పేసిన లక్ష్మీ! మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 25th కనకం రౌడీల నుంచి తప్పించుకొని విహారి దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ క్షేమంగా బయట పడాలి అని విహారి లక్ష్మీ కోసం శివుడికి కావిళ్లతో నీటిని మోసి అభిషేకం చేస్తాడు. కొడుకు బాధని చూసి యమున కుమిలిపోతుంది. యమునని చారుకేశవ ఇంటికి వెళ్లిపోమని విహారి పూజ అవ్వగానే లక్ష్మీ జాడ తెలుసుకొని వస్తామని చెప్పి యమునని పంపేస్తాడు. ఏడుస్తూ యమున వెళ్లిపోతుంది.
విహారి శివుడికి అభిషేకం చేయడంతో కిడ్నాపర్ల దగ్గరున్న లక్ష్మీ కళ్లు తెరుస్తుంది. చారుకేశవ విహారి దగ్గరకు వెళ్లి సంధ్యకి కాల్ చేసి లక్ష్మీ గురించి తెలుసుకోమని అంటాడు. సంధ్య లక్ష్మీ సొంతూరు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. అక్కడెందుకు ఉన్నారు అని విహారి అడిగితే సంధ్య చెప్పే టైంకి ఫోన్ సిగ్నల్ లేక కట్ అయిపోతుంది. సంధ్యతో కానిస్టేబుల్ ఎస్‌ఐ గారు ఆదికేశవ్ గారి ఇంటికి వెళ్లారు అనడంతో సంధ్య పరుగున వెళ్తుంది.
ఎస్‌ఐ ఆదికేశవ్ దగ్గరకు వెళ్లి మీ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. కదా అని లక్ష్మీ ఫోటో తీసి లక్ష్మీ కనిపించడం లేదు అని అనేసరికి ఆదికేశవ్ బ్యాగ్ పడేసి షాక్ అయిపోతారు. ఇంతలో సంధ్య వచ్చి లక్ష్మీ పాస్ పోర్ట్ కనిపించడం లేదు అని కవర్ చేస్తుంది. కొత్త పాస్‌పోర్ట్ కోసం వెరిఫికేషన్ కోసం వచ్చామని చెప్తుంది. సంధ్య ఎస్‌ఐ తీసుకెళ్లి తను షీ టీమ్ ఎస్‌ఐ అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. ఆదికేశవ్ గారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని అందుకే విషయం చెప్పొద్దని అంటుంది.
విహారి ఆదికేశవ్ కాల్ చేయడంతో విహారి చాలా కంగారు పడతాడు. లక్ష్మీ గురించి అడిగితే ఏం చెప్పాలో అని అంటాడు. కంగారు పడకుండా ఏదో ఒకటి చెప్పు అని చారుకేశవ అంటాడు. ఆదికేశవ్ విహారితో మాట్లాడి కనకం గుర్తొస్తుందని ఈ మధ్య తను ఫోన్ చేయడం తగ్గించేసిందని అంటాడు. విహారి కన్నీరు పెట్టుకుంటాడు. ఒక్క సారి లక్ష్మీ ఉంటే పిలవండి అల్లుడుగారు మాట్లాడుతా అని ఆదికేశవ్ అంటే నేను బయట ఉన్నా అని విహారి అంటాడు. లక్ష్మీ పాస్ పోర్ట్ పోయిందని వెరిఫికేషన్‌కి ఎస్‌ఐ గారు వచ్చారని ఆదికేశవ్ చెప్తాడు.
విహారి సంధ్యకి కాల్ చేస్తే సంధ్య విహారితో లక్ష్మీ మిస్సింగ్ కోసం అన్ని స్టేషన్లకు వ్యాక్స్ పంపారని జరిగింది చెప్తుంది. రాత్రి లక్ష్మీకి మెలకువ వస్తుంది. రౌడీలు పడుకోవడంతో కట్లు విప్పికొని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మీ ఉన్న ఏరియాలోకే విహారి లక్ష్మీని వెతుక్కుంటూ వస్తాడు. విహారి వెతుకుతూ ఉంటే లక్ష్మీ డోర్ తీసుకొని బయటకు వస్తుంది. విహారి లక్ష్మీని చూస్తాడు. లక్ష్మీని అని విహారి పిలిస్తే లక్ష్మీ ఇక్కడకాదు పదండి అని కారు దగ్గరకు తీసుకెళ్తుంది.
లక్ష్మీ విహారిని చూసి హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్లిపోయావ్ కనకం అని విహారి బాధ పడతాడు. నువ్వు కనిపించకపోయే సరికి నా ప్రాణం పోయే అంత పని అయింది ఇదే నిజమైన ప్రేమ అని అంటాడు. లక్ష్మీ విహారిని చూసి ఈ రెండు రోజులు చాలా భయం వేసింది. మిమల్ని చూడకుండా కలవకుండా చనిపోతా అని భయం వేసింది.. విహారి గారు నేను మిమల్ని చాలా బాధ పెట్టాను సారీ.., మీకు ఓ మాట చెప్పకుండా చనిపోతానేమో అని భయం వేసి నాలో దాచుకున్న ఆ మాట మీరు వినాలి అనుకున్న మాట ఇప్పుడు చెప్తాను అని విహారి గారు మిమల్ని మొదటి సారి చూసిన క్షణమే మీరు నాకు నచ్చేశారు.. ఆ ఇష్టం పెరిగి పెరిగి నా ప్రాణం అయిపోయింది. నా ప్రాణం కంటే ఎక్కువగా మిమల్ని ప్రేమిస్తున్నాను.. ఐలవ్‌యూ విహారి గారు అని లక్ష్మీ విహారిని హగ్ చేసుకొని ఐలవ్‌యూ చెప్తుంది. తీరా చూస్తే ఇదంతా విహారి ఊహ.. లక్ష్మీ నీ కోసం నేను పిచ్చోడిని అయిపోతున్నా నువ్వు ఎక్కడ లక్ష్మీ అని విహారి అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















