అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి వెనక ఏదో స్టోరీ ఉందని ఫొటోతో ఎంక్వైరీ మొదలు పెట్టిన అంబిక..!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి పెళ్లి గెటప్‌లో ఉన్న ఫొటో తీసుకొని అంబిక స్టూడియోకి ఎంక్వైరీకి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి పెళ్లి ఫొటో సహస్రకి దొరకడంతో ఆ ఫొటో చూసి ఇంట్లో అందరూ విహారిని ప్రశ్నిస్తారు. దాంతో పెళ్లి గెటప్లో ఎలా ఉంటానో చూద్దామని ఏఐతో ఫోటో చేయించానని విహారి కవర్ చేస్తాడు. ఈ ఫొటో నీకు ఎవరు ఇచ్చారని విహారి సహస్రని అడిగితే హాస్పిటల్‌లో దొరికిందని అంటాడు.. ఇక సహస్ర తల్లితో అమ్మా బావ అన్నీ ప్లాన్‌గా చేస్తున్నాడని మా పెళ్లి కోసం అన్నీ సరిగ్గా ప్లాన్ చేయాలనే ఇలా చేశాడని చెప్పి విహారిని తీసుకొని గదిలోకి వెళ్తుంది. 

నిజం బయట పడనందుకు లక్ష్మీ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక సహస్ర విహారిని గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చొపెడుతుంది. విహారి గాయాలకు ఇబ్బంది పడుతుంటే సహస్ర చూసి ఏడుస్తుంది. ఏమైందని విహారి అడిగితే నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాని ఏడుస్తుంది. నిన్ను ఇలా చూసి తట్టుకోవడానికి కష్టంగా ఉంది బావ అని చెప్తుంది. విహారికి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్లబోతూ విహారి చేయి పట్టుకొని బావ ఐ లవ్‌యూ అని చెప్తుంది.  

విహారి: నా అనే వాళ్ల దగ్గరకు నిజం దాచి అబద్ధం చెప్పాల్సి వస్తే అంత కంటే నరకం మరొకటి ఉండదు. నా కుటుంబాన్ని నేను చాలా మోసం చేస్తున్నా. నన్నే నేను మోసం చేస్తున్నా. అందరికీ ఫేక్ విహారిని చూపిస్తున్నా. లక్ష్మీ ఒక మగాడు ఒక ఆడదాని మెడలో వేసిన తాళికి చాలా విలువ ఉంటుంది అంటారు దాని విలువ నాకు తెలీదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను నీ మెడలో వేసిన మూడు ముళ్లు కారణంగానే నువ్వు నన్ను కాపాడావని రక్తం ఇచ్చావని. నేను వేసిన మూడు ముళ్లకి నేను అర్థం కాలేకపోతున్నా భర్తగా ఉండలేకపోతున్నా కానీ నువ్వు భార్య స్థానానికి అర్థం కలిగిస్తున్నావ్. నేను నీ మెడలో వేసిన మూడు ముళ్లు ఓ అబద్ధపు ముళ్లు దయచేసి నువ్వు వాటికి అర్థం కలిగేలా చేయకు ఎందుకంటే నేను ఎప్పటికీ నీకు భర్తని కాలేను. నిన్ను భార్యగా నేను అంగీకరించలేను. 

ఇంతలో విహారికి సత్య కాల్ చేస్తాడు. ఎలా ఉందని అడిగి దేని గురించి ఆలోచించకని చెప్తాడు. దాంతో విహారి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా అని అడుగడుగునా సమస్యలు వస్తున్నాయని అంటాడు. ఏమైందని సత్య అడిగితే ఫొటో గురించి దాని వల్ల ఇంట్లో జరిగిన రచ్చ గురించి చెప్తాడు. కనక మహాలక్ష్మీ వాళ్ల అమ్మ వాళ్లు అదే హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ల వల్ల ఫొటో బయటకు వచ్చుంటుందని సత్య అంటాడు. ఈ విషయంలో ఇక జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు.

మరోవైపు లక్ష్మీ స్వామిజీ చెప్పిన పూజ చేస్తుంది. నీ భర్త ఆశీర్వాదం తీసుకోవాలని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక పండు అక్కడికి వస్తాడు. దాంతో ఎవరో అనుకొని లక్ష్మీ తెగ కంగారు పడుతుంది. పండుని రావడంతో తాను సీక్రెట్‌గా పెట్టుకున్న దేవుడిని పూజని పండుకి చూపిస్తుంది. పండు చూసి చాలా సంతోషిస్తాడు. ఈ పూజతో అయినా నువ్వు విహారి బాబు కలిసిపోవాలని పండు అంటాడు. దాంతో లక్ష్మీ పొరపాటున కూడా అలా అనొద్దని అంటుంది. విహారి ప్రాణం కోసమే ఈ పూజ చేస్తున్నానని లక్ష్మీ అంటుంది. పూజ గురించి విహారితో పాటు ఇంట్లో ఎవరికీ తెలీకూడదని లక్ష్మీ పండుతో చెప్తుంది. ఇక విహారికి తెలీకుండా విహారి చేత ఆశీర్వాదం తీసుకోవాలని అలాగే విహారికి తెలీకుండా విహారి తిన్న ప్లేట్‌లో తాను తినాలని సాయం చేయమని లక్ష్మీ పండుతో చెప్తుంది. దాంతో పండు సరే అంటాడు. ఇక పండు కోసం వసుధ వెతుకుతూ అక్కడికి వస్తుంది. లక్ష్మీ గదిలో అగరబత్తీల వాసన రావడంతో అగరబత్తీల వాసన వస్తుంది ఏమైనా పూజ చేస్తున్నావా అని వసుధ అడిగితే దోమలు ఉన్నాయని అగరబత్తీ వెలిగించానని లక్ష్మీ కవర్ చేస్తుంది. 

మరోవైపు అంబిక, సుభాష్‌ని కలుస్తుంది. విహరిని ఎంక్వైరీ చేయాలని అంటుంది. విహారిలో మనకు తెలీని ఓ స్టోరీ ఉందని పెళ్లి ఫొటో చూపిస్తుంది. విహారి మా దగ్గర ఏదో దాస్తున్నాడని అంటుంది. విహారి అయితే గ్రాఫిక్‌లో చేయించానని విహారి అబద్ధాలు చెప్తున్నాడు అని క్లియర్‌గా తెలుస్తుందని అంటుంది. ఇక ఫొటో వెనక ఫొటో స్టూడియో అడ్రస్ ఉండటంతో ఆ ఫొటో స్టూడియోకి వెళ్లి ఎంక్వైరీ చేద్దామని అంటుంది. దాంతో సుభాష్ విహారి దాచిన నిజం బయట పెడదామని అనుకొని అక్కడకి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి ప్రవర్తనకు బిత్తరపోయిన ఫ్యామిలీ.. నయని నటనా నిజమా అని జుట్టు పీక్కుంటున్నారుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget