కస్తూరి తెలుగు సినిమాలివే..అన్నీ స్టార్ హీరోలతోనే! కస్తూరి శంకర్ 1991లో తమిళ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసింది..తెలుగులో గ్యాంగ్ వార్ మూవీతో పరిచయం అయింది నందమూరి నటసింహం బాలకృష్ణతో 'నిప్పు రవ్వ' సినిమాలో హీరోయిన్ గా నటించింది.. నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అన్నమయ్య సినిమాతో మరింత గుర్తింపు సంపాదించుకుంది కస్తూరి జగపతిబాబుతో చిలక్కొట్టుడులో హీరోయిన్ గా నటించింది, నాగార్జున - రవీనాటాండన్ నటించిన ఆకాశ వీధీలో సినిమాలో మెరిసింది డాన్ శీను, శమంతకమణి, గాడ్ ఫాదర్, సింబా సినిమాల్లో నటించి మెప్పించింది కస్తూరి... తెలుగుతో పాటూ తమిళం, కన్నడంలోనూ హీరోయిన్ గా వరుస ఆఫర్లు అందుకుంది... ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తోంది కస్తూరి.. తెలుగులో గృహలక్ష్మి సీరియల్ లో తులసిగా నటించి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైంది కస్తూరికి వివాదాలు కొత్త కాదు..లేటెస్ట్ గా.. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైంది కస్తూరి...