Trinayani Serial Today November 18th: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి ప్రవర్తనకు బిత్తరపోయిన ఫ్యామిలీ.. నయని నటనా నిజమా అని జుట్టు పీక్కుంటున్నారుగా!
Trinayani Today Episode త్రినేత్రి ఇంటికి వచ్చి విశాల్‌ని బాబుగారు అని మాట్లాడటం మిగతా అందర్ని గుర్తుపట్టకపోవడంతో వచ్చింది నయనినేనా కాదా అని సందేహం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికంగా మారింది.
Trinayani Serial Today Episode విశాల్ ఇంటికి త్రినేత్రి రావడం బాబుగారు అని విశాల్‌ని పిలవడంతో వల్లభ షాక్ అయి పడిపోతాడు. ఇక త్రినేత్రి ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. ఇక విశాల్ త్రినేత్రిని నయని అని పిలిస్తే దానికి త్రినేత్రి నన్నా బాబుగారు అంటుంది. నీకు కాకుండా ఇంకెవరికి పిలుస్తారు అక్కా అని సుమన అడిగితే నా కంటే పెద్దగా ఉన్నారు నన్ను అక్కా అంటారేంటి అని త్రినేత్రి అంటుంది. త్రినేత్రి మాటలకు అందరూ షాక్ అయిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
తిలోత్తమ: ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ హాస్పిటల్ నుంచి లంగావోణిలో వచ్చావేంటి.
త్రినేత్రి: నేను హాస్పిటల్ నుంచి రాలేదు. గుడికి వెళ్లినట్లు గుర్తు.
విక్రాంత్: గుడికా.
త్రినేత్రి: అవును. విశాల్ బాబు రూపం తప్ప ఏం నాకు స్పష్టంగా తెలీడం లేదు.
పావనా: పోనీలే బాబు జరిగింది గుర్తు రాకపోయినా నయని అమ్మ క్షేమంగా ఇంటికి వచ్చింది.
త్రినేత్రి: ఎందుకు అందరూ నన్ను నయని అంటున్నారు. నేను త్రినయనిని కాదు నా పేరు త్రినేత్రి. ఎందుకు అలా ముఖాలు చూసుకుంటున్నారు బాబు గారు నా పేరే కదా చెప్పింది.
విశాల్: త్రినయని అనే పేరుని త్రినేత్రి అని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
త్రినేత్రి: త్రినయని అన్నా మూడు కళ్లే త్రినేత్రి అన్నా అదే అర్థం కన్నా ఎలా పిలవాలి అని పిస్తే అలా పిలవండి ముఖ్యంగా మీరు మీకు నచ్చినట్లు పిలిస్తే ఆ పేరే నాకు నబ్బింది అనుకుంటా.
హాసిని: సిగ్గేస్తుందా చెల్లి.
త్రినేత్రి: అవును అక్కా.
సుమన: నువ్వు వెళ్లినప్పుడు కట్టుకున్న చీర ఏది.
త్రినేత్రి: ఏ చీర అక్క.
సుమన: నువ్వు నాకు అక్క నేను నీకు అక్క కాదు. చెల్లి అను లేదంటే సుమన అను.
త్రినేత్రి: బాబుగారు పాప ఎంత ముద్దుగా ఉందో.
వల్లభ: ఏంటి ఇదంతా నాకు ఏం అర్థం కావడం లేదు.
విశాల్: నయని.. వదినా తనని లోపలికి తీసుకెళ్లు. ఇప్పుడు ఎవరూ ఏం మాట్లాడొద్దు ప్లీజ్.
హాసిని త్రినేత్రిని తీసుకొని వెళ్తానంటే ఇళ్లు చూపిస్తారా అని త్రినేత్రి అడిగి బాబుగారి ఇళ్లు నా ఇళ్లే కదా పద చూపించు అని అంటుంది. అందరూ త్రినేత్రినే నయని అనుకొని త్రినేత్రి ప్రవర్తనకు బిత్తర పోతారు. విశాల్ తప్ప మరెవరినీ గుర్తు పట్టడం లేదు మతిస్థిమితంగా లేదు అనుకుంటా అని తిలోత్తమ అంటుంది. దానికి విక్రాంత్ వచ్చింది నయని వదినే అంటావా అని అనుమానం వ్యక్తం చేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇక విక్రాంత్ బిత్తర పోయి బయటకు వెళ్తాడు. మరోవైపు తిలోత్తమ, వల్లభలు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరూ ఏం అర్థం కావడం లేదని నెత్తిపట్టుకుంటారు. నేను త్రినయని కాను త్రినేత్రి అంటుంది ఏంటి ఇదంతా అనుకుంటారు. విశాల్‌ని గుర్తుపట్టింది హాసిని చెల్లి అంటే అక్కా అంది ఏమై ఉంటుందని తిలోత్తమ ఆలోచిస్తుంది. కన్న కూతురు అయిన గాయత్రీ పాప బాగుంది అనుకుంది కానీ ఎత్తుకోలేదు ఏంటి అనుకుంటారు. తలకు గాయమై అలా ప్రవర్తిస్తుందా లేదంటే ఇదంతా నయని నాటకమా అని తిలోత్తమ కొడుకుతో అంటుంది.
విశాల్ తల్లి ఫొటో దగ్గరకు వెళ్లి త్రినయని త్రినేత్రిగా వచ్చిందని తలకు గాయం కావడం వల్లే అలా మారిందేమో అని అంటాడు. ఇక త్రినేత్రి విశాల్ దగ్గరకు వస్తుంది. గాయత్రీదేవి ఫొటో చూసి ఈవిడ ఎవరు ఎక్కడున్నారు అని త్రినేత్రి అడుగుతుంది. తన తల్లి గురించి కూడా మర్చిపోయిందని అనుకుంటాడు. ఇక హాసిని వచ్చి నువ్వేంటి చెల్లి నా కళ్లు కప్పి మా మరిది దగ్గరకు వచ్చావని అంటే దగ్గరగా చూడాలి అనిపించిందని అంటుంది. ఇక హాసిని దేవీపురం అనగానే త్రినేత్రికి తన బామ్మ, మేనత్తమేనమాలు నయని విశాల్‌తో మాట్లాడటం విష ప్రయోగం అన్నీ చెప్తుంది. ప్రసాదం తినడం వల్ల ప్రాణాలు పోయావని చెప్తుంది. విక్రాంత్ డాక్టర్‌కి కాల్ చేస్తే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.