Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 1st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆఫీస్‌లో అంబికను అల్లాడించేసిన లక్ష్మీ.. మదన్ లక్ష్మీలకు పెళ్లి చేస్తానన్న పద్మాక్షి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని మదన్ ప్రేమిస్తున్నాడని సహస్ర తెలుసుకొని ఇద్దరికీ పెళ్లి చేసి లక్ష్మీ అడ్డు తొలగించుకోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీతో ఫైల్స్ పంపడంతో విహారి హెచ్‌ఆర్ దగ్గరకు లక్ష్మీని తీసుకెని వెళ్లి సీరియస్ అవుతాడు. ఇంకోసారి ఇలా వేసుకున్న బట్టలు చూసి స్థాయి నిర్ణయిస్తే ఉద్యోగం పీకేస్తానని వార్నింగ్ ఇస్తాడు. హెచ్ ఆర్ లక్ష్మీకి సారీ చెప్తాడు. తర్వాత విహారి లక్ష్మీని తీసుకెళ్లి క్యాబిన్‌లోకి తీసుకెళ్లి నువ్వు హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ అని చెప్పి చూడాల్సిన ఫైల్స్ సిస్టమ్ ఇచ్చి మీటింగ్ ఉంది దాని తర్వాత వచ్చి కలవమని అంటాడు.
లక్ష్మీ బయటకు వెళ్తూ బాయ్ విహారి కోసం కాఫీ తీసుకెళ్తుంటే లక్ష్మీ ఆపి తాను తీసుకెళ్తుంది. నువ్వు ఎందుకు తీసుకొచ్చావని విహారి అడిగితే పర్లేదు అంటుంది. ఇక అంబిక వచ్చి ఆర్‌కే, కేఎస్ఎస్ అనే రెండు కంపెనీల పేర్లు చెప్పి వాళ్లతో కేఎస్ఎస్ కంపెనీ బాగుందని వాళ్లకి సబ్ కాంట్రాక్ట్ ఇద్దామని అంటుంద. విహారి కూడా సరే అంటాడు. కానీ ఇంతలో లక్ష్మీ ఆపి ఆర్‌కే ఇండ్రస్ట్రీ ప్రొఫైల్ బాగుందని వాళ్లకి ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్నా సక్సెస్ రేట్ బాగుందని అంటుంది. నీకేం తెలీదు అని అంబిక అంటే నేను ఫైల్ చదివాను కావాలంటే ఆన్ లైన్‌లో కంపెనీ బ్యాగ్రౌండ్ వివరాలు చూడండి అంటుంది. దాంతో అంబిక చెప్పిన కంపెనీని కాదని లక్ష్మీ చెప్పిన కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వమని విహారి చెప్తాడు. దాంతో అంబిక వచ్చిన రోజే నా లాభం నొక్కేశావు నీ అంతు చూస్తా అనుకుంటుంది.
మరోవైపు మధన్ గిటారు ప్లే చేస్తూ లక్ష్మీ కోసం ఇళ్లంతా తిరిగేస్తాడు. సహస్ర చూసి వెంట పడి మదన్‌ని గమనించి ఏం చేస్తున్నావ్ ఎవరిని వెతుకుతున్నావని అడుగుతుంది. లేదని మదన్ తడబడతాడు. సహస్ర పదే పదే అడగటంతో ఇంట్లో నా డ్రీమ్ గల్ ఉందని లక్ష్మీని ప్రేమిస్తున్నానని చెప్తాడు. సహస్ర షాక్ అయిపోతుంది. పని మనిషి నీ డ్రీమ్‌గర్లా అని నీ బుర్ర పని చేస్తుందా అని తిడుతుంది. తర్వాత ఆలోచించి లక్ష్మీని వీడికి అంటకట్టేస్తే నాకు బావకి మధ్యలో ఎవరూ ఉండరని మదన్, లక్ష్మీల జంట బాగుంటుందని అంటుంది. మదన్ లవ్‌కి సపోర్ట్ చేస్తుంది లక్ష్మీతో పెళ్లి చేస్తానని అంటుంది.
విహారి ఇంటికి వెళ్దామని లక్ష్మీతో అంటే నాకు చిన్న పని ఉంది మీరు వెళ్లండి అంటుంది. నేను వెయిట్ చేస్తానని చెప్పి విహారి ఉంటాడు. ఇక లక్ష్మీ కొన్ని ఫైల్స్ చూస్తూ హడావిడిగా కొన్ని పేపర్లు పట్టుకొని సీరియస్‌గా అంబిక దగ్గరకు వెళ్తుంది. మాట్లాడాలి అని లక్ష్మీ అంటే అంబిక మాట్లాడను అంటుంది. దాంతో లక్ష్మీ నేను విహారి బాబుతో మాట్లాడుతాను అంటుంది. దాంతో అంబిక మాట్లాడుతుంది. ఇక అంబిక ముందు కొన్ని పేపర్లు ముందు పెట్టి ఈ 21 కంపెనీలకు మన కంపెనీ నుంచి ఫండ్స్ వెళ్లాయి. వాటి డిటైల్స్ ఎక్కడాలేవు. 57 కోట్ల ఫండ్స్ ఏమయ్యాయో తెలీదు అని ఆ కంపెనీలు అన్నీ డొల్ల కంపెనీలు అని డీప్‌గా స్టడీ చేయడంతో తేలిందని అంటుంది. నా మీద అనుమానమా అని అంబిక అంటే నాది అనుమానం కాదు కన్ఫ్మరేషన్ అంటుంది. ఈ విషయం విహారి దగ్గర చెప్పను.. ఎవరితో మాట్లాడను ఇలా చేయాలి అంటే రేపటిలో ఆ 57 కోట్లు వచ్చేయాలని లేదంటే విహారికి విషయం చెప్తాను అంటుంది.
లక్ష్మీ ఇచ్చిన షాక్‌కి అంబిక బిత్తర పోతుంది. ఇక సహస్ర మదన్‌ని తల్లి దగ్గరకు తీసుకెళ్లి మదన్ లక్ష్మీని లవ్ చేశాడని చెప్తుంది. మదన్, లక్ష్మీలకు పెళ్లి చేయాలని ఆ బాధ్యత మనదే అంటుంది. పెళ్లి అవ్వగానే తనని అమెరికా తీసుకెళ్లిపోతా అంటాడు. పద్మాక్షికి, సహస్రకి మదన్ థ్యాంక్స్ చెప్తాడు. లక్ష్మీ, మదన్‌లకు పెళ్లి చేసి లక్ష్మీని తరిమేయాలని తల్లీకూతుళ్లు అనుకోవడం వసుధ వింటుంది. లక్ష్మీకి ఈ విషయం తెలిస్తే బాధ పడుతుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!





















