Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial : లక్ష్మీకి ప్రమాదం, ఇంటికొచ్చిన ఆదికేశవ్; విహారి పరిస్థితి ఏంటీ?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్ర లక్ష్మీ తల్లిదండ్రుల్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీ విహారి కనపించకుండా దాక్కోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీ వస్తుంటే అంబిక మేడ మీద నుంచి పూలకుండీ విసిరేయాలని ప్రయత్నిస్తుంది. ఇంట్లో దీపాలు కొండెక్కడంతో యమున కంగారు పడుతుంది. అంబిక పూలకుండీ విసిరేయగానే లక్ష్మీ చూసి విహారిని పక్కకు నెట్టుతుంది. లక్ష్మీ చేతికి గాయం అవుతుంది.
యమున చూసి కంగారు పడుతుంది. లక్ష్మీ తనని కాపాడి ఇలా గాయం చేసుకుందని విహారి యమునతో చెప్తాడు. ఫస్ట్ ఎయిడ్ చేస్తానని యమున లక్ష్మీని తీసుకెళ్తుంది. ఇద్దరినీ చూసి విహారి అత్తాకోడల్లా ఉండాల్సిన వాళ్లు నా వల్ల ఒకరికి ఒకరు తెలీకుండా ఉన్నారని అనుకుంటాడు. ఇంతలో సహస్ర ఆదికేశవ్, గౌరీలను తీసుకొని వస్తుంది. మీరు మా ఇంట్లో వారం ఉండాలి అని సహస్ర చెప్తుంది. విహారి వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. సహస్ర వీళ్లని తీసుకొచ్చింది ఏంటా అని అనుకుంటాడు. లోపలికి తీసుకెళ్తుంది. లక్ష్మీని మామయ్య వాళ్లు చూస్తే చాలా ప్రమాదం అని లక్ష్మీకి విషయం వెంటనే చెప్పాలి అని విహారి దాక్కొని పరుగులు తీస్తాడు.
సహస్ర ఆదికేశవ్, గౌరీలను ఇంటికి తీసుకొచ్చి గౌరవమర్యాదలు చేస్తుంది. పండుకి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. యమున లక్ష్మీకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. ప్రతీ సారి నువ్వే విహారిని కాపాడుతున్నావ్ నువ్వు లైఫ్‌లో సెటిల్ అయితే నాకు అంతే చాలు అని యమున అంటుంది. ఇద్దరూ కలిసి బయటకు వస్తుంటారు. విహారి ఆదికేశవ్ వాళ్ల కంట పడకుండా దాక్కొని చూస్తుంటాడు. లక్ష్మీ వస్తూ పూలకుండీకి తగులుతుంది. అది సౌండ్ రావడంతో ఆదికేశవ్ వాళ్లు పైకి చూసే టైంకి లక్ష్మీ పూలకుండీ తీయడానికి కిందకి వంగి వాళ్లకి కనిపించదు. పండు వాళ్లని చూసి లక్ష్మీమ్మ అమ్మానాన్నలు ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటాడు.
విహారి పండుకి సైగలు చేస్తాడు. పండు వాళ్లని మాటల్లో పెట్టగానే విహారి మేడ మీదకు పారిపోతాడు. సహస్ర చూసి బావా భలే తప్పించుకున్నావ్ కదా ఈ వారం రోజులు నువ్వు లక్ష్మీ కలవకుండా ఉండాలని తీసుకొచ్చా తర్వాత మనం యూఎస్ వెళ్లిపోతాం కదా అనుకుంటుంది. లక్ష్మీ కిందకి వెళ్తుంటే విహారి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని తీసుకెళ్తాడు. సహస్ర మీ అమ్మానాన్నల్ని తీసుకొచ్చిందని చెప్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. సహస్ర యమునని ఆదికేశవ్ వాళ్లతో మాట్లాడిస్తుంది. వారం రోజులు మీ అమ్మానాన్న ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. వారం ఉంటే దొరికిపోతాం అని లక్ష్మీ కంగారు పడుతుంది. ఎలా అయినా జాగ్రత్తగా ఉండాలి అని విహారి చెప్తాడు.
ఆదికేశవ్ వసుధని పలకరిస్తారు. అందరూ చక్కగా మాట్లాడుకుంటారు. పద్మాక్షి ఇంతలో వచ్చి కోపంగా చూసి ఎవరు వీళ్లని ఇంట్లోకి రానిచ్చింది అని అరుస్తుంది. అలా అంటావ్ ఏంటి అమ్మా అని సహస్ర అంటే పీటల మీద నీ పెళ్లి ఆపేసివాళ్లకి మర్యాద ఏంటి? ఏం ముఖం పెట్టుకొని వచ్చారు అంటుంది. సహస్ర తల్లి మీద గట్టిగా అరిచి అమ్మా నేనే తీసుకొచ్చాను వాళ్లు నా అతిథులు అంటుంది. సహస్రను అంబిక, పద్మాక్షి తిడతారు. ఆదికేశవ్ గౌరీతో మన వల్ల సహస్రమ్మ మాటలు పడుతుంది పద వెళ్లిపోదాం అంటారు. ఆగండి అంకుల్ అని సహస్ర ఆపుతుంది. అమ్మ నువ్వు నా విషయంలో తప్పు జరిగితే ఎలా ఊరుకోవా ఆయన కూడా నన్ను తన కూతురిలా భావించి దుర్ముహూర్తంలో పెళ్లి వద్దు అని ఆపి మంచి చేశారు కదా అంటుంది.
ఆదికేశవ్ పద్మాక్షితో నాకు ఆడపిల్ల ఉంది అమ్మా పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని కనకమహాలక్ష్మీని తన మేనత్త వద్దని పెళ్లి ఆపడం గుర్తు చేసుకుంటారు. ప్రాజెక్ట్ విషయంలో ఆయన నాకు సాయం చేశారు ఆయన వారం రోజులు ఇక్కడ ఉంటారు అని తీసుకొచ్చా నువ్వు అర్థంపర్థం లేని కోపాలు చూపించకు అని తల్లికి చెప్తుంది. నీ ఇష్టం అని పద్మాక్షి వెళ్లిపోతుంది. సహస్ర తర్వాత ఆదికేశవ్ వాళ్లతో అంకుల్ ఏం అనుకోవద్దు మా అమ్మకి కోపం ఎక్కువ కానీ చాలా మంచిది అని చెప్తుంది. యమున కూడా మా వదిన చాలా మంచిది అని చెప్తుంది. ఆదికేశవ్ వాళ్లకి గెస్ట్ రూంకి పంపిస్తారు.
ఆదికేశవ్ గదికి వెళ్లి కనకానికి ఫోన్ చేస్తారు. లక్ష్మీ లిఫ్ట్ చేయకపోవడంతో విహారికి కాల్ చేస్తాడు. విహారి దాక్కొని చాటుగా మాట్లాడుతాడు. లక్ష్మీకి ఫోన్ ఇస్తాను అని చెప్పి బయటకు వెళ్లబోతే విహారి గది ఎదురుగా ఆదికేశవ్ ఉంటాడు. అది చూసి విహారి షాక్ అయిపోతాడు. గదిలోకి వెళ్లి డోర్ వేసేసి కనకం పడుకుందని చెప్తాడు. తర్వాత విహారి దగ్గరకు సహస్ర వచ్చి ఏంటి బావ ఏమైంది ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చేశావ్ ఏంటి అని అడిగితే నెట్ వర్క్ పని చేయడం లేదు అని విహారి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















